English | Telugu

అమర్ దీప్ కి సపోర్ట్ చేసి నీ వాల్యూ‌ నువ్వే తీసుకున్నావ్!

బిగ్ బాస్ సీజన్‌-6 విన్నర్ సింగర్ రేవంత్ అంటే తెలియని వారుండరు. బిగ్ బాస్ కి వెళ్ళకముందు బహుబలి సినిమాలో 'మనోహరి' అనే పాటని పాడి ఎంతో మందికి సుపరిచితమైన రేవంత్.. ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి తన ఆటతీరుతో, మాటతీరుతో ఆకట్టుకున్నాడు.

బిగ్ బాస్ హౌస్ లో ఉన్నన్ని రోజులు శ్రీసత్య, శ్రీహాన్ లతో కలిసి ఉన్న రేవంత్ ఫైనల్ లో విజేతగా నిలిచాడు. ఆ సీజన్ లో రేవంత్ టాస్క్ లలో ఆడిన ఆటతీరుకి నాగార్జున అయితే.. ఆటని ఆటలా ఆడు వేటలా కాదంటు పలుసార్లు చెప్పాడు. ఒకనొక దశలో నీకు రెడ్ కార్డ్ ఇస్తానని రేవంత్ తో అన్నప్పుడు అందరు షాక్ అయ్యారు. అయితే ఆ తర్వాత ఫ్యామిలీ లో వాళ్ళ భార్య శ్రీమంతపు వేడుక జరిపినప్పుడు రేవంత్ చిన్న పిల్లాడిలా ఎమోషనల్ అవుతుంటే అందరు అతడికే కనెక్ట్ అయ్యారు. ఇక బిగ్ బాస్ తర్వాత సాంగ్స్ పాడుతూ ఎప్పుడు షూటింగ్ లతో బిజీగా కన్పిస్తున్నాడు రేవంత్. ఈ మధ్యకాలంలో వచ్చిన సాయిధరమ్ తేజ్, పవన్ కళ్యాణ్ నటించిన 'బ్రో' సినిమాలో "మై డియర్ మార్కండేయ" పాటని పాడి మంచి విజయాన్ని అందుకున్నాడు. అయితే తాజాగా ముగిసిన బిగ్ బాస్ సీజన్‌-7 లో పల్లవి ప్రశాంత్ విన్నర్ గా , అమర్ దీప్ రన్నర్ గా నిలిచిన సంగతి అందరికి తెలిసిందే. అయితే అమర్ దీప్ హౌస్ లో జరిగిన దాదాపు‌ అన్ని టాస్క్ లలో ఫౌల్ ఆడుతూ, గ్రూప్ గా ఆడుతూ ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నాడు. అయితే అమర్ దీప్ ని ద్వేషించే వారంతా ఇప్పుడు అతను హౌస్ లో‌ ఉన్నప్పుడు ‌సపోర్ట్ చేసిన వారి‌మీద పడ్డారు.

హౌస్ లో అమర్ దీప్ ఉన్నప్పుడు అతనికి ఓట్ చేయండి అంటూ రేవంత్ ఒక పోస్ట్ చేశాడంట. ఇక దానికి కొందరి మనోభావాలు దెబ్బతిన్నాయంట. అన్ని ఫౌల్ గేమ్స్ ఆడిన అమర్ కి ఎలా సపోర్ట్ చేసావంటూ కొందరు నెటిజన్లు రేవంత్ కి నెగెటివ్ కామెంట్లు చేస్తున్నారు. " అమర్ దీప్ కి సపోర్ట్ చేసి నీ వాల్యూ నువ్వే తీసుకున్నావ్. ఒక అభిమానిగా నిన్ను ఇన్ని రోజులు ఫాలో అయ్యాను. నీ క్యారెక్టర్ నచ్చలేదు అన్ ఫాలో చేస్తున్నాను" అంటు ఒకతను‌ కామెంట్ చేయగా.. ఒక వ్యక్తిగా అమర్ ఏంటో నాకు తెలుసు కానీ హౌస్ లో అతను అలా లేడు. తను అలా ఉంటే బాగుండేది. అయినా ఇది‌ ఒక గేమ్ షో. గేమ్ ని గేమ్ లా చూడాలి కదా అని రేవంత్ రిప్లై ఇచ్చాడు. మరి ఈ కామెంట్ ని అమర్ చూస్తే ఏమైపోతాడో. అమర్ కు ఇంత నెగెటివ్ రావడానికి కారణమైన ప్రియాంక, శోభాలని మళ్ళీ కలుస్తాడా? పల్లవి ప్రశాంత్ కి సపోర్ట్ చేస్తున్న అభిమానులు అమర్ ని ఇంకా హేట్ చేస్తున్నారా లేదా పక్కనపెడితే సీజన్-6 కంటెస్టెంట్ అయిన రేవంత్ ని ఇలా అనడం‌ ఎంత వరకు కరెక్ట్ అంటూ‌ పలువురు విమర్శిస్తున్నారు.

Jayam serial: వీరూ ప్లాన్ ని కనిపెట్టిన గంగ.. రుద్ర తెలుసుకుంటాడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -146 లో.... రుద్రకి ఎదురుగా గంగ వెళ్తుంది కానీ రుద్ర ఫోన్ మాట్లాడుతూ వెళ్ళిపోతాడు. కొంచెం దూరం వెళ్ళగానే రుద్రకి రింగ్ కనిపిస్తుంది. అది తీసుకొని చూస్తాడు. అప్పుడే ప్రమీల, ప్రీతీ వస్తారు. అన్నయ్య ఆ రింగ్ గంగ వదినది అని ప్రీతీ అంటుంది. ఈ రింగ్ ప్రపంచంలో ఆవిడకి ఒక్కదానికే ఉందా ఏంటని రుద్ర అంటాడు. ఆ తర్వాత అటుగా వెళ్తున్న గంగని రుద్ర పిలుస్తాడు. గంగ ముసుగులో ఉంటుంది. రుద్ర పిల్వగానే వస్తుంది. ఈ రింగ్ మీదేనా అని అడుగుతాడు. గంగ నాదేనని తీసుకుంటుంది..