English | Telugu

అమర్‌దీప్‌కి విషయం లేదన్న శివాజీ... సీరియల్ బ్యాచ్ షాక్!

బిగ్ బాస్ సీజన్ సోమవారం రోజు నామినేషన్లతో కంటెస్టెంట్స్ మధ్య హీటెడ్ ఆర్గుమెంట్ జరిగింది. అయితే ఈ సీజన్-7 ఇప్పటికే ఉల్టా పల్టా థీమ్ తో ముందు సీజన్ల కంటే కాస్త భిన్నంగా ఉంది.

సోమవారం జరిగిన నామినేషన్లో కంటెస్టెంట్స్ మధ్య ఒక మినీ యుద్ధమే జరిగింది. శివాజీ తన తొలి నామినేషన్ గా అమర్ దీప్, రెండవ నామినేషన్ గా ప్రియాంక జైన్ ను చేశాడు‌. శివాజీ రీజన్ చెప్తూ.‌. నేను బయాజ్(పక్షపాతం) గా ఉన్నానని ఎలా నన్ను అన్ డిజర్వింగ్ అని ఓట్ వేశావని శివాజీ అడిగాడు. నా పేరు వచ్చిన ప్రతీసారీ మీరే అడ్డుకుంటున్నారని అమర్ దీప్ అన్నాడు‌. అదేం లేదని అది జ్యూరీ మెంబర్స్ ముగ్గురు కలిసి తీసుకునే నిర్ణయమని శివాజీ అన్నాడు. అయితే ర్యాంప్ వాక్ లో నా పర్ఫామెన్స్ కనపడలేదా అన్న, ఎందుకని శూభశ్రీని సెలెక్ట్ చేశారని అడిగాడు. అక్కడ నేనొక్కడినే లేనని శివాజీ అన్నాడు. ఒక రాజ్యంలోకి నలుగురు కలిసి వచ్చారు. ముందే మాట్లాడుకొని వచ్చారు. అది నాకు సెకెండ్ రోజే అర్థమైందని, అలా గ్రూప్ గా ఆడటం తప్పని శివాజీ డైరెక్ట్ గా సీరియల్ బ్యాచ్ ని ఉద్దేశించి అన్నాడు. ఇక నామినేట్ చేసేముందు .. అసలు మీ దగ్గర విషయం లేదు తమ్ముడు అని అమర్ దీప్ తో అన్నాడు శివాజీ. ఆ తర్వాత ప్రియాంక జైన్ ని తన సెకెండ్ నామినేషన్ చేసాడు. 80% బాగా ఆడుతున్నావ్, మిగతా 20% ఫేక్ ఆడుతున్నావని అది నాకు నచ్చలేదని, సరైన రీజన్ లేకుండా నన్ను బయాజ్(పక్షపాతం) గా ఉన్నానని అన్నారు అది తప్పని జనాలు చూస్తున్నారని ప్రియాంక జైన్ తో శివాజీ అన్నాడు.

అమర్ దీప్ మొదటగా శివాజీని, ఆ తర్వాత శుభశ్రీని నామినేట్ చేశాడు. అయితే దీనికంటే ముందుగా అమర్ దీప్, ప్రియాంక జైన్ ని శుభశ్రీ నామినేట్ చేసి.. గ్రూప్ గా ఆడుతున్నారని, సేఫ్ గేమ్ ఆడుతున్నారని అంది. ఇక అమర్ దీప్.. మీరు ఒక కథ చెప్పారు. నేనొక కథ చెప్తున్నాని అమర్ దీప్ చెప్పాడు. ఒక అన్న, తమ్ముడు కలిసి బ్యాంక్ రాబరీకి వెళ్ళారు. అయితే అన్న అయిదుగురిని తీసుకొని బ్యాంక్ రాబరీకి వెళ్ళాడు. ‌బయటకు ఒక్కడే వస్తాడని అమర్ దీప్ అనగానే.. ఇది జూలాయి సినిమా కథ అని శివాజీ అనగానే హౌజ్ లోని వాళ్ళంతా నవ్వేశారు. అది కాదు అన్న, ఆ రోజు స్మైలీ టాస్క్ లో గౌతమ్ కృష్ణ, రతిక బాగా ఆడారని ఎలా అన్నారు అన్నా, నేను కూడా బాగా ఆడాను కదా అని అమర్ దీప్ అనగానే.. తమ్ముడు రాజ్యంలో రాజు గారి పెద్ద భార్య మంచిది అంటే చిన్న భార్య చెడ్డదని కాదని శివాజీ అన్నాడు. ఇక టేస్టీ తేజ గ్రూప్ గా ఆడుతున్నారని ఎలా అన్నారంటూ ఒక సత్తి డైలాగ్ కొట్టి వెళ్ళాడు టేస్టీ తేజ.

Jayam serial: వీరూ ప్లాన్ ని కనిపెట్టిన గంగ.. రుద్ర తెలుసుకుంటాడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -146 లో.... రుద్రకి ఎదురుగా గంగ వెళ్తుంది కానీ రుద్ర ఫోన్ మాట్లాడుతూ వెళ్ళిపోతాడు. కొంచెం దూరం వెళ్ళగానే రుద్రకి రింగ్ కనిపిస్తుంది. అది తీసుకొని చూస్తాడు. అప్పుడే ప్రమీల, ప్రీతీ వస్తారు. అన్నయ్య ఆ రింగ్ గంగ వదినది అని ప్రీతీ అంటుంది. ఈ రింగ్ ప్రపంచంలో ఆవిడకి ఒక్కదానికే ఉందా ఏంటని రుద్ర అంటాడు. ఆ తర్వాత అటుగా వెళ్తున్న గంగని రుద్ర పిలుస్తాడు. గంగ ముసుగులో ఉంటుంది. రుద్ర పిల్వగానే వస్తుంది. ఈ రింగ్ మీదేనా అని అడుగుతాడు. గంగ నాదేనని తీసుకుంటుంది..