English | Telugu

చాణక్యుడు శివాజీ మోస్ట్ పవర్ ఫుల్ జర్నీ.. ప్రోమో అదుర్స్!

బిగ్ బాస్ సీజన్-7 లో ప్రస్తుతం హౌస్ మేట్స్ జర్నీ వీడియోలు ప్లే చేస్తున్నారు బిగ్ బాస్. నిన్నటి ఎపిసోడ్ లో అమర్ దీప్, అంబటి అర్జున్ ల జర్నీ వీడియోలని చూపించగా.. నేడు హౌస్ లో శివాజీ జర్నీ చూపించబోతున్నారనే ప్రోమో రిలీజ్ చేశారు. ఇప్పుడు ఈ ప్రోమో ఫుల్ వైరల్ గా మారింది.

నా ఇరవై సంవత్సరాల సినిమా కెరీర్ ఒక ఎత్తు, లైఫ్ లో బిగ్ బాస్ ఒక ఎత్తు అని శివాజీ చెప్పాడు. శివాజీ.. మిమ్మల్ని ఒక వేలెత్తి చూపిస్తే మిగతా నాలుగు వేళ్ళు వాళ్ళ వైపే ఉండేలా చేయగల మాటకారి మీరు అని బిగ్ బాస్ చెప్తూ.. రాజుగారి పెద్ద పెళ్ళాం మంచిదంటే చిన్నపెళ్ళాం చెడ్డదని కాదని శివాజీ చెప్పిన మాటలని ప్లే చేసి చూపించాడు బిగ్ బాస్. మీ గాయం మిమ్మల్ని ఎంత వేధించిన ఓటమి వైపు చూడలేదు. మీ అబ్బాయి మీ డాక్టర్ గా వచ్చినప్పుడు మీ బాధనంతా మర్చిపోయారని బిగ్ బాస్ చెప్తుండగా శివాజీ ఎమోషనల్ అయ్యాడు. సరైన సమయంలో సరైన పావులు కదిపి చాణక్యుడులా నిలిచాడని టాస్క్ లో శోభాశెట్టితో శివాజీ డిఫెండ్ చేసిన వీడియోని ప్లే చేశాడు బిగ్ బాస్. ఈ పూర్తి సీజన్ లో మీ మీద పైచేయి సాధించిన ఒకే ఒక విషయం ఏంటో తెలుసా.. కాఫీ. అలా చెప్పి శివాజీ కాఫీ కోసం పడే ఆవేదనని కళ్ళకి కట్టినట్టు చూపించాడు. కంటెస్టెంట్ గా మొదలై కన్ఫమేషన్ పొంది హౌస్ మేట్ అయ్యారు. మీ ఆటతీరే మిమ్మల్ని ఈ రోజు ఈ స్థానంలో నిలబెట్టిందని బిగ్ బాస్ చెప్పగా.. థాంక్స్ బిగ్ బాస్ అని శివాజీ చెప్పాడు.

ఇప్పటికి శివాజీతో కలిపి ముగ్గరి జర్నీ వీడియోలు యూట్యూబ్ లో రిలీజ్ చేయగా.. శివాజీ జర్నీ వీడియోకే అత్యధిక వీక్షకాధరణ లభిస్తుంది. ఇది పవర్ ఫుల్ జర్నీగా బిగ్ బాస్ చరిత్రలో నిలిచిపోతుంది. శివాజీ బిగ్ బాస్ టైటిల్ విజేత అని దీన్ని బట్టే తెలుస్తుంది. బిగ్ బాస్ హౌస్ లో ఇప్పటికే శివాజీ తన ఫెయిర్ గేమ్ తో ప్రేక్షకుల మనసు గెలుచుకున్నాడు. హౌస్ లో ఏదైన టాస్క్ తర్వాత శివాజీ పక్కన ఎవరైన హౌస్ మేట్ ఉంటే.. వారిద్దరిలో ఏకాభిప్రాయంతో ఒకరిని సెలెక్ట్ చేయండి అని బిగ్ బాస్ చెప్తే.. మిగిలిన అందరు కలిసి శివాజీకే ఓట్ వేస్తారనేది అందరికి తెలిసిన నిజం. ఎందుకంటే శివాజీలో ఆటలో ఫౌల్, మాటల్లో నెగెటివ్ అంటు ఏమీ ఉండవు. అందుకే అతడిని శివాజీ.. ది బాస్ అంటు ప్రేక్షకులు కామెంట్లలో తెలుపుతున్నారు.

Jayam serial: వీరూ ప్లాన్ ని కనిపెట్టిన గంగ.. రుద్ర తెలుసుకుంటాడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -146 లో.... రుద్రకి ఎదురుగా గంగ వెళ్తుంది కానీ రుద్ర ఫోన్ మాట్లాడుతూ వెళ్ళిపోతాడు. కొంచెం దూరం వెళ్ళగానే రుద్రకి రింగ్ కనిపిస్తుంది. అది తీసుకొని చూస్తాడు. అప్పుడే ప్రమీల, ప్రీతీ వస్తారు. అన్నయ్య ఆ రింగ్ గంగ వదినది అని ప్రీతీ అంటుంది. ఈ రింగ్ ప్రపంచంలో ఆవిడకి ఒక్కదానికే ఉందా ఏంటని రుద్ర అంటాడు. ఆ తర్వాత అటుగా వెళ్తున్న గంగని రుద్ర పిలుస్తాడు. గంగ ముసుగులో ఉంటుంది. రుద్ర పిల్వగానే వస్తుంది. ఈ రింగ్ మీదేనా అని అడుగుతాడు. గంగ నాదేనని తీసుకుంటుంది..

Brahamamudi: మోడల్ ఫోటోషూట్ కోసం కావ్య ఒప్పుకుంటుందా.. రాజ్ ఏం చేయనున్నాడు!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -908 లో.... రాజ్ గుర్రంపై కూర్చొని ఊరేగుతున్నట్లు తన ఫోటోని రాజ్ కి చూపిస్తుంది కావ్య. అది చూసి నన్ను అలా చేస్తావా అని కావ్య ఫోటోని మోడల్ గా పెట్టి చూపిస్తాడు. చీ బాలేదు తీసెయ్యండి అని కావ్య అంటుంది. కావ్య ఎప్పుడు సంప్రదాయంగా ఉంటుందని ఫోటో మర్చి చూపిస్తుంది. అది చూసి రాజ్ ఫ్లాట్ అవుతాడు. ఇంట్లోనే మోడల్ ని పెట్టుకొని బయట వెతుకుతున్నానని రాజ్ అనుకుంటాడు. ఎలాగైనా యాడ్ లో చెయ్యడానికి కావ్యని ఒప్పించాలని అనుకుంటాడు.

Karthika Deepam2: వైరా ఇచ్చిన డీల్ కి ఒకే చెప్పిన కాశీ.. పోలీస్ స్టేషన్ కి శ్రీధర్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -545 లో....వైరా దగ్గరికి కాశీ వస్తాడు. కాశీ రాగానే రండి సర్ అని కాశీకీ వైరా మర్యాద ఇస్తుంటే నాకు మర్యాద ఇస్తున్నారేంటని కాశీ అడుగుతాడు. మీ రెజ్యుమె చూసాను.‌ చాలా బాగుంది. మనకంటే టాలెంట్ ఎక్కువ ఉన్నవాళ్లు మనకన్నా చిన్న ఏజ్ అయిన రెస్పెక్ట్ ఇవ్వాలని వైరా అంటాడు.. నాకు జ్యోత్స్న ఫోన్ చేసి చెప్పింది మీరు ప్రెజెంట్ ఏం చేస్తున్నారని వైరా అడుగగా జ్యోత్స్న రెస్టారెంట్ సీఈఓ దగ్గర పిఏగా చేస్తున్నానని కాశీ చెప్తాడు. ఏంటి అంత చిన్న జాబ్ చేస్తున్నారా అని వైరా అంటాడు.