English | Telugu

BiggBoss Telugu 7 Promo: తమ్ముడు వచ్చాడు... ఉంది చాలా ఉంది!

బిగ్ బాస్ సీజన్-7 శనివారం ప్రోమో కోసం తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తుంటారు. ప్రోమో రానే వచ్చింది. హోస్ట్ నాగార్జున హీరో కార్తీని తీసుకొని వచ్చాడు. తమ్ముడిని తీసుకొని వచ్చానంటూ హీరో కార్తీని పరిచయం చేశాడు నాగార్జున.

ఇక కంటెస్టెంట్స్ తో మొదలెట్టాడు. ఒక్కొక్కరిని లేపి ర్యాగింగ్ చేశాడు నాగార్జున.‌ ఇప్పటికే ఈ వారం హౌస్ నుండి శోభాశెట్టి ఎలిమినేషన్ అవుతుందని అందరు భావించగా చివరి నిమిషంలో టేస్టీ తేజని ఎలిమినేట్ చేసినట్టుగా బయట టాక్ నడుస్తుంది.‌ అయితే ఈ సారీ కూడా అన్ ఫెయిర్ నామినేషన్ అయిందనే చెప్పాలి. హౌస్ లో ది వరెస్ట్ కంటెస్టెంట్ గా పేరు తెచ్చుకున్న శోభా శెట్టి ఎలిమినేట్ అయితే హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు చాలామంది ఉన్నారు.

అయితే శనివారం నాటి ప్రోమోలో ఒక్కో కంటెస్టెంట్ చేసిన పనులకి వార్నింగ్ ఇస్తాడని అందరు అనుకున్నారంతా. కానీ హీరో కార్తీని గెస్ట్ గా తీసుకొచ్చాడు నాగార్జున. హౌస్ మేట్స్ డార్క్ సైడ్ ని పరిచయం చేస్తానంటూ.. ఏ ఫర్ అశ్విని.. తను అందరికి పుల్లలు పెడుతుంటుందని అన్నాడు. సర్ అలా కాదని అశ్విని అనగానే.. మనం తర్వాత మట్లాడుకుందామని నాగార్జున అన్నాడు. ఇక పల్లవి ప్రశాంత్ గురించి చెప్తూ.. ఇప్పుడు మనకి కన్పించేది 'రాము'. నామినేషన్‌ టైమ్ లో తనలో అపరిచితుడు బయటకు వస్తాడని నాగార్జున అన్నాడు. ఇక శోభాశెట్టి డార్క్ సైడ్ గురించి టేస్టీ తేజని అడుగగా.. నన్ను ఇన్వాల్వ్ చేయకండి సర్ అని తేజ అన్నాడు. ఇక మధ్యలో అమర్ దీప్ నిల్చునేసరికి.. నేను నిన్ను లేమ్మన్నానా అని నాగార్జున అనగా.. లేదు సర్, లేమ్మంటారేమో అని లేచానని మళ్ళీ అమర్ దీప్ కూర్చుంటాడు. ఇక అది విన్న కార్తీ.. ఇది ర్యాగింగ్ లా ఉందని అంటాడు. ఇక టేస్టీ తేజ కార్తీ సినిమా గురించి చెప్తాడు. ఇంతటితో అయిపోయిందని అనుకోకండి. ఇంకా చాలా ఉందని నాగార్జున కంటెస్టెంట్స్ తో చెప్పాడు.