English | Telugu
షకీల ఎలిమినేషన్ పక్కానా.. ఉల్టా పల్టా జరగనుందా!
Updated : Sep 17, 2023
బిగ్ బాస్ సీజన్-7 రోజురోజుకి ఆసక్తికరంగా మొదలైంది. అయితే గత సోమవారం జరిగిన నామినేషన్లో మొత్తం తొమ్మిది మంది నామినేషన్లో ఉండగా నిన్న జరిగిన శనివారం నాటి నామినేషన్లో అమర్ దీప్ సేవ్ అయ్యాడు. మరి ఆదివారం నాటి ఎపిసోడ్‌లో ఏం జరుగనుంది అనే క్యూరియాసిటి ఇప్పుడు మరింత పెరిగింది.
అయితే ఇప్పటికే సోషల్ మీడియాలో షకీల ఎలిమినేషన్ అనే వార్త జోరందుకుంది. ఇప్పటికే తన పర్ఫామెన్స్ చూసి తోటి కంటెస్టెంట్స్ కే కాకుండా బిగ్ బాస్ ప్రేక్షకులకు విసుగొచ్చింది. ఎప్పుడు చూసిన తనేదో ట్రిప్ కి వచ్చినట్టు అలా కూర్చుంటుంది. ఇక మిగిలిన హౌజ్ మేట్స్ కి తనొక అమ్మలాగా అందరికి ఎప్పుడు, ఏదో చెప్తుంటుంది. ఇక గేమ్స్ టాస్క్ అనగానే నా ఏజ్ కి తగ్గట్టుగా ఆడానని ఇప్పటికే చాలాసార్లు అంది షకీల. అయితే మొన్న జరిగిన పుల్ రాజా పుల్ గేమ్ లో రణధీర టీమ్ లో ఉన్న షకీల.. తన ప్రయత్నం చేసింది. కానీ ఆ టైమ్ లో ప్రిన్స్ యావర్ వాళ్ళ టీమ్ లో లేకుంటే శివాజీ, శోభా శెట్టి, ప్రియాంక జైన్, యావర్, షకీల వాళ్ళ టీమ్ ఓడిపోయేది.
శనివారం పర్ఫామెన్స్ వైజ్ గా నామినేషన్లో ఉన్న ఒక్కో కంటెస్టెంట్ ని సేవ్ చేస్తూ వస్తున్నాడు బిగ్ బాస్. కాగా నిన్న జరిగిన శనివారం నాటి ఎపిసోడ్‌లో ఒక్కో కంటెస్టెంట్ చేసిన నామినేషన్ల గురించి నాగార్జున గట్టిగానే క్లాస్ తీసుకున్నాడు. మరి ఈ రోజు జరిగే ఎలిమినేషన్ లో ఎవరు వెళ్తారనే క్యూరియాసిటి ఇప్పుడు అందరిలో ఉంది. అయితే ఓటింగ్ లో టేస్టీ తేజ, షకీల, శోభా శెట్డి లీస్ట్ లో ఉన్నారు. ఉల్టా పల్టాగా సాగుతున్న ఈ సీజన్ లో.. బిగ్ బాస్ హౌజ్ నుండి ఎవరు ఎలిమినేట్ అవుతారో తెలియాలంటే మరికొంత సమయం ఆగాల్సిందే.