English | Telugu
వాళ్ళిద్దరి వెనుక ఒక శక్తిలా నిల్చున్నాను:శివాజీ
Updated : Dec 19, 2023
బిగ్ బాస్ హౌస్ లో చాణక్యుడిగా ఎంతోమంది ప్రేక్షకుల మనసు గెలుచుకున్న ఏకైక కంటెస్టెంట్ శివాజీ. కామన్ మ్యాన్ కి సపోర్ట్ గా ఉండి తనని విజేతను చేయడానికి చేతికి గాయం చేసుకొని.. ఒంటి చేత్తో హౌస్ లో కొన్ని వారాల పాటు పోరాడి టాప్-3 లో ఉన్న కంటెస్టెంట్ శివాజీ. బిగ్‌బాస్ హౌస్ లో యావర్, ప్రశాంత్ లకి ఒక గురువుగా ఉండి వారి ప్రతీ గెలుపులో, వారికెదురైన సవాళ్ళలో అతనొక అడ్డుగోడగా నిలిచాడనేది అందరికి తెలిసిన నిజం. ఈ బిగ్ బాస్ సీజన్ కి శివాజీనే విజేత అని చాలామంది ప్రేక్షకులు భావించారు. అలాగే ఎంతోమందికి స్పూర్తిగా నిలిచాడు.
బిబి బజ్ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలు షేర్ చేసుకున్నాడు శివాజీ. టాప్-3 లో ఒకడిగా ఉంటారని ఎక్సెపెక్ట్ చేశారా అని అడుగగా.. టాప్-3 ఏంటి.. విన్నర్ ని నేను. ఇది గర్వం కాదు కానీ నేను అంతగా ప్రయత్నించలేదు. జనరల్ గా బయట ఎలా ఉంటానో అలానే ఉన్నాను. ఎంత దూరం ఉంటానని ఆడియన్స్ కే బాగా తెలుసని శివాజీ అన్నాడు. హౌస్ లో చాలాసార్లు బయటకొచ్చేస్తానని అన్నారు కదా ఎందుకు రాలేదని అడుగగా.. బయటకొస్తానని అన్నా రాలేదు కదా.. ఆడియన్స్ ఆపారు కాబట్టి ఆగాలి వాళ్ళు చెప్పినప్పుడు బయటకు రావాలని శివాజీ అన్నాడు. టాప్ వరకు వచ్చి ఎందుకు వెనుకపడ్డారని అడుగగా.. ఒక అబ్బాయి ఎక్కడో పల్లెటూరి నుండి వచ్చి ఆడాలని అన్నప్పుడు మిగతా వారంతా కలిసి ఆడనీయకూడదని అనుకున్నప్పుడు వాడికి సపోర్ట్ గా ఉండాలనే సంకల్పంలో నుండి నా ఫోకస్ వాడి మీదకి వచ్చిందని, వాడిని కాపాడుకోవడంలోనే కొంతభాగం నేను ఉన్నానని శివాజీ అన్నాడు. వీకెండ్ లో నాగార్జున వచ్చి అందరు ప్రశాంత్ లో కలర్స్ ఉన్నాయని అంటున్నారని అడిగినప్పుడు ఒక్కటే చెప్పా.. వాడు ఇన్నోసెంట్, జెన్యున్ బాబు గారు అని చెప్పానని శివాజీ అన్నాడు. యావర్, ప్రశాంత్ లు మీరు లేకుంటే ఇక్కడిదాకా వచ్చేవారు కాదా అని అడుగగా.. వాళ్ళ గేమ్ వల్ల, వాళ్ళ ట్యాలెంట్ వల్ల ఇక్కడి దాకా వచ్చారని వాళ్ళ వెనుక ఒక శక్తిలా ఉన్నానని శివాజీ అన్నాడు. అంటే మీరు శక్తిలా లేకుండే ఉండేవారు కాదా అని అడుగగా.. లేదు. కొంతవరకు ఉండేవారు ఆ తర్వాత మానసికంగా బాధపడేవారు. అమాయకంగా వచ్చిన ఒక కుర్రాడు, భాష రాని ఒక కుర్రాడు..ఇద్దరు లైఫ్ మీద ఎన్నో ఆశలతో ఇక్కడికి వచ్చారు. అలాగే నేను కూడా ఇక్కడికి వచ్చినవాడినే. వాళ్లకి ఆ ధైర్యమిచ్చానంతే అని శివాజీ అన్నాడు. కావాలనే అమర్ ని మీరు టార్గెట్ చేశారని కొందరు అంటున్నారని అడుగగా.. లేదు, నెనెప్పుడు టార్గెట్ చేయలేదు. వాడికి వీళ్ళు(ప్రశాంత్, యావర్) అంటే భయం ఉంది. ఆటలో తనకంటే ముందుకెళ్తారో అనే భయం ఉంది. వాడి ఫౌల్ గేమ్ లే చెప్పాయి కదా అని శివాజీ అన్నాడు.
అమర్ ట్యాలెంటెడ్ కానీ ఎంతసేపు వారిచుట్టే తిరుగుతూ గేమ్ పాడు చేసుకున్నాడు. వాడికి నేను చాలాసార్లు చెప్పాను. అరెయ్ నువ్వు ఇది కాదురా అని చాలాసార్లు అన్నాను కానీ వాడు మారలేదు. మా ఇద్దరి మధ్య బాండింగ్ వేరే అని శివాజీ అన్నాడు. ఇలా కొన్ని ఆసక్తికరమైన విషయాలని బిబి బజ్ ఇంటర్వ్యూలో శివాజీ పంచుకున్నాడు.