English | Telugu
అమర్ దీప్ పేరును అమర్ తేజగా నామకరణం చేసిన అనంత శ్రీరామ్!
Updated : Feb 27, 2024
సూపర్ సింగర్ ఈ వారం షోలో జడ్జ్ అనంత శ్రీరామ్ అమర్ దీప్ కి నామకరణం చేసాడు. ఇంతకు ఎం చేసాడో చూద్దాం. అఖిల్ అనే కంటెస్టెంట్ రవితేజ మూవీలోని "నుదిటి రాతలు మార్చేవాడా" అనే సాంగ్ పాడితే అమర్ డాన్స్ చేసాడు. సాంగ్ పూర్తయ్యాక అనంత శ్రీరామ్ మాట్లాడుతూ రవి తేజ మీద ఉన్న అభిమానం తన ఎక్స్ప్రెషన్స్ లో కనిపించాయన్నారు. రవితేజ ఒక 20 ఏళ్ళు చిన్నగా అయ్యి డాన్స్ చేస్తున్నట్టే అనిపించింది అన్నారు. కాబట్టి అమర్ తేజ అందాం అనేసరికి చాలా హ్యాపీగా ఫీలైపోయాడు..తన భార్య పేరు కూడా తేజస్విని గౌడ కాబట్టి అమర్ తేజ సెట్ ఐపోతుంది..రవితేజ పేరులా అమర్ తేజ బాగుంది అన్నాడు.
తర్వాత శ్రీముఖి అమర్ కి, తేజుకి ఒక టాస్క్ ఇచ్చింది శ్రీముఖి . "దేవుడు వచ్చి ఒక మూడు కోరికలు కోరుకోమంటే ఎం కోరుకుంటారు" అని ఇద్దరినీ అడిగింది. " మాస్ మహారాజ రవితేజలా అవ్వాలి, టైంమెషిన్ లో వెనక్