English | Telugu
Shobha Shetty Captain: కెప్టెన్‌గా శోభాశెట్టి ఎలిమినేషన్... ఆ కాయిన్స్ ఎవరికి?
Updated : Nov 4, 2023
బిగ్ బాస్ సీజన్-7 లో ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు కొనసాగుతున్నాయి. నిన్న మొన్నటి దాకా జరిగిన టాస్క్ లలో గౌతమ్ కృష్ణ టీమ్ గెలిచి అందులోని శోభా శెట్టి కెప్టెన్ గా గెలిచింది.
శోభాశెట్టి నామినేషన్ లిస్ట్ లో అట్టడుగున ఉంది. మరి బిగ్ బాస్ సీరియల్ బ్యాచ్ ని కాపడతాడా లేదా ప్రేక్షకుల ఓటింగ్ ని బట్టి లీస్ట్ లో ఉన్నవాళ్ళని ఎలిమినేట్ చేస్తాడా చూడాలి. నిన్న జరిగిన టాస్క్ లో పల్లవి ప్రశాంత్ ని పక్కన పెట్టడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. మొదటి గేమ్ లో డెడ్ అయిన పల్లవి ప్రశాంత్ ని చివరి రెండు గేమ్ లకి దూరంగా ఉంచడంతో బిగ్ బాస్ కావాలని సీరియల్ బ్యాచ్ కి ఫేవరట్ గా చేశాడని అనిపిస్తుందంటూ నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. ఇక బ్లాక్ బాల్ చేసిన స్వాప్ కూడా అంతా అన్ ఫెయిర్ అని నెటిజన్లు అంటున్నారు. మరొకవైపు గౌతమ్ కృష్ణ కావాలని శివాజీని టార్గెట్ చేస్తున్నాడు. గౌతమ్ కి మిర్చీ దండ వేసి కెప్టెన్ గా చేసిన శివాజీని సీరియల్ బ్యాచ్ తో కలిసి విమర్శించడమేంటని భావిస్తున్నారు.
అయితే అమర్ దీప్ నిన్న ఎంత ఫౌల్ గేమ్ ఆడిన పట్టించుకోకుండా, పదే పదే శివాజీని రౌండ్ కి బయట ఉండి ఆడాడంటూ విమర్శించాడు. ఆ తర్వాత అశ్వినిశ్రీ చేసిన స్ట్రాటజీకి భోలే షావలి బుక్ అయ్యాడు. అందరు కలిసి తనని గేమ్ లో పక్కకి పెట్టాడని భోలే షావలి భావిస్తున్నట్టుగా గౌతమ్ కృష్ణ అశ్వినిశ్రీ చెప్పడంతో పెద్ద గొడవకి దారి తీసింది. మరి ఒక గొడవకి కారణమైన అశ్వినిశ్రీకి నాగార్జున వార్నింగ్ ఇస్తాడా లేదా చూడాలి. ఇక ఇప్పుడు అందరిలో ఉన్న ఒకే ఒక ప్రశ్న శోభాశెట్టి కెప్టెన్ కదా? ఎలిమినేషన్ అవుతుందా లేదా?.. ఉల్టా పల్టా అంటూ బిగ్ బాస్ ట్విస్ట్ ఇస్తే తప్ప ఈ వారం లీస్ట్ లో ఉన్న శోభాశెట్టి కచ్చితంగా ఎలిమినేషన్ అవుతుంది. ఎందుకంటే శోభాశెట్టికి సోమవారం నామినేషన్ రోజు కాబట్టి ఆ రోజు నుండి ఇమ్యూనిటి వస్తుంది. ఈ వారం శోభాశెట్టి ఎలిమినేషన్ అవుతుందా లేదా చూడాలి మరి.