English | Telugu

నాకు అన్నయ్య అంటే ఉదయ్ కిరణ్ గుర్తొస్తారు!

క్యాష్ షోకి ఈ వారం సీరియల్స్ లో నటించే అత్తా కోడళ్ళు వచ్చారు. సుమ ఎప్పటిలానే వాళ్ళతో ఫుల్ కామెడీ చేసింది.

ఇక ఈ ఎపిసోడ్ కి శిరీష, గౌతమీ కూడా వచ్చారు. సుమ శిరీషతో మాట్లాడుతూ ఉదయ్ కిరణ్ తో యాక్ట్ చేసావ్ కదా ఆయన ఎలా ఉండేవారు అనేసరికి " ఆయన డౌన్ టు ఎర్త్ ...అందరితో ఫ్రెండ్లీ గా ఉండేవారు. నాకు అదే ఫస్ట్ మూవీ, ఆడిషన్ తీసుకునేటప్పుడు చుట్టూ ఒక 20 మంది ఉన్నారు. అది ఫస్ట్ సీన్ ఫస్ట్ షాట్ ..నాకు చాలా భయమేసింది..13 టేక్స్ అయ్యాయి. చాలా టెన్షన్ వచ్చేసింది. ఏడుపొచ్చేసింది.. అప్పుడు ఉదయ్ కిరణ్ గారు వచ్చి టెన్షన్ పడొద్దు..నేను నీ సొంత అన్నయ్యే అనుకుని మాములుగా అన్నయ్యతో ఎలా మాట్లాడతావో అలాగే మాట్లాడేయ్ అన్నారు. అంతే నాలో చాలా ధైర్యం వచ్చింది.

ఎప్పుడైనా ఆర్టిస్టులకు కో-ఆర్టిస్ట్స్ సపోర్ట్ ఉంటే మాత్రం ఎలాంటి సీన్ ఐనా ఈజీగా చేసేయొచ్చు.. నాకు అన్నయ్య అంటే ఉదయ్ కిరణ్ అంతే" అని ఆయన గురించి తన మనసులో మాట చెప్పింది.