English | Telugu

చీరకట్టులో గీత మాధురి బేబీ బంప్... విడాకుల రూమర్స్ కి బ్రేక్!

తెలుగు ఇండస్ట్రీలో ప్లే బ్యాక్ సింగర్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో సింగర్ గీతామాధురి ఒకరు. ఈమె పాడిన పాటలు సూపర్ హిట్స్ గా నిలిచాయి. ఆమె వాయిస్ కి చాలామంది ఫాన్స్ కూడా ఉన్నారు. సాంగ్స్ పాడడమే కాదు పలుషోలకు జడ్జ్ గా కూడా వ్యవహరిస్తూ బిజీగా ఉన్నారు. ఇక ఈమె నటుడు నందుని లవ్ మ్యారేజ్ చేసుకున్న విషయం తెలిసిందే. ఈ కపుల్ కి మొదట సంతానంగా దాక్షాయిని ప్రకృతి అనే కూతురు ఉన్న విషయం తెలిసిందే. ఇక ఈ చిన్నారి వయసిప్పుడు ఐదేళ్లు. ఇప్పుడు మరోసారి గీతామాధురి తల్లి కాబోతున్నారని తెలుస్తోంది. ఇక తాను తల్లి కాబోతున్నాను అంటూ శుభవార్తను ఇన్స్టాగ్రామ్ వేదికగా చెప్పారు . తన కుమార్తె దాక్షాయిని ప్రకృతి వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలలో అక్కగా ప్రమోట్ కాబోతుంది అంటూ ఈమె తాను ప్రెగ్నెంట్ అనే విషయాన్ని షేర్ చేసుకున్నారు.

తన భర్త కూతురితో కలిసి దిగిన ఫోటోలను ఈమె చీర కట్టుకొని ఉన్నటువంటి ఫోటోలను షేర్ చేశారు. ఈ శారీ పిక్స్ లో గీత మాధురి బేబీ బంప్ క్లియర్ గా కనిపిస్తుంది. ఈమె చెప్పిన గుడ్ న్యూస్ కి ఎంతోమంది అభిమానులు, తోటి సింగర్లు, నటీనటులు విషెస్ చెప్తున్నారు. గీత భర్త నందు క్రికెట్ కి కామెంటరీ చెప్తూ మరో వైపు పలు సినిమాలు, వెబ్ సిరీస్ లో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. తాజాగా ఈయన వధువు అని వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఐతే కొంత కాలం క్రితం గీత మాధురి, నందు డివోర్స్ తీసుకుని విడిపోతున్నారంటూ రూమర్స్ కూడా వచ్చాయి. కానీ అదంతా ఫేక్ న్యూస్ ఎవరూ నమ్మొద్దని తాము చాల సంతోషంగా ఉన్నామని ఈ లవబుల్ కపుల్.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.