English | Telugu

అప్పీకి ఫారిన్‌ పోరి పప్పీ!

‘జబర్దస్త్‌’లో టీమ్‌ లీడర్‌ ఆసమ్‌ అప్పీది టిపికల్‌ బాడీ లాంగ్వేజ్‌, కామెడీ స్టయిల్‌. కమెడియన్‌కు రంగు అక్కర్లేదని ప్రూవ్‌ చేసినవాళ్ళు గతంలో ఉన్నారు. లేటెస్ట్‌ ఎగ్జాంపుల్‌ ఆసమ్‌ అప్పీ అలియాస్‌ అప్పారావు. ఓంకార్‌ షో ‘సిక్త్స్‌ సెన్స్‌’కు భార్యతో కలిసి అతడు వచ్చాడు. ఇంతకు ముందు ఈటీవీ ఈవెంట్స్‌కు అప్పారావు భార్య వచ్చారు. ఆవిడ తనదైన శైలిలో కామెడీ చేశారు. ఇందులోనూ చేసినట్టు ప్రోమో చూస్తుంటే తెలుస్తోంది.

‘వయసు పెరుగుతున్న కొద్దీ మీలో ఊపు పెరుగుతుందే’ అని ఓంకార్‌ అంటే... ‘మనిషికి మాత్రమే వయసు, మనసుకు నో వయసు’ అని అప్పీ చెప్పుకొచ్చారు. భార్యతో కలిసి డ్యాన్స్‌ చేశారు. తర్వాత ‘నువ్వు శ్రుతీ హాసన్‌వి కాదు, మతీ హాసన్‌వి’ అని అప్పారావ్‌ వైఫ్‌ మీద పంచ్‌ వేశాడు. ‘నేను శ్రుతీ హాసన్‌ అయితే నీ పక్కన ఉంటానేంటి? రవితేజ పక్కనే ఉందను’ ఆవిడ కౌంటర్‌ ఇచ్చారు. అయితే, అప్పారావు అండ్‌ వైఫ్‌ చేసిన కామెడీ కంటే ప్రోమో ఎండింగ్‌లో అప్పీకి ఫారిన్‌ పాప ఇచ్చిన పప్పీ... అదేనండీ ముద్దు హైలైట్‌ అని చెప్పాలి.

కమెడియన్‌ కమ్‌ హీరో ‘సుడిగాలి’ సుధీర్‌ కూడా ‘సిక్త్స్‌ సెన్స్‌ 4’కు వచ్చారు. అతడితో పాటు ఇంద్రజ సందడి చేశారు. ఆవిడలో ఇంత కామెడీ టైమింగ్‌ ఉందని ‘సిక్త్స్‌ సెన్స్‌ 4’ ప్రోమో చూసేవరకూ తెలియలేదు. రోజా అనారోగ్య కారణాలతో ‘జబర్దస్త్‌’కు కొన్ని రోజులు రాని టైమ్‌లో ఇంద్రజ జడ్జ్‌గా చేశారు. అప్పుడు ఎక్కువగా నవ్వడం తప్ప ఏమీ చేయలేదు. ఇప్పుడు అలా కాదు.

‘నీ పెద్ద కొడుకు సెంటర్‌కి కొట్టమన్నాడు’ అని సుధీర్‌ అన్నాడు. ‘ఆయన (ఓంకార్‌) కొడుకు అని నేను నీకు చెప్పానా?’ అని ఇంద్రజ ఇమ్మీడియేట్‌గా కౌంటర్‌ ఇచ్చారు. ‘అంటే... నేను అన్నయ్య అంటున్నాను’ అని సుధీర్‌ చెప్పబోగా... ‘మీరు ఎంతోమందిని అన్నయ్యా అంటారు. వాళ్ళందరూ కొడుకులు అయిపోతారా?’ అని నవ్వేశారు ఇంద్రజ. దెబ్బకు ‘అమ్మా’ అని సుధీర్‌ దణ్ణం పెట్టేశాడు. ఈ టైమింగ్‌ ఉంటే నెక్ట్స్‌ ఈటీవీ కామెడీ షోస్‌లో బిజీ అవ్వడం ఖాయం.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.

Podharillu:పొదరిల్లు సీరియల్ లో సూపర్ ట్విస్ట్.. మహాలక్ష్మికి పెళ్ళి ఫిక్స్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -02 లో.....మహాలక్ష్మి ప్రాజెక్ట్ డిజైన్ రెడీ చేసి హాల్లోకి వస్తుంది. వాళ్ళ నాన్న ప్రతాప్ ఇంకా అన్నయ్య మహాలక్ష్మికి డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తారు. ఒకసారి చూడు మహా అని వాళ్ళ అన్నయ్య అంటాడు. నాకేం ఇప్పుడు పెళ్లి వద్దు అవసరం అయితే వదిన నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోండి అని మహా అంటుంది. ఇప్పుడు డిజైన్స్ చూపించడానికి వెళ్తున్నానని తెలిస్తే డాడీ వద్దని అంటాడనుకొని డాడీ కాలేజీలో సర్టిఫికెట్ ఉన్నాయి తెచ్చుకుంటానని చెప్తుంది.