English | Telugu

మనసా వాచా కర్మణా ఈ గేమ్ ని నేను ఆరాధించాను:శివాజీ

బిగ్ బాస్ హౌస్ లో ఫెయిర్ గా, ఫౌల్స్ లేకుండా టాస్క్ లు ఆడుతూ తోటి హౌస్ మేట్స్ తో మంచి మాటతీరుతో ఉన్న కంటెస్టెంట్ శివాజీ. తన ఆటతీరు, మాటతీరుతో ఎంతోమంది ప్రేక్షకుల మనసు గెలుచుకున్నాడు శివాజీ. ఈ సీజన్ విజేత శివాజీనే అని ఎంతోమంది భావించారు. అలాగే ఎంతోమందికి స్పూర్తిగా నిలిచాడు. బిబి బజ్ ఇంటర్వ్యూలో కొన్ని విషయాలని షేర్ చేసుకున్నాడు శివాజీ.

స్పై బ్యాచ్ కి మీరు ఫెవరెటిజం చూపించారా అని అడుగగా.‌ అదేం లేదు. వాళ్ళు గ్రూప్ గా ఆడారు. టార్గెట్ చేసి నామినేషన్లు చేశారు. అందరు అనుకొని మొదటి వారం నుండి ఆడుతున్నారని, ఇది ఒక ఇండివిడ్యువల్ గేమ్ ఎవరి గేమ్ వారు ఆడాలని శివాజీ అన్నాడు. ఇది ఇండివిడ్యువల్ గేమ్ అని చెప్పిన మీరే ప్రశాంత్, యావర్ లతో కలిసి వాళ్ళని ఆడనీయకుండా వాళ్ళు ఇలా చేస్తున్నారు, వీళ్ళు ఇలా ఆడుతున్నారని మీ మాస్టర్ మైండ్ తో మానిపులేట్ చేశారా అని అడుగగా.. నీ దగ్గర పదిహేను వారాల ఫుటేజ్ ఉంది‌. అన్నీ చూసుకో ఒక్కసారి కూడా అరేయ్ ప్రశాంత్ వాళ్ళని నామినేట్ చెయ్. అరెయ్ ఈ గేమ్ లో వీళ్ళతో జాగ్రత్తగా ఉండు అని ఏ రోజు వారితో చెప్పలేదని శివాజీ అన్నాడు. అమర్ వచ్చి మీ కాళ్ళ‌ మీద పడ్డప్పుడు .. అరెయ్ పిచ్చోడా ఇది గేమ్ రా.. వద్దురా.. లేరా అన్న మీరే ఆ తర్వాత రోజు నామినేట్ చేశారెందకని అడుగగా.. వాళ్ళు సిల్లీ నామినేషన్ తో వేశారు కానీ నాది ఒక వ్యాలిడ్ రీజనే కదా అని శివాజీ అన్నాడు. అయిదో వారంలో వచ్చి‌న అర్జునే అన్నాడు. వాడి గేమ్ వాడు ఆడట్లేదని, ఫౌల్స్ అడుతున్నాడని అతనే అన్నాడని శివాజీ అన్నాడు.

హౌస్ లో ఒకరోజు వీళ్ళు ఇలా ఉంటే రేపు పొద్దున ఎలారా అని శోభా గురించి అన్నారు కదా అని అడుగగా.. అమర్ ని చాలా చులకనగా చూశారు. వాడితోనే నేను ఆ మాట అన్నాను. వీళ్ళు ఇలా ఉంటే ఈ ఎపిసోడ్ లు అన్నీ చూసిన వాళ్ళు ఎలా ఉంటారురా అని అన్నాను. ఎందుకంటే అమర్ ని ఇష్టం వచ్చినట్లు మాట్లాడటమేంటి.. అరేయ్ అంటాను రా అని ఒక ఆడపిల్ల అలా అనడమేంటి? అది నాకు నచ్చలేదని అందుకే తనని అలా అన్నట్లు శివాజీ అన్నాడు. మీరు మీరు అంతా కూడబల్లుకొని వచ్చి గ్రూప్ గా ఆడుతుంటే‌ ఇక్కడ నేను చూసేది పిచ్చోడినా.. మనసా వాచా కర్మణా ఈ గేమ్ ని నేను ఆరాధించాను‌. నా వల్ల ఎంత వీలైతే అంతవరకు లాగానని నేను అనుకుంటున్నాను. ఇది నా అభిప్రాయం. చూస్తారా లేదా అనేది వారి అభిప్రాయం. నచ్చకపోయి ఉంటే నేను ఇన్ని వారాలు ఉండేవాడిని కాదని శివాజీ అన్నాడు. రాబోయో కంటెస్టెంట్స్ కి ఒక్కటే చెప్తున్నా.. ఈ సీజన్, గత సీజన్ లో వచ్చిన వారి మాటలు వినకండి వారి మాయలో పడకండి. మీరు మీలా ఆడండి. మీలా ఉండండి. ఎవరి మాయలో పడకండి. తప్పు చేస్తే బిగ్ బాస్ హౌస్ నేర్పిస్తుందని శివాజీ అన్నాడు. ఎవరి గేమ్ ప్లాన్ వారిది, ఎవరి స్ట్రాటజీ వారిది అంటు శివాజీ బజ్ లో తన అనుభవాన్ని పంచుకున్నాడు.

