English | Telugu
చంద్రమ్మ, ఇంద్రుడిపై శోభ దొంగతనం కేసు
Updated : Jun 6, 2022
బుల్లితెరపై ప్రసారం అవుతున్న సీరియల్ `కార్తీక దీపం`. గత కొంత కాలంగా మహిళా ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. జ్వాలని, తన పిన్ని, బాబాయ్ చంద్రమ్మ, ఇంద్రుడిలని అవమానించి తగిన బుద్ధి చెప్పాలని శోభ ప్లాన్ చేస్తుంది. అనుకున్నట్టుగానే పార్టీని ఏర్పాటు చేస్తుంది. ఇక సోమవారం ఏం జరిగింది?.. శోభ ప్లాన్ వర్కవుట్ అయ్యిందా? లేదా అన్నది ఒకసారి చూద్దాం. సీరియల్ ప్రారంభంలో పార్టీకి వచ్చిన వారిని శోభ ఆహ్వానిస్తూ వుంటుంది.
ఈ క్రమంలో అక్కడికి నిరుపమ్, హిమ వస్తారు. వీళ్లతో జ్వాల కనిపించకపోవడంతో తను ఎక్కడా అంటూ శోభ హడావిడీ చేస్తూ వుంటుంది. శోభ ఏంటీ పదే పదే జ్వాల గురించి అడుగుతోంది.. ఏదైనా కుట్ర చేయబోతోందా? అని హిమ ఆలోచించడం మొదలు పెడుతుంది. కట్ చేస్తే.. శోభ.. నిరుపమ్ మదర్ స్వప్న గురించి తెగ పొగిడేస్తూ వుంటుంది. ఇదే పార్టీలో శోభ అనుకున్నట్టుగానే జ్వాల పిన్ని, బాబాయ్ చంద్రమ్మ, ఇంద్రుడులని రప్పించి వారితో పార్టీలో కూల్ డ్రింక్స్ సర్వ్ చేయిస్తూ వుంటుంది. జ్వాల కూడా ఎంట్రీ ఇస్తుంది. తనని చూసిన స్వప్న దాన్ని ఎందుకు పిలిచావ్ అంటూ శోభపై చిరాకు పడుతుంది. నేనేంటో చూపిస్తానని శోభ చెబుతుంది.
ఇదే సమయంలో పార్టీ జరుగుతుండగా ఒక్కసారిగా కరెంట్ వచ్చి పోతూ వుంటుంది. దీన్ని అవకాశంగా తీసుకున్న శోభ ముందు చేసుకున్న ప్లాన్ ప్రకారం తన నెక్లెస్ పోయిందని పెద్దగా అరుస్తుంది. వెంటనే నిరుపమ్ పోలీసులకు ఫోన్ చేస్తాడు. ఆ ప్రదేశానికి వచ్చిన పోలీసులు ఇంద్రుడి జేబులో నెక్లెస్ ని గుర్తిస్తారు. ఊహించని పరిణామానికి ఇంద్రుడు ఒక్కసారిగా షాక్ అవుతాడు. వెంటనే స్వప్న వీళ్లంతా దొంగల బ్యాచ్ అని, గతంలో కూడా ఇలాగే ప్రవర్తించారని చెబుతుంది. దీంతో నిరుపమ్ ఆసహ్యంగా చూస్తాడు. విషయం గ్రహించిన హిమ సీసీ టీవీ ద్వారా తప్పు ఎవరు చేశారో కనిపెడుతుంది. ఆ వ్యక్తిని లాగిపెట్టి కొడుతుంది. ఆ తరువాత ఏం జరిగింది? శోభ ఎలా రియాక్ట్ అయింది? అన్నది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.