English | Telugu

కొత్త ఇంట్లోకి గృహప్రవేశం చేసి పాలు పొంగించిన సింగర్ లిప్సిక


టాలీవుడ్ ప్లే బ్యాక్ సింగర్స్ లో మంచి పేరు తెచ్చుకున్న సింగర్ లిప్సిక. ఈమె ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ పాడి ఎంతో క్రేజ్ ను సొంతం చేసుకుంది. డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఎంతో మంది హీరోయిన్లకు గాత్రదానం చేసింది. అంతేకాదు ఈమె సోషల్ మీడియాలో మోటివేషనల్ లైన్స్ చెప్తూ ఫేమస్ అయ్యింది. సంగీతం అంటే ఎంతో ఇష్టపడే లిప్సిక ‘పాడుతా తీయగా’ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసి తన టాలెంట్ ని నిరూపించుకున్నారు.

లెజెండరీ సింగర్ ఎస్‌.పి.బాలసుబ్రమణ్యం గారి నుంచి అద్భుతమైన ప్రశంసలను కూడా అందుకుంది. తర్వాత ప్లేబ్యాక్‌ సింగర్‌గా కెరీర్‌ స్టార్ట్ చేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ దాదాపు 300లకు పైగా పాటలు పాడారు. టెంపర్ మూవీలో ‘నిన్ను చూసి పడిపోయా ఆన్‌ ద స్పాట్‌’, కొత్తజంట మూవీలో ‘ఓసి ప్రేమ రాక్షసి’, ప్రేమకథ చిత్రం మూవీలో ‘ఐ జస్ట్‌ లవ్‌ యు బేబి’ వంటి సూపర్‌ హిట్‌ సాంగ్స్ ని ఈమె పాడారు. ఈమె గొంతును ఈజీగా గుర్తుపట్టేయొచ్చు. ఇక ఇప్పుడు లిప్సిక తన భర్త పేరు ఉదయ్ తో కలిసి కొత్త ఇంట్లోకి గృహప్రవేశం చేశారు. ఆ ఫొటోస్ ని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసుకున్నారు.

ఇక నెటిజన్స్ అంతా వాళ్ళను విష్ చేస్తున్నారు. లిప్సిక కొంతకాలం క్రితం తన తండ్రిని పోగొట్టుకుంది.. కిడ్నీ సంబంధ సమస్యతో ఆయన చనిపోయారు. ‘‘మీరు లేని జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు పప్పా’ అంటూ ఇన్స్టాగ్రామ్ లో భావోద్వేగానికి గురయ్యారు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.