English | Telugu
Brahmamudi:వాళ్ళిద్దరిని అలా చూసి షాకైన అపర్ణ.. రాజ్ బంఢారం బయటపడనుందా?
Updated : Dec 15, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -279 లో.. దుగ్గిరాల ఇంట్లో కావ్య పూజ చేసి అందరికి హారతి ఇస్తుంది. సాయంత్రం కోనేరులో దీపం వదిలేవరకు ఎవరు ఉపవాసం వదలడానికి వీలు లేదని ఇందిరాదేవి అనగానే.. మీకు ఉపవాసం, మాకు కాదంటు సుభాష్, ప్రకాష్ టిఫిన్ చెయ్యడానికి సిద్ధం అవుతు రాజ్ ని పిలుస్తారు. అప్పుడే రాజ్ ని కావ్య అటపట్టిస్తు.. నాతో పాటు తను కూడా ఉపవాసం ఉంటానని చెప్పాడని కావ్య అనగానే రాజ్ ఏం మాట్లాడలేకపోతాడు.
ఆ తర్వాత స్వప్న ఉపవాసం ఉంటానని అనగానే.. నువ్వేం అవసరం లేదు.. వెళ్లి టిఫిన్ చేయమని ఇందిరాదేవి అంటుంది. అవును నేను ఎందుకు ఉపవాసం. ఈ ఇంటికి వారసుడిని ఇస్తున్నానని స్వప్న అంటుంది.. మరొక వైపు రాజ్ చాటుగా గదిలో ఫ్రూట్స్ అన్ని తింటు ఉంటాడు. అప్పుడే కావ్య వచ్చి చూస్తుంది. ఈ ఒక్క రోజైన పూజ చేస్తే దేవుడికి దయకలిగి మనల్ని కలుపుతాడని అనుకున్నానని కావ్య అంటుంది. మన ఇద్దరిని ఆ దేవుడు కూడ కలపలేడని రాజ్ అంటాడు. మరొక వైపు రాహుల్, రుద్రాణి లు స్వప్న కడుపుని పోగొట్టే ప్లాన్ చేస్తారు. అరుణ్ ని గుడికి రప్పించి ఒకసారి స్వప్నని కనిపించమను. అప్పుడు అరుణ్ తో స్వప్నని నిజం చెప్పియ్యలని తన వెంట వెళ్లేలా చెయ్యాలని, దాంతో కోనేటిలో పడేలా చేస్తే అబార్షన్ అవుతుంది. అప్పుడు అబార్షన్ అయిందని పెద్ద సీన్ క్రీయేట్ చెయ్యొచ్చని రాహుల్ కి రుద్రాణి చెప్తుంది. మరొకవైపు రాజ్ కి శ్వేత ఫోన్ చేసి కలవాలని చెప్తుంది. ఈ రోజు వీలవదు గుడికి వెళ్తున్నామని రాజ్ అనగానే.. నేను వస్తానని శ్వేత అంటుంది. దాంతో వద్దని రాజ్ అంటాడు. అయిన వినకుండా వస్తానని చెప్పి శ్వేత ఫోన్ కట్ చేస్తుంది.
ఆ తర్వాత అందరు గుడికి వస్తారు. అనామిక ఫ్యామిలీ కూడా గుడికి వస్తారు. కాసేపటికి అప్పు, కృష్ణమూర్తి లు కూడా గుడికి వస్తారు.. ఎక్కడకు వెళ్లిన దీని ఎంట్రీ ఏంటని అనామిక తల్లి అనగానే.. అవును మమ్మీ నాకంటే అప్పుకే కళ్యాణ్ ఇంపార్టెన్స్ ఇస్తుండు. నాకు జెలస్ గా ఉందని అనామిక అనగానే.. నేను చూసుకుంటానని అనామిక తల్లి అంటుంది. అప్పుకి కళ్యాణ్ షేక్ హ్యాండ్ ఇవ్వబోతుంటే అనామిక ఇవ్వకుండా ఆపుతుంది. ఆ తర్వాత.. మీరు వెళ్ళండి కావ్య ఇప్పుడే రాదు మొక్క పచ్చగా ఉంటే నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తానని మొక్కుకుందని రాజ్ అనగానే.. కావ్య ఆశ్చర్యపోతు ఇరికించాడు కదా అని అనుకుంటుంది. ఆ తర్వాత అరుణ్ కి రాహుల్ ఫోన్ చూసి గుడికి వచ్చాడో లేదో కనుక్కుంటాడు. తరువాయి భాగంలో.. శ్వేత దగ్గరికి రాజ్ వస్తాడు. రాజ్ ని శ్వేత హగ్ చేసుకొని ఉండడం అపర్ణ చూసి షాక్ అవుతుంది. మరొక వైపు కావ్య కూడా వాళ్ళు ఉన్నవైపుగా వస్తుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిం