English | Telugu

శివాజీ నెంబర్ వన్.. చివరి స్థానంలో టేస్టీ తేజ!

బిగ్ బాస్ హౌజ్ లో సోమవారం జరిగిన నామినేషన్లో మొత్తంగా ఏడుగురు కంటెస్టెంట్లు నామినేషన్లో ఉన్నారు. శివాజీ, యావర్, అమర్ దీప్, శుభశ్రీ , ప్రియాంక జైన్, టేస్టీ తేజ, గౌతమ్ కృష్ణ నామినేషన్లో ఉన్నారు.

పల్లవి ప్రశాంత్, ఆట సందీప్, శోభా శెట్టి హౌజ్ మేట్స్ గా ఉన్నందున వారు నామినేషనలో లేరు. ఒక ఓటింగ్ పోల్ విషయానికొస్తే శివాజీ వన్ మ్యాన్ షో నడుస్తుంది. ఇప్పటివరకు ఏ సీజన్లో నమోదవని ఓటింగ్ శివాజీకి వచ్చింది. అత్యధికంగా 60% ఓటింగ్ తో నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక తర్వాతి స్థానంలో ప్రిన్స్ యావర్, శూభశ్రీ రాయగురు ఉన్నారు. ఇక సీరియల్ బ్యాచ్ కి గడ్డుకాలమే అనిపిస్తుంది. చివరి స్థానంలో టేస్టీ తేజ ఉన్నాడు. అయితే అమర్ దీప్, టేస్టీ తేజలకి స్వల్ప తేడాతో ఉన్నారు. అమర్ దీప్ కి గనుక ఈ నాలుగు రోజుల్లో ఓటింగ్ పడకుండా టేస్టీ తేజకి పడితే ఈ సారి అమర్ దీప్ ఎలిమినేట్ అవడం కాయం. ఇక కన్నింగ్ స్టార్ ప్రియాంక జైన్ మ్యానిపులేషన్ చేస్తుందని హౌజ్ లో అందరికి తెలిసిపోయింది.

మొన్న జరిగిన ఆదివారం ఎపిసోడ్‌లో శివాజీ ఎందుకు బయాజ్ అని ప్రియాంకని నాగార్జున అడిగినప్పుడు.. తడబడింది. చెప్పిన సమాధానం కూడా వ్యాలిడ్ కాదని నాగార్జున అన్నాడు. అలాగే శోభా శెట్టి కూడా ఆక్ పాక్ కరేపాక్ అన్నట్టుగా సమాధానం చెప్పడంతో సీరియల్ బ్యాచ్ అంతా గ్రూప్ గా ఆడుతున్నారని బిగ్ బాస్ ప్రేక్షకులకు అర్థమైంది. అందుకేనేమో ప్రియాంక జైన్ కి ఓటింగ్ చాలా తక్కువ వస్తుంది. మరి ఈ వారం నామినేషన్లో ఉన్న సీరియల్ బ్యాచ్ నుండి అమర్ దీప్, ప్రియాంక జైన్ సేఫ్ అవుతారా లేదా చూడాలి మరి.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.

Karthika Deepam2 : దాస్ ని నిజం చెప్పకుండా ఆపిన కార్తీక్.. దీప ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -566 లో.. జ్యోత్స్న గురించి శివన్నారాయణకి దాస్ నిజం చెప్పాలని అనుకుంటాడు. జ్యోత్స్న, పారిజాతం టెన్షన్ పడుతారు. దాస్ ని జ్యోత్స్న  కొట్టిన విషయం చెప్తాడు కావచ్చని దశరథ్ అనుకుంటాడు. జ్యోత్స్న గురించి ఇప్పుడే నిజం తెలియొద్దని దాస్ ని ఆపాలని కార్తీక్ ట్రై చేస్తాడు.. దాస్ నిజం చెప్పబోతుంటే ఒకవైపు దశరథ్.. ఒకవైపు కార్తీక్.. ఒకేసారి దాస్ ని ఆగమంటారు. దాస్ ఏదో ..చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావ్ పక్కకిరా.. నాతో చెప్పమని దశరథ్ అంటాడు.