English | Telugu
గాయత్రీ దేవి హత్యకు కీలకంగా మారిన తిలోత్తమ గాజు
Updated : Jun 6, 2022
బుల్లితెరపై ప్రసారం అవుతున్న సీరియల్ `త్రినయని`. జరగబోయేది ముందే పసిగట్టే వరం వున్న ఓ యువతి కథగా ఈ సీరియల్ ని రూపొందించారు. మర్డర్‌మిస్టరీ, ఆత్మలు మళ్లీ రావడం, తమని హత్య చేసిన వారు ఎవరో నయనికి హింట్ ఇవ్వడం వంటి ఆసక్తికర అంశాల నేపథ్యంలో ఈ సీరియల్ ని రూపొందించారు. ఆద్యంతం ఆసక్తికర మలుపులతో, ట్విస్ట్ లతో మహిళా ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటూ సాగుతోంది. కన్నడ నటీనటులు అషికా గోపాల్, చందూ గౌడ ప్రధాన జంటగా నటించారు. ఇతర పాత్రల్లో పవిత్ర, విష్ణు ప్రియ, భావనా రెడ్డి, అనిల్ చౌదరి, శ్రీసత్య, నిహారిక నటించారు.
విశాల్ తల్లి గాయత్రిదేవి హత్యకు గురైన లక్ష్మీదేవి పురం లోనే ఆబ్దికాన్ని జరిపించాలని, అక్కడే తిలోత్తమ తనకు తెలియకుండానే వదిలిని బంగారు గాజుని సాక్ష్యంగా చూపించి తనకు ఉచ్చు బిగించాలని నయని ప్లాన్ చేస్తుంది. నువ్వు ఎక్కడైతే గాయత్రీ దేవిని హత్య చేయించావో అక్కడే సాక్ష్యాన్ని వదిలావని, అదేంటో అక్కడికి వస్తే నిరూపిస్తానని తిలోత్తమకు చెమటలు పట్టిస్తుంది నయని. దీంతో ఎలాగైనా విశాల్ , నయనిలని గాయత్రిదేవి ఆబ్దికం రోజే చంపేయాలని తిలోత్తమ కసితో కలిసి ప్లాన్ చేస్తుంది. కొబ్బరి కాయలో బాంబ్ ని పెట్టి అదే కొబ్బరి కాయ విశాల్ కొట్టేలా ప్లాన్ చేస్తుంది కసి. కానీ ఆ ప్లాన్ వర్కవుట్ కాదు.
అదే సమయంలో నయని అనుకున్నట్టుగానే గాయత్రిదేవి హత్యకు గురైన చోటే తిలోత్తమ వదిలిన బంగారు గాజుతో పాటు ఓ లెటర్ లభిస్తుంది. దాన్ని ఆధారంగా చేసుకుని తన తల్లి హత్య వెనక ఎవరి కుట్ర వుందో ఛేదించడం మొదలు పెడతాడు విశాల్. అప్పట్లో అమ్మకి బాగా దగ్గరైన వాళ్లు, నమ్మక ద్రోహం చేసిన వాళ్లు ఎవరైనా వుంటారా అని ఆలోచిస్తున్నానని విశాల్ అంటాడు.. దీనికి ఆ పని చేయండి.. వాళ్లు ఎవరైనా సరే విడిచిపెట్టకండి అంటుంది నయని.. వదలిపెట్టే ప్రసక్తే లేదు నయని.. ఆ పేపర్లో భూషన్ రిసార్ట్ పని మీద లక్ష్మీదేవి పురానికి గాయత్రీదేవి వస్తోందని రాసిన వాళ్లెవరో? ఆ భూషన్ ఎవరో కనుక్కో గలిగితే.. మా అమ్మను నాకు శాశ్వతంగా దూరం చేసిన ఆ రాక్షసులు ఎవరో తెలుస్తుంది. వాళ్ల జీవితం అక్కడితోనే ముగుస్తుంది` అంటాడు విశాల్.
ఇదే సమయంలో విశాల్ కు లెటర్ తో పాటు దొరికిన గాజుని పట్టుకున్న నయని ` ఈ గాజు అయితే మిమ్మల్ని పెంచిన అమ్మ తిలోత్తమగారిది.. మరి ఇది ఆ కవర్ లో ఎందుకుందో ఏంటో నాకైతే తెలియదు` అని నయని అనడంతో విశాల్ లో అనుమానాలు మొదలవుతాయి. ఆ తరువాత ఏం జరిగింది?.. తిలోత్తమ చిక్కినట్టేనా? అనే విషయాలు తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.