English | Telugu
Brahmamudi: అనామిక తల్లిదండ్రుల కన్నింగ్ ప్లాన్.. ఆస్తి కోసం ఇంత కుట్రచేస్తారా?
Updated : Dec 10, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -275 లో.. దుగ్గిరాల ఇంట్లో ఆడవాళ్లు అందరు ఒక దగ్గర కూర్చొని కళ్యాణ్ పెళ్లి గురించి ఉన్న దోషం గురించి మాట్లాడుకుంటారు. రాహుల్ రాజ్ ల పెళ్లిళ్లు అనుకున్నట్టుగా జరగలేదు. ఇక కళ్యాణ్ పెళ్లి అయిన ఎలాంటి ఇబ్బంది లేకుండా చెయ్యాలని అనుకున్నామని రుద్రాణి అంటుంది. ఆ మాటలు కావ్య విని రాజ్ దగ్గరికి వెళ్తుంది.
మరొక వైపు అనామిక పేరెంట్స్ కళ్యాణ్ ఈ ఇంటికి అల్లుడు అవుతే మనకి ఉన్న అప్పులు మొత్తం క్లియర్ చేద్దాం అనుకున్నాం. అసలు ఇలా జరిగిందేంటి అని ఇద్దరు డిస్సపాయింట్ అవుతారు. మొక్క వాడిపోతే పెళ్లి జరగదా అని కంగారుపడుతారు. ఆ తర్వాత అనామిక పేరెంట్స్ అనామిక దగ్గరికి వెళ్లి.. అనామికని రెచ్చగొట్టేలా మాట్లాడుతారు. నువ్వు ప్రేమించినంతగా కళ్యాణ్ నిన్ను ప్రేమించలేదు. ఎందుకంటే దోషం అనగానే అవ్వన్నీ నేను నమ్మను అనాలి కదా తాను కూడా వాళ్లతో దోషం పరిష్కారం అంటున్నాడని అనామికతో తన పేరెంట్స్ మాట్లాడుతారు. ఆ తర్వాత అనామిక కోపంగా కళ్యాణ్ కి ఫోన్ చేసి ఈ పెళ్లి జరగకపోతే చనిపోతానంటు బెదిరిస్తుంది. మరొకవైపు కావ్య, రాజ్ దగ్గరికి వెళ్లి.. ఈ దోషం ఇవన్నీ ఏంటి ఒక వేళ మొక్క వాడిపోతే ఇద్దరు ప్రేమికులని విడదీస్తారా అని కావ్య అంటుంది. ఇంట్లో వాళ్ళు చెప్పినట్టు వినాలని రాజ్ అంటాడు. మరొకవైపు కనకం ఎవరు చూడకుండా మొక్క తీసేసి వాడిపోయిన మొక్క నాటుతుంది. అప్పుడే కళ్యాణ్ వస్తుంటే కళ్యాణ్ చూడకుండా కనకం లోపలికి వెళ్తుంది. వాడిపోయి ఉన్న మొక్కని చూసి కళ్యాణ్ తీసేసి వేరే మొక్క పెట్టాలని అనుకుంటాడు. కానీ పంతులు అన్న మాటలు గుర్తుకు చేసుకొని తీసెయ్యడు. మరుసటి రోజు ఉదయం అందరూ నిద్రలేచి మొక్క దగ్గరికి వెళ్తారు. కానీ మొక్క వాడి పోయి ఉండదు. అది చూసి కనకం షాక్ అవుతుంది. అందరు కళ్యాణ్ అనామికలకి పెళ్లి చెయ్యాలని ఫిక్స్ అవుతారు.
ఆ విషయం అనామికకి కళ్యాణ్ ఫోన్ చేసి చెప్తాడు. ఆ తర్వాత అనామిక పేరెంట్స్ కన్నింగ్ గా అలోచించి.. పెళ్లి అయ్యాక కళ్యాణ్ ని ఆ ఇంటికి దూరం చేసి ఆస్తి వాటా ఇవ్వమంటే, అప్పుడు దాంతో మన ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ చేసుకోవాలని అనుకుంటారు. కాసేపటికి కావ్య దగ్గరకి కళ్యాణ్ వచ్చి.. ఆ మొక్క మర్చింది మీరే.. థాంక్స్ వదిన అని చెప్తాడు. తరువాయి భాగంలో.. ఇరు కుటుంబాలు తాంబులాలు మర్చకుంటారు. ఆ తరువాత పెళ్లి పత్రికని కావ్య దేవుడి దగ్గర పెట్టి పూజ చేస్తుంటుంది. కావ్య పూజ చేసే కంటే ముందే రాహుల్, రుద్రాణి కలిసి పెళ్ళి కార్డుకి పెట్టిన పసుపులో ఏదో కలపుతారు. దాంతో కావ్య పూజ చేస్తుండగా ఆ కార్డ్ కి మంట అంటుకుంటుంది. దాంతో అనామిక పేరెంట్స్.. అసలు ఈ అమ్మాయికి పెళ్లి ఇష్టం లేదంటు కావ్యని తిడతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.