Jayam serial: వీరూ ప్లాన్ ని కనిపెట్టిన గంగ.. రుద్ర తెలుసుకుంటాడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -146 లో.... రుద్రకి ఎదురుగా గంగ వెళ్తుంది కానీ రుద్ర ఫోన్ మాట్లాడుతూ వెళ్ళిపోతాడు. కొంచెం దూరం వెళ్ళగానే రుద్రకి రింగ్ కనిపిస్తుంది. అది తీసుకొని చూస్తాడు. అప్పుడే ప్రమీల, ప్రీతీ వస్తారు. అన్నయ్య ఆ రింగ్ గంగ వదినది అని ప్రీతీ అంటుంది. ఈ రింగ్ ప్రపంచంలో ఆవిడకి ఒక్కదానికే ఉందా ఏంటని రుద్ర అంటాడు. ఆ తర్వాత అటుగా వెళ్తున్న గంగని రుద్ర పిలుస్తాడు. గంగ ముసుగులో ఉంటుంది. రుద్ర పిల్వగానే వస్తుంది. ఈ రింగ్ మీదేనా అని అడుగుతాడు. గంగ నాదేనని తీసుకుంటుంది..

Brahamamudi: మోడల్ ఫోటోషూట్ కోసం కావ్య ఒప్పుకుంటుందా.. రాజ్ ఏం చేయనున్నాడు!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -908 లో.... రాజ్ గుర్రంపై కూర్చొని ఊరేగుతున్నట్లు తన ఫోటోని రాజ్ కి చూపిస్తుంది కావ్య. అది చూసి నన్ను అలా చేస్తావా అని కావ్య ఫోటోని మోడల్ గా పెట్టి చూపిస్తాడు. చీ బాలేదు తీసెయ్యండి అని కావ్య అంటుంది. కావ్య ఎప్పుడు సంప్రదాయంగా ఉంటుందని ఫోటో మర్చి చూపిస్తుంది. అది చూసి రాజ్ ఫ్లాట్ అవుతాడు. ఇంట్లోనే మోడల్ ని పెట్టుకొని బయట వెతుకుతున్నానని రాజ్ అనుకుంటాడు. ఎలాగైనా యాడ్ లో చెయ్యడానికి కావ్యని ఒప్పించాలని అనుకుంటాడు.

Karthika Deepam2: వైరా ఇచ్చిన డీల్ కి ఒకే చెప్పిన కాశీ.. పోలీస్ స్టేషన్ కి శ్రీధర్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -545 లో....వైరా దగ్గరికి కాశీ వస్తాడు. కాశీ రాగానే రండి సర్ అని కాశీకీ వైరా మర్యాద ఇస్తుంటే నాకు మర్యాద ఇస్తున్నారేంటని కాశీ అడుగుతాడు. మీ రెజ్యుమె చూసాను.‌ చాలా బాగుంది. మనకంటే టాలెంట్ ఎక్కువ ఉన్నవాళ్లు మనకన్నా చిన్న ఏజ్ అయిన రెస్పెక్ట్ ఇవ్వాలని వైరా అంటాడు.. నాకు జ్యోత్స్న ఫోన్ చేసి చెప్పింది మీరు ప్రెజెంట్ ఏం చేస్తున్నారని వైరా అడుగగా జ్యోత్స్న రెస్టారెంట్ సీఈఓ దగ్గర పిఏగా చేస్తున్నానని కాశీ చెప్తాడు. ఏంటి అంత చిన్న జాబ్ చేస్తున్నారా అని వైరా అంటాడు.