English | Telugu

శివాజీ ఎలిమినేషన్.. షాక్‌లో కొడుకు!


బిగ్ బాస్ సీజన్-7 లో టైటిల్ ఫేవరెట్ గా ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్ శివాజీ. తన ఆటతీరుతో, మాటతీరుతో టాప్-5 లో ఒకడిగా ఉంటు వస్తున్నాడు శివాజీ. అయితే నాల్గవ వారం జరిగిన టాస్క్ లో శివాజీ చేతికి బలంగా గాయమైంది. అయితే ఆ వయసులో శివాజీ గేమ్ లో చూపించిన ఆసక్తికి మరింత ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది.

అప్పటినుండి శివాజీ తన చేతు నొప్పి ఇబ్బంది పెడుతున్నా మేనేజ్ చేస్తున్నాడు. అయితే మొన్నటి వారం నయని పావని ఎలిమినేషన్ రోజున మోస్ట్ ఎమోషనల్ అయ్యాడు శివాజీ‌. తనకి నొప్పి బాగా ఉందని, ఆ అమ్మాయి చాలా తెలివిగలది, ఆట బాగా ఆడుతుంది. తన స్థానంలో నన్ను బయటకు పంపించండి అంటూ శివాజీ రిక్వెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే నిన్నటి జరిగిన ఎపిసోడ్ లో శివాజీని సీక్రెట్ రూమ్ కి పిలిచాడు. ఏం అయిందని శివాజీని బిగ్ బాస్ అడుగగా.. " నాకు చేయి నొప్పి చాలా ఉంది‌. అసలు ఉండాలనిపించట్లేదు. నాలో సత్తువ ఉన్నంతవరకు ఆడుతాను. అసలెవరికీ బయపడను. కానీ ఈ చేయి నొప్పి ఎక్కువగా ఉంది. తట్టుకోలేకపోతున్నాను. గౌతమ్ కృష్ణ నామినేషన్లో చెప్పినట్టు నేను గేమ్ ఆడలేకపోతున్నాను‌. నా స్థానంలో యంగ్ స్టర్స్ ఉంటే బాగా ఆడతారని నాకనిపిస్తుంది. దయచేసి నన్ను బయటకు పంపించండి బిగ్ బాస్" అని శివాజీ రిక్వెస్ట్ చేశాడు. మరోసారి మిమ్మల్ని హాస్పిటల్ కి తీసుకెళ్తాం అప్పటికి బాగోలేకపోతే మీరు ఇంటికి వెళ్లవచ్చు అన్నట్టుగా బిగ్ బాస్ చెప్పాడు.

బిగ్ బాస్ హౌస్ లో టాప్-5 లో మొదటి స్థానంలో శివాజీ, ఆ తర్వాత పల్లవి ప్రశాంత్, యావర్ ఉంటారని ప్రేక్షకులు భావించారు. కానీ శివాజీ చేతిగాయం తనని చాలా ఇబ్బంది పెడుతుందని తెలుస్తుంది. గతవారమే శివాజీ ఎలిమినేషన్ అని అందరు అన్నారు. అయితే చేతి నొప్పి కారణంగా మెడికల్ టెస్ట్ ల నిమిత్తం బయటకు తీసుకెళ్ళారని తెలిసింది. ఇప్పుడు అదే నడుస్తుంది. అయితే శివాజీ తనకి తానే ఎగ్జిట్ అవుతున్నాడు. మరి ఈ సారి మెడికల్ టెస్ట్ తర్వాత శివాజీ బిగ్ బాస్‌లో ఉంటాడా లేదా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. తన డాడీ ఆడే అటను డైలీ చూస్తున్న తన చిన్న కోడుకు శివాజీ తీసుకున్న నిర్ణయానికి షాక్ అయ్యాడట. శివాజీ కూడా బిగ్ బాస్ కి వచ్చిన్నప్పటి నుంచి హౌస్ మెట్స్‌తోను మరియు నాగార్జనతోను తన కొడుకు గురించి కొన్ని విషయాలు చెప్పిన విషయం తెలిసిందే.

Jayam serial: వీరూ ప్లాన్ ని కనిపెట్టిన గంగ.. రుద్ర తెలుసుకుంటాడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -146 లో.... రుద్రకి ఎదురుగా గంగ వెళ్తుంది కానీ రుద్ర ఫోన్ మాట్లాడుతూ వెళ్ళిపోతాడు. కొంచెం దూరం వెళ్ళగానే రుద్రకి రింగ్ కనిపిస్తుంది. అది తీసుకొని చూస్తాడు. అప్పుడే ప్రమీల, ప్రీతీ వస్తారు. అన్నయ్య ఆ రింగ్ గంగ వదినది అని ప్రీతీ అంటుంది. ఈ రింగ్ ప్రపంచంలో ఆవిడకి ఒక్కదానికే ఉందా ఏంటని రుద్ర అంటాడు. ఆ తర్వాత అటుగా వెళ్తున్న గంగని రుద్ర పిలుస్తాడు. గంగ ముసుగులో ఉంటుంది. రుద్ర పిల్వగానే వస్తుంది. ఈ రింగ్ మీదేనా అని అడుగుతాడు. గంగ నాదేనని తీసుకుంటుంది..