English | Telugu
ఒంటిపై పెట్రోల్ పోసుకుని రాగసుధ కొత్త ప్లాన్
Updated : Jun 5, 2022
బుల్లితెరపై ప్రసారం అవుతున్న సీరియల్ `ప్రేమ ఎంత మధురం`. గత కొంత కాలంగా జీ తెలుగులో విజయవంతంగా ప్రసారం అవుతూ మహిళా ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. మరాఠీ సూపర్ హిట్ సీరియల్ `తులా ఫఠేరే` ఆధారంగా ఈ సీరియల్ ని తెలుగులో రీమేక్ చేశారు. శ్రీరామ్ వెంకట్, వర్ష హెచ్ కె ప్రధాన జంటగా నటించారు. ఇతర పాత్రల్లో జయలలిత, రామ్ జగన్, జ్యోతి రెడ్డి, బెంగళూరు పద్మ, విశ్వమెహన్, రాధాకృష్ణ, కరణ్, సందీప్, అనుషా సంతోష్ ప్రధాన పాత్రల్లో నటించారు.
అనుని పాపుగా వాడుకుని మాస్టర్ గేమ్ ఆడిన రాగసుధ తనచేతే ఆర్య వర్థన్ పై పోలీస్టేషన్ లో కేసు పెట్టిస్తుంది. విషయం తెలియని అను .. రాగసుధ ఇచ్చిన పెన్ డ్రైవ్ లో ఏముందో చూడకుండానే తను చెప్పినట్టే కేసు పెడుతుంది. దీంతో అను కంప్లైంట్ ని సీరియస్ గా తీసుకున్న పోలీసులు ఆర్యవర్ధన్ ని అరెస్ట్ చేయడానికి అతని ఆఫీస్ కి వెళతారు. తనని అరెస్ట్ చేస్తుండగా ఆఫీస్ కు చేరుకున్న అను అసలు విషయం తెలిసి షాక్ అవుతుంది. తను ఆర్య సర్ పై కేసు పెట్టలేదని, ఆయనని అరెస్ట్ చేయడానికి వీళ్లేదంటుంది.
తెలివిగా రాగసుధ.. అనుని అడ్డంపెట్టుకుని తనని ఇరికించిందని గ్రహించిన ఆర్యవర్ధన్.. దెబ్బకు దెబ్బ తీయాల్సిందే అంటూ అనుని తీసుకుని పోలీస్టేషన్ కు బయలుదేరతాడు. స్టేషన్ లో డీసీపీని కలిసిన ఆర్యవర్ధన్ .. తన భార్య రాజనందినిని హత్య జరగడం నిజం అని అయితే ఆ హత్య చేసింది ఆమె చెల్లెలు రాగసుధ అని ఆధారాలు అందజేస్తాడు. దీంతో కేసు ఫైల్ చేసిన పోలీసులు రాగసుధ కోసం వెతకడం మొదలు పెడతారు. అనూహ్యంగా పోలీసుల వాహనాలకే అడ్డుగా నిలబడిన రాగసుధ కొత్త ఎత్తుగడతో తన ఒంటిపై పెట్రోల్ పోసుకుని అంటించుకుంటానంటూ వీరంగం వేస్తుంది. ఆ తరువాత ఏం జరిగింది? ఆర్య వర్థన్ ప్లాన్ వర్కవుట్ అయిందా? లేక రాగసుధ ప్లాన్ వర్కవుట్ అయ్యిందా? అన్నది తెలియాలంటే సోమవారం ఎపిసోడ్ చూడాల్సిందే.