English | Telugu

టేస్టి తేజ తన వెంటపడ్డాడంట.. పాపం యశ్వంత్!

బిగ్ బాస్ సీజన్ సెవెన్ ప్రేక్షకులని ఎంతగానో అలరించింది. ‌అందులోకి వెళ్ళిక కంటెస్టెంట్స్ లలో శివాజీ, పల్లవి ప్రశాంత్, యావర్, నయని పావని, భోలే షావలి, అశ్వినిశ్రీ, అమర్ దీప్, ప్రియాంక జైన్, శోభాశెట్టి, టేస్టీ తేజ, ఆట సందీప్, అంబటి అర్జున్ ఇలా దాదాపు అందరు ఎంటర్‌టైన్మెంట్ చేసి మెప్పించారు. ఒక్కోక్కరిది ఒక్కో స్ట్రాటజీ.. ఒక్కో గేమ్ ప్లే.. ఇలా అందరు తమ మాటతీరు, ఆటతీరుతో ఎంతో ఆకట్టుకున్నారు.

ఇక శోభాశెట్టి అయితే బిగ్ బాస్ దత్తపుత్రికగా ట్రోలర్స్, యూట్యూబర్స్ అభివర్ణిస్తారు. దానికి కారణం లేకపోలేదు.. శోభాశెట్టి ఎలిమినేషన్ కోసం ఎంతోమంది అభిమానులు తనకి ఓటు వేయకుండా ప్రతీవారం చూసారు.. కానీ బిగ్ బాస్ మాత్రం తనని ఎలిమినేషన్ చేయలేదు. ఇక మరో వారంలో గ్రాంఢ్ ఫినాలే ఉంటందనగా శోభాశెట్టిని ఎలిమినేషన్ చేసి బిగ్ బాస్ పై కాస్త ఇంట్రెస్ట్ కలిగించారు మేకర్స్. అయితే బిగ్ బాస్ హౌస్ లో శోభాశెట్టి, టేస్టీ తేజ కలిసి ఎక్కువగా ఉండేవారు. వీరిద్దరి మధ్య మంచి రాపో ఉంది. ఇద్దరి మధ్య గొడవలు, సాక్రిఫైజ్ లు, గేమ్స్,‌ జోక్స్, ఇలా ప్రతీది అందంగా ఫ్రేమ్ చేసి ఇద్దరి జర్నీ వీడియోలలో చూపించారు బిగ్ బాస్. అయితే హౌస్ లో ఉన్నన్ని రోజులు టేస్టి తేజని శోభా పేరుని టాటుగా వేయించుకోమని బిగ్ బాస్ కోరాడు. అలా బిగ్ బాస్ గ్రాంఢ్ ఫినాలే రోజున శోభాశెట్టి పేరుని టేస్టీ తేజ వేయించుకున్నాడు.

బిగ్ బాస్ హౌస్ నుండి టేస్టీ తేజ ఎలిమినేషన్ అయిన రోజున శోభాశెట్టి చాలా ఏడ్చింది. ఎంతలా అంటే నువ్వు లేకుండా నేనుండలేనురా అని శోభాశెట్టి అంది. ఆ తర్వాత హౌస్ లో మాములుగానే ఉన్న శోభాశెట్టి.. మూడు వారాల తర్వాత ఎలిమినేషన్ అయింది. ఇక ఎలిమినేషన్ తర్వాత టేస్టీ తేజతో కలిసింది. ఇక తాజాగా టేస్టీ తేజ యూట్యూబ్ ఛానెల్ లో ఓ వ్లాగ్ ని ఇద్దరు చేసారు. జైలు మండి బిర్యానీ తినడానికి శోభాశెట్టి, టేస్టీ తేజ, శోభాశెట్టి వాళ్ల అమ్మ వెళ్ళారు. అక్కడ ఏంటీ గొడవలు, దీనితో నేను పడలేకపోతున్నా అని నీకు ఎప్పుడైన అనిపించిందారా తేజ అని శోభాశెట్టి అడుగగా.. ఒక్కటా రెండా చాలాసార్లు అలానే అనిపించేదని టేస్టీ తేజ అన్నాడు. నాతో నీకున్న బెస్ట్ మెమోరీ ఏంట్రా తేజ అని అడుగగా.. చాలాసేపు ఆలోచించాడు తేజ. ఏరా అంత ఆలోచిస్తున్నావేంటని శోభా అడుగగా.. అంత గుర్తుంచుకోవాల్సినవేంటా అని ఆలోచిస్తున్నానని తేజ అన్నాడు. బేబీ సినిమాలో అటో డ్రైవర్ గా తేజ, లవర్ గా యశ్వంత్ ట్రోల్ చూసి ఇద్దరు నవ్వుకున్నారు. అలా వాళ్ళిద్దరిపై వచ్చే ట్రోల్స్ అన్నీ చూస్తూ నవ్వుకున్నారు. ఇక నువ్వు నా వెంట పడ్డావ్ కదారా అని శోభా అనగా.. అంతలేదని తేజ అన్నాడు. ఇలా ఇద్దరు కలిసి చేసిన ఈ వ్లాగ్ ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ లో ఉంది. ఈ ఇంటర్వూ కోసం వెయిటింగ్ అంటూ వీళ్ళిద్దరి ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.