English | Telugu

నేను జబర్దస్త్ రావడానికి కారణం వీళ్ళే!

జబర్దస్త్ స్టేజ్ మీద ఎంతోమంది కమెడీయన్స్ తమ సత్తా చాటుకొని ఇండస్ట్రీకి వచ్చి సెటిల్ అవుతున్నారు. పాతనీరు పోయి కొత్తనీరు వచ్చినట్టుగా పాత కమెడీయన్స్ అందరు వెళ్ళిపోయాక కొత్త వాళ్ళు వచ్చారు. అలా ఎంతో మంది వచ్చి వారి ప్రతిభ చాటుకుంటున్నారు. వారిలో కెవ్వు కార్తిక్, జోర్దార్ సుజాత, రాకెట్ రాఘవ, ఇమ్మాన్యుయల్ , వర్ష, బుల్లెట్ భాస్కర్, నూకరాజు, సద్దాం, పవిత్ర, రోహిణి ఇలా కొత్తవాళ్ళ కామెడీతో జబర్దస్త్ స్టేజ్ మీద నవ్వులు పూస్తున్నాయి.

జబర్దస్త్ కొత్త యాంకర్ గా సిరి హనుమంత్ చేస్తుండగా... జడ్జెస్ గా కృష్ణ భగవాన్, ఇంద్రజ చేస్తున్నారు. ఎక్స్ ట్రా జబర్దస్త్ కి యాంకర్ గా రష్మీ చేస్తుండగా.. జడ్జెస్ గా కృష్ణ భగవాన్, ఖుష్బూ వ్యవహరిస్తున్నారు. ఇమ్మాన్యుయేల్.. జబర్దస్త్ షో ద్వారా తన కామెడీతో తెలుగు టీవి ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. జబర్దస్త్ లో మొదట వర్షతో కలిసి లవ్ ట్రాక్ నడిపిన ఇమ్మాన్యుయేల్ ఇప్పుడు అదంతా జబర్దస్త్ షో కోసమే అన్నట్టుగా చేస్తున్నాడు. అయితే వీరిద్దరి కాంబినేషన్ లో జబర్దస్త్ స్టేజ్ మీద చేసిన ప్రతీ స్కిట్ దాదాపు హిట్ అయిందనే చెప్పాలి. జబర్దస్త్ షో ద్వారా పాపులర్ అయిన ఎంతో మంది కమెడియన్స్ తమని తాము మరింత నిరూపించుకోవడానికి సినిమాల్లోకి వెళ్తున్నారు.

ఇమ్మాన్యుయేల్ ఇన్ స్టాగ్రామ్ లో ఎప్పుడు రీల్స్ చేస్తూ తనలోని కామెడీని అక్కడ కూడా నిరూపించుకుంటూ వస్తున్నాడు. ఇక సొంతంగా యూట్యూబ్ ఛానెల్ ని క్రియేట్ చేసి అందులో తన పర్సనల్ లైఫ్ ని ఓవైపు, జబర్దస్త్ షోలో జరిగిన సంఘటనలని మరోవైపు వ్లాగ్స్ గా చేస్తూ ఫుల్ ట్రెండింగ్ లో ఉంటున్నాడు.‌ అయితే కొన్ని రోజుల క్రితం ప్రేమ వాలంటీర్ అనే వెబ్ సిరీస్ చేసి మంచి విజయాన్ని అందుకున్నాడు. యూట్యూబ్ లో ఈ వెబ్ సిరీస్ కి అత్యధిక వ్యూస్ వచ్చాయి. ఇక ఇప్పుడు ఇమ్మాన్యుయేల్ తాజాగా ' నేను జబర్దస్త్ కి రావడానికి కారణం వీళ్ళే' అంటూ మరో వ్లాగ్ ని అప్లోడ్ చేశాడు. ఇందులో తన గాలి బ్యాచ్ ని పరిచయం చేశాడు. వారి ఊరిలో వాళ్ళందరిని గాలి బ్యాచ్ అంటారని, వాళ్ళు మొత్తం అయిదుగురు ఫ్రెండ్స్ అంటు ఒక్కొక్కరి గురించి చెప్తూ తీసిన ఈ వ్లాగ్ కి ఇప్పుడు విశేష స్పందన లభిస్తుంది. ఇందులో తమ బాల్య మిత్రుల గురించి ఇమ్మాన్యుయేల్ చెప్పడంతో చాలా మంది కనెక్ట్ అవుతున్నారు. మీ ఫ్రెండ్స్ లాగా మాకు ఉన్నారంటు పాజిటివ్ కామెంట్లు చేస్తున్నారు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.