English | Telugu

బిగ్ బాస్ చరిత్రలో రికార్డు.. శివాజీ గెలవాలని అన్నదానం చేసిన అభిమానులు!

బిగ్ బాస్ సీజన్-7 లో శివాజీ ఈజ్ అల్టిమేట్. అంతే కొందరు ఆడటం కోసం వస్తారు. మరికొందరు ఎంజాయ్ చేయడం కోసం వస్తారు. కానీ జనాలకి మంచిని అలవర్చాలని, కుర్రాళ్ళకి ఇన్ స్పైరింగ్ గా ఉండాలని, నిరంతరం హౌస్ లో ఏ సపోర్ట్ లేని యావర్, ప్రశాంత్ లకి అండగా నిలిచాడు‌. ఎంతలా అంటే ప్రశాంత్, యావర్ లలో ఎవరు నీకిష్టమని నాగార్జున అడుగగానే.. రెండు కళ్ళలో ఏ కన్ను ఇష్టమంటే ఏం చెప్పాలని చెప్పాడు. అంతలా వీరి ముగ్గురి బాండింగ్ ఉంది‌.

హౌస్ లో ఇంతవరకు ఎవరి గురించి నెగెటివ్ గా మాట్లాడకుండా.. నామినేషన్ లో గ్రూప్ గా వేయకుండా, ఫెయిర్ అండ్ క్లీన్ గా ఆడింది ముగ్గురే ముగ్గరు.. వాళ్ళే SPY(శివాజీ, పల్లవి ప్రశాంత్, యావర్). ఇక గత వారం వీకెండ్ లో నాగార్జున వచ్చినప్పుడు హౌస్ మేట్స్ అందరు మిగిలిన వారిలో నుండి ఏదో ఒక క్వాలిటి నేర్చుకుంటారు కదా ఏంటని ఒక్కొక్కరిని అడిగాడు. శివాజీ గారి దగ్గర లౌఖ్యంగా ఎలా ఉండాలో నేర్చుకున్నాని అంబటి అర్జున్ అన్నాడు. ఎదుటివాళ్ళు ఎంత బాధలో ఉన్న మనం మనసారా నవ్వితే చాలు ఆటోమేటిక్ గా ఆ భాద నుండి మనం బయటకు వస్తామనేది శివాజీ అన్న దగ్గరే నేర్చుకు‌న్నాని పల్లవి ప్రశాంత్ చెప్పాడు. ఓపికగా ఎలా ఉండాలో శివాజీ అన్న దగ్గర నేర్చుకున్నానని యావర్ అన్నాడు. ఒకవేళ నామినేషన్ లో ఏదైన జరిగితే అది అయిపోయింది వదిలేయ్ అని చెప్పేస్తాడని యావర్ అన్నాడు. నవ్వుతూ ఏ సిచువేషన్ అయిన ఎదర్కోవడమే జీవితం అని అది శివాజీ దగ్గర ఉంటే నేర్చుకుంటావని నాగార్జున అన్నాడు.

ఇక తాజాగా శివాజీకి సపోర్ట్ చేయమని చెప్తూ.. కొంతమంది అనాధలకి అన్నదాన కార్యక్రమం జరిపారు అభిమానులు‌‌. ఈ వీడియోని శివాజీ అఫీషియల్ పేజీలో పోస్ట్ చేయగా అది ఇప్పుడు ఫుల్ వైరల్ అవుతోంది. ఒక మనిషిని అభిమానిస్తే ఇంతలా చేస్తారా అనేదానికి మరో సాక్ష్యమంటు చేసిన ఈ గొప్ప పనికి జనాలు నీరాజనాలు తెలుపుతున్నారు. దీంతో శివాజీకి మరింత హైప్ వచ్చేసింది. ఇప్పటికే ఓటింగ్ లో నెంబర్ వన్ ర్యాంకింగ్ తో శివాజీ దూసుకెళ్తున్నాడు. ఆ తర్వాత స్థానంలో పల్లవి ప్రశాంత్ ఉన్నాడు. అయితే బిగ్ బాస్ హౌస్ లో ఒక కంటెస్టెంట్ ఉన్నప్పుడు ఆ కంటెస్టెంట్ కి సపోర్ట్ చేయమని చెప్తూ అన్నదానం నిర్వహించడం ఇదే ప్రథమం. కాగా ఇప్పుడు ఇది బిగ్ బాస్ చరిత్రలో ఒక రికార్డుగా నమోదైంది.