English | Telugu

ఘనంగా సామ్రాట్ కూతురు ధ్రితి పుట్టినరోజు వేడుకలు

సిల్వర్ స్క్రీన్ మీద సామ్రాట్ రెడ్డి అందరికి తెలిసిన నటుడే. చాలా మూవీస్ లో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు. బిగ్ బాస్ సీజన్ 2లో కూడా పార్టిసిపేట్ చేసి మరింత ఫేమస్ అయ్యాడు. తనకు మొదట హర్షిత రెడ్డితో పెళ్లైయింది. అయితే కొన్ని కారణాల వల్ల వీళ్ళ వైవాహిక జీవితానికి బ్రేక్ పడింది. తర్వాత ఇద్దరూ డివోర్స్ తీసేసుకున్నారు. చివరికి అంజనా శ్రీలిఖిత అనే అమ్మాయిని సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడు.

లాస్ట్ ఇయర్ ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం రోజున లిఖిత పండంటి పాపకి జన్మనిచ్చింది. అప్పుడు సామ్రాట్ పాపను ఎత్తుకున్న ఫోటోని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో షేర్ చేశాడు. ఇప్పుడు తన కూతురు "ధ్రితి"కి ఆరు నెలలు పూర్తయ్యాయని చెప్తూ తన కూతురు, భార్యతో కలిసి దిగిన ఫోటోను తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసాడు. " మా లిటిల్ ప్రిన్సెస్ కు ఆరు నెలలు నిండాయి. హ్యాపీ బర్త్ డే చిన్ని నాన్న..మేము నిన్ని ఎంతో ప్రేమిస్తాం...ఇట్లు మీ అమ్మా-నాన్న" అని కాప్షన్ పెట్టాడు. అలాగే బర్త్ డేని ఫామిలీ మెంబర్స్ తో కలిసి గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకున్నాడు.

ఇది చూసిన మరో బిగ్ బాస్ కంటెస్టెంట్ కిరీటి "టైం ఎంత తొందరగా గడిచిపోయింది. స్వీట్ హార్ట్ కి బెస్ట్ విషెస్" అని మెసేజ్ పెట్టాడు. నెటిజన్స్ అంతా సామ్రాట్ కూతురిని విష్ చేస్తూ రిప్లైస్ ఇచ్చారు. టాలీవుడ్‌లో పంచాక్షరి, బావ, అహ నా పెళ్లంట వంటి సినిమాల్లో నటించాడు. అదే ఫేమ్ తో బిగ్‌బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.

ఆ మీమ్ నన్ను చాలా డిస్టర్బ్ చేసింది...సావండి అంటున్న నైనికా అనసుర

నైనికా అనసురు బుల్లితెర మీద అందరికీ పరిచయమే. బిగ్ బాస్ సీజన్ 8 ద్వారా బాగా ఫేమస్ అయ్యింది. అలాగే ఢీ డాన్స్ షోలో డాన్స్ ద్వారా బాగా పాపులర్ అయ్యింది. ఇక ఇప్పుడు బిబి జోడి సీజన్ 2 లో అమరదీప్ కి జోడిగా చేస్తోంది. అలాంటి నైనికా రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఘాటుగా ఒక పోస్ట్ పెట్టింది. "ఎలాంటి పని లేకుండా జస్ట్ కూర్చుని అమ్మాయిల చిత్రాలను ఘోరంగా ఎడిట్ చేస్తూ వాళ్ళను హరాస్ చేసే ఒక స్టుపిడ్ మీమ్ పేజీలో పోస్ట్ చేసిన నా చిత్రాలు నన్ను చాలా డిస్టర్బ్ చేశాయి. మీకు పని లేదు బ్రో, మాకు మిమ్మల్ని పట్టించుకునేంత టైం లేదు. నువ్వు మా మీద పోస్ట్లు పెడుతున్నావ్ అంటే నువ్వు నీలోనే తోపు ఐనట్టే..మీ పేరెంట్స్ నిన్ను బాగా పెంచారు. మీలాంటి వాళ్ళే రేపు రేపిస్టుల్లా తయారవుతారు.