English | Telugu

పవిత్ర కార్ కి ఆక్సిడెంట్ చేసిన షబానా...ఇద్దరి మధ్య గొడవ!


ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా ప్రాంక్ వీడియోస్ మీదే నడుస్తోంది. ఒకరు ప్రాంక్ చేస్తే మరొకరు దానికి రివెంజ్ ప్రాంక్ ప్లాన్ చేసుకుని మరీ పగ తీర్చుకుంటున్నారు. అలానే చేశారు పాగల్ పవిత్ర, షబానా..ఇంతకు ముందు షబానా పవిత్ర ఇంటికి వెళ్తే ఫుడ్ పెట్టి ప్రాంక్ చేయడంతో ఇప్పుడు తన ఇంటికి వచ్చిన పవిత్ర మీద రివెంజ్ ప్రాంక్ ప్లాన్ చేసి బాగా ఏడిపించింది షబానా. పవిత్ర రీసెంట్ గా ఒక కార్ కొనుక్కున్న విషయం తెలిసిందే. ఐతే షబానాని కలవడానికి వాళ్ళ ఇంటికి కార్ వేసుకుని వెళ్ళింది. పవిత్ర మీద రివెంజ్ తీర్చుకోవడం కోసం షబానా ప్లాన్ చేసింది.

వెబ్ సిరీస్ గురించి ఒక రైటర్ తో మాట్లాడాలి అని చెప్పి పవిత్ర కార్ ని అడిగి తీసుకుని వెళ్ళింది. ఐతే ఆ గల్లీల్లో తిరిగి చివరికి పవిత్రకు ఫోన్ చేసి కార్ కి ఎవరో డాష్ ఇచ్చి వెళ్లిపోయారు. తన తప్పు ఏమీ లేదని..కార్ బాగా డామేజ్ అయ్యిందని చెప్పింది. దాంతో పవిత్ర షాక్ అయ్యింది. కానీ కార్ కి ఎలాంటి డామేజ్ కాలేదు..ఐతే డామేజ్ ఐనట్టు షబానా కొంచెం గోధుమపిండి వాటర్ ని కలిపి కార్ డాష్ బోర్డుకి బాగా మందంగా పూసేసి దాని మీద మట్టి జల్లేసింది. దాంతో అక్కడ బాగా డామేజ్ ఐనట్టుగా ఒక సీన్ ఐతే క్రియేట్ అయ్యింది. అది చూసి పవిత్ర షబానాను ఇష్టమొచ్చినట్టు తిట్టేసింది. ఇన్సూరెన్స్ వస్తుంది కదా ఏడవకు అంది షబానా. ఇన్సూరెన్స్ చేయించలేదని పవిత్ర చెప్పేసరికి అంతా అబద్దం చెప్తున్నావ్ అంటూ కాసేపు ఆట పట్టించింది. షబానా నవ్వుకి పవిత్రకు మంటెక్కిపోయింది. దాంతో వాళ్ళ అమ్మకు కార్ విషయం చెప్దామని ఫోన్ చేసే లోపు ఇదంతా ప్రాంక్ ఏడవకు మీ అమ్మకు ఫోన్ చేయకు అని షబానా ఆపేసింది. ఆ మాటకు పవిత్ర ఎం మాట్లాడాలో అర్ధం కాకా అలాగే నిలబడిపోయింది.