English | Telugu

రాచకొండ పిఎస్ షీటీమ్ కి యాంకర్ రవి కితాబు..పేరెంట్స్ ఎం చేస్తున్నారంటూ ఫైర్

యాంకర్ రవి గురించి అతని యాంకరింగ్ గురించి షోస్ లో, ఈవెంట్స్ లో చూస్తూనే ఉన్నాం..అలాగే అతను పండించే కామెడీ గురించి అందరికీ తెలుసు. అలాంటి రవి ఇప్పుడు తన ఇన్స్టాగ్రామ్ వేదిక రాచకొండ పిఎస్ షీ టీమ్ కి కితాబిచ్చాడు.. అసలు రాచకొండ షీ టీమ్ కి ఎందుకు ఫిదా అయ్యాడో చెప్తూ ఒక వీడియోని కూడా తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసాడు. " నవంబర్ లో రాచకొండ పిఎస్ షీ టీమ్ వాళ్ళు ఒక డ్రైవ్ చేశారు..సివిల్ యూనిఫార్మ్ లో వచ్చి అమ్మాయిలను అల్లరి చేస్తున్న అబ్బాయిలను పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు.

అందులో షాకింగ్ ఏంటంటే ఈ అబ్బాయిలంతా చాలావరకు 18 లోపు వాళ్ళే...ఐతే ఆ అబ్బాయిల పేరెంట్స్ ఎం చేస్తున్నారు. అబ్బాయిని కనడం గొప్ప కాదు వాళ్ళు ఎం చేస్తున్నారు, స్కూల్ కి, కాలేజీకి వెళ్తున్నారా, చక్కగా చదువుకుంటున్నారా అని ఎందుకు చూడడం లేదు. మగాడేగా రోడ్డు మీదకు వదిలేద్దాం ఎలాగైనా బతికేస్తాడు..అనుకుంటున్నారు. మరి ఇప్పుడు పోలీసులు పట్టుకున్నారు వాళ్ళ భవిష్యత్తు ఏమిటి..పేరెంట్స్ మీ అందరికీ తెలుసు..

కానీ గుర్తు చేస్తున్నాను అంతే..మీ అబ్బాయిలను జాగ్రత్తగా పెంచండి. అలాగే అమ్మాయిలూ ధైర్యంగా ఉండండి.. భయపడకండి. ముఖ్యంగా షీ టీమ్ ఉంది. మీకేమన్న సమస్య వస్తే షీటీమ్ కి ఇన్ఫోర్మ్ చేయండి.. వాళ్ళు మీకు హెల్ప్ చేయడానికి ముందుంటారు. షీ టీంకి నా అభినందనలు. అలాగే పేరెంట్స్ మీ అబ్బాయిల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి." అంటూ రవి చాలా ఇన్ఫర్మేషన్ ని ఈ సొసైటీలో అబ్బాయిల తల్లితండ్రులకు అందించాడు.