English | Telugu

బిగ్ బాస్ లవర్ బాయ్ కి  సిబా-2023 అవార్డు..!

బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో లవర్ బాయ్ గా అందరికి సుపరిచితమయ్యాడు అర్జున్ కళ్యాణ్. శ్రీసత్యతో కలిసి లవ్ ట్రాక్ నడిపాడు. తనకోసం ఏమైనా చేస్తానని చెప్పుకుంటు బిగ్ బాస్ సీజన్‌ సిక్స్ లో ఉన్న అర్జున్.. వాసంతి కృష్ణన్ తో మంచి స్నేహాన్ని ఏర్పడుచుకున్నాడు. బిగ్ బాస్ సీజన్‌- 6 ముగిసాక మొదలైన బిబి జోడీలో శ్రీసత్యతో కాకుండా వాసంతి కృష్ణన్ తో కలిసి జోడీ కట్టి అదరహో అనిపించాడు.

అర్జున్ కళ్యాణ్ మొదట్లో చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్ లు చేస్తూ కెరీర్ ని ప్రారంభించాడు. పూజిత పొన్నాడతో కలిసి 'పరిచయం' అనే షార్ట్ ఫిల్మ్ తీసాడు అర్జున్. ఆ తర్వాత వైష్ణవి చైతన్యతో కలిసి 'మిస్సమ్మ' అనే షార్ట్ ఫిల్మ్ తీసాడు. ఇక ఈ సంవత్సరం ప్రవళిక దామెర్ల, ఆర్జే సూర్యతో కలిసి '7 Days Of Love' అనే వెబ్ సిరీస్ ని చేశాడు. బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో శ్రీసత్య చుట్టూ తిరిగిన అర్జున్ కళ్యాణ్ కి ఫ్యాన్ బేస్ ఉంది. వీరిద్దరి జోడీని సీజన్-6 అభిమానులు మళ్ళీ మళ్ళీ చూడాలనుకున్నారు‌. అయితే శ్రీసత్యకి అర్జున్ అంటే ఇంట్రస్ట్ లేదని చాలాసార్లు చెప్పకనే చెప్పింది. అయితే కొంతకాలం క్రితం జరిగిన దసరా ఈవెంట్ లో శ్రీసత్యతో కలిసి జోడీగా వచ్చి డ్యాన్స్ తో ఆకట్టుకున్నాడు.వైజాగ్‌లో బీటెక్ చదివి యూఎస్‌లో యాక్టింగ్ కోర్సులు చేసిన అర్జున్ మోడల్‌గా కూడా పనిచేసాడు. లవర్ ఫరెవర్, ఉప్మా తినేసింది, అన్ స్పోకెన్, పరిచయం, మిస్సమ్మ వంటి వెబ్ సిరీస్‌లలో నటించాడు. 2013 లో వచ్చిన ‘చిన్న సినిమా’ మూవీతో హీరోగా పరిచయం అయ్యాడు. నాగ చైతన్య సినిమాలో అనుపమ బాయ్ ఫ్రెండ్‌గా అర్జున్ కల్యాణ్ నటించాడు. ప్లే బ్యాక్, వరుడు కావలెను, పెళ్లికూతురు పార్టీ అనే సినిమాలు కూడా చేశాడు.

యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ తో వచ్చిన వారిని అర్జున్ కళ్యాణ్ ఇన్ ఫ్లూయన్స్ చేశాడు.బిగ్ బాస్ హౌస్‌కి వెళ్లేముందు తన బ్రేకప్ స్టోరిని షేర్ చేసుకున్న అర్జున్ కల్యాణ్.. సీజన్ సిక్స్ లో ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత శ్రీసత్యతో క్లోజ్ గా ఉండేవాడు. బిగ్ బాస్ తర్వాత బిబి‌ జోడీలో అర్జున్ కళ్యాణ్ చేసిన ఒక డ్యాన్స్ థీమ్.. పెంపుడు కుక్క పాత్ర.‌ ఇందులో అర్జున్ కనబరిచిన హావభావాలకి జడ్జులతో పాటు సాటి డ్యాన్సర్స్ కూడా ఎమోషనల్ అయ్యారు. ‌అలాగే బిబి జోడీలో అన్నిరకాల డ్యాన్స్ తో ఎంతో గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే తాజాగా సౌత్ ఇండియా ఇన్ ఫ్లూయన్సర్స్ బ్లాగర్స్ నుండి అర్జున్ కళ్యాణ్ కు ఇన్ ఫ్లూయన్సర్ అవార్డు వచ్చింది. అయితే ఈ విషయాన్ని అర్జున్ కళ్యాణ్ తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశాడు. ఒక మనిషిని కళని ఎక్కడ ఉన్నా గుర్తిస్తారనేది ఈ అవార్డుతో నిజమైంది. ఇక దీని గురించి అర్జున్ కళ్యాణ్ చేసిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.

Podharillu: మహా పెళ్ళికి అంతా ఫిక్స్.. చక్రిని ఆమె అర్థం చేసుకుందా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -12 లో.....మహా తన డ్రీమ్ గురించి భూషణ్ కి చెప్తుంది. డ్రీం లేదు ఏం లేదు ఫ్యామిలీ ని చూసుకుంటే సరిపోతుంది. నాకు నచ్చింది వండి పెడుతూ వెళ్ళేటప్పుడు బై చెప్పి వచ్చేటప్పుటికీ అందంగా రెడీ అయి ఉంటే చాలని చెప్పగానే వీడితో అనవసరంగా నా డ్రీమ్ గురించి చెప్పానని మహా అనుకుంటుంది. అదంతా చక్రి వింటాడు. మరొకవైపు మాధవ దగ్గరికి గాయత్రి వచ్చి.. ఈ పెళ్లి కూడా క్యాన్సిల్ అయ్యిందంట కదా అని చెప్పగానే అందరు షాక్ అవుతారు. ఏ సైలెంట్ గా ఉండు.. ఈ విషయం కన్నాకి తెలియదని మాధవ అంటాడు.

Brahmamudi: రాజ్ తీసిన యాడ్ సక్సెస్.. ధాన్యలక్ష్మి ఇచ్చిన బిగ్ ట్విస్ట్ అదే!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -911 లో..... అప్పు ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే ఒకావిడని రౌడీలు వెంబడిస్తారు. అప్పుని చూసి ఆవిడ దగ్గరికి వచ్చి.. మేడం కాపాడండి అంటుంది. రౌడీలు పోలీసులని చూసి పారిపోతారు. మేడమ్ వాళ్ళు నా నగలు దొంగతనం చెయ్యాలని వెంబడిస్తున్నారని చెప్తుంది. దాంతో వాళ్ళని పట్టుకోమని కానిస్టేబుల్ కి చెప్తుంది అప్పు. చాలా థాంక్స్ మేడమ్ అని ఆవిడ చెప్తుంది. మీరు ఎక్కడికి వెళ్ళాలి నేను డ్రాప్ చేస్తానని అప్పు అంటుంది. ఆవిడ ఇంటిముందు దింపుతుంది...

Illu illalu pillalu : ఇంగ్లీష్ టీచర్ గా సెలెక్ట్ అయిన శ్రీవల్లి బయటపడుతుందా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -349 లో..... ప్రేమ, నర్మద కలిసి డుప్లికేట్ డాక్టర్ ని తీసుకొని వచ్చి శ్రీవల్లిని భయపెడతారు. నీకు జ్వరం తగ్గింది కదా అక్క ఇక ఇంటర్వ్యూకి వెళదామని ఇద్దరు దగ్గరుండి మరి ఇంటర్వ్యూ కోసం స్కూల్ కి తీసుకొని వెళ్తారు. శ్రీవల్లి ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్లి తన సర్టిఫికెట్లు ఇస్తుంది. టెల్ మీ యువర్ సెల్ఫ్ అని ప్రిన్సిపల్ అనగానే శ్రీవల్లికి ఏం చెయ్యాలో అర్థం కాదు. అసలు మీకు ఇంగ్లీష్ వచ్చా రాదా అని ప్రిన్సిపల్ అడుగుతాడు.