English | Telugu
స్పై పేరుతో త్వరలోనే సినిమా తీస్తా : శివాజీ
Updated : Dec 27, 2023
బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో శివాజీ ఈజ్ నెంబర్ వన్ అని మొదటి నుండి ఎన్నో వార్తలు, మరెన్నో పేజ్ లలో చెప్పుకున్నారు. ఎందుకంటే శివాజీ ఫెయర్ ప్లే, తప్పు చేయకూడదని అందరిని గైడ్ చేసే విధానం, అమాయకుడైన యావర్, రైతుబిడ్డ ప్రశాంత్ పక్షాన నిల్చొని గ్రూప్ గా ఆడుతున్న స్పా బ్యాచ్ కి ఎదురునిలిచాడు. అందుకే శివాజీకి ఫ్యాన్ బేస్ మాములుగా లేదు. మొదటి వారం నుండి ప్రతీ నామినేషన్ లో ఉన్నప్పుడు.. ఓటింగ్ పోల్స్ లో శివాజీ నెంబర్ వన్ గా ఉన్నాడు. ఇక రైతుబిడ్డని దగ్గరుండి గెలిపించిన శివాజీ తన మొదటి ఇంటర్వూ ఇచ్చాడు. ఈ సందర్భంగా కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు.
రైతుబిడ్డ అని చెప్పుకొని వచ్చాడని కొందరు అన్నారు కదా మీరేమంటారని అడుగగా.. తప్పేం ఉంది. వాడు రైతు బిడ్డ.. నేను కూడా రైతుబిడ్డనే. సీఎమ్ ల కొడుకులు సీఎమ్ లు అవుతున్నప్పుడు తప్పేం ఉంది. ప్రతీ మనిషి తప్పులు చేస్తాడు. ఎన్నో కష్టాలని ఎదుర్కొని వచ్చాడు. రైతుబిడ్డ అనే దానిని ట్యాగ్ అని ఎందుకనుకుంటున్నారో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదని శివాజీ అన్నాడు. హౌస్ లో అంతమంది కంటెస్టెంట్స్ ఉండగా యావర్, ప్రశాంత్ లకే ఎందుకు సపోర్ట్ చేశారని అడుగగా.. మా నాన్నది పల్నాడు అమ్మది కృష్ణా జిల్లా వాళ్ళిద్దరు ఎలా కలిసారో ఎలా తెలుసు. ఇది అంతే ఆ సమయానికి అలా జరిగింది. అంతా కూడా కర్మఫలమే అని శివాజీ అన్నాడు. హౌస్ లో అంత బాగా ఉన్న శివన్న మొన్న ప్రశాంత్ జైలుకి వెళ్ళినపుడు కోర్ట్ దగ్గరికి ఎందుకు వెళ్ళలేదని కొందరు అంటున్నారని అడుగగా.. ఎందుకు వెళ్ళాలి. నేను వెళ్తే ఏం అయిన రిలీజ్ చేస్తారా.. చట్టపరిధిలో వాడున్నాడు. వాళ్ళ అమ్మ నాన్న బావ నాతో కంటిన్యూస్ గా టచ్ లో ఉన్నారు. ఏం చేయాలో ఎలా చేయాలో చెప్పాను. నా కొడుకు ఓ పక్కన అమెరికా వెళ్తున్నాడు. మా రిలేటివ్స్ అంతా వచ్చారు. అయిన వాడికి నేనేంటో తెలుసు. వాడి గుండెల్లో నేనున్నాని వాడే ఇంటికి వచ్చాక చెప్పాడని శివాజీ అన్నాడు.
మీ స్పై బ్యాచ్ తో ఒక సినిమా చూడాలనుకుంటున్నారు అని అడుగగా.. త్వరలోనే నేనే తీస్తాను. అది సినిమా అని చెప్పలేను కానీ షాట్ మూవీ అయితే చేస్తానను. నిన్నే డిసైడ్ అయ్యాము. టైటిల్ కూడా స్పై అని శివాజీ చెప్పాడు. అమర్ ని టార్గెట్ చేసి విన్నర్ అవ్వకుండా చేశాడని, వాడిని నమ్మొద్దని నా కొడుకులకి కూడా చెప్తానని ఏ సందర్భంగా అన్నారని అడుగగా.. అదేం లేదు. వాడు అంతకముందు ఒకలా ఉన్నాడు. వాళ్ళని నామినేషన్ చేయడం వాడి ఇష్టం. ఆ నామినేషన్ తర్వాత సరదాగా నేనే కాదురా నా పిల్లల్ని కూడా నమ్మొద్దని చెప్తానని అన్నాను. పన్నెండు వారాల దాకా ఫౌల్ గేమ్ ఆడానని, గ్రూప్ గా ఆడానని వాడే చెప్పుకున్నాడు. ఒక స్టేజ్ కి వచ్చాక అమర్ రియలైజ్ అయ్యాడు కానీ అప్పటికే చేయి దాటిపోయింది. ఇవన్నీ రాసుకోడానికి, చెప్పుకోడానికి మాత్రమే నెగెటివ్ వద్దని శివాజీ అన్నాడు. టేస్టీ తేజ బిజ్జాలదేవ అన్నాడని అందరు అతడిని నెగెటివ్ చేశారు మీరేమంటారని అడుగగా.. వాడు స్మార్ట్ బాయ్. వాడిలో మంచి స్ట్రాటజీ ఉంది కానీ వాడు దానిని కరెక్ట్ గా వాడుకోలేదు. ఏదో ఫ్లిప్ అయ్యాడు సారీ చెప్తే బాగుండేదని శివాజీ చెప్పుకొచ్చాడు. శోభాతో పెద్ద గొడవ జరిగింది కదా అసలెందుకు అలా జరిగిందని అడుగగా.. అది వాళ్ళు కావాలని చేశారు. నేను ఇన్ని సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉన్నాను కదా దానివల్ల గొడవ పెట్టుకుంటే వారికి ఏం అయిన ఉపయోగపడుతుందని భావించి అలా చేసినట్టున్నారని శివాజీ చెప్పుకొచ్చాడు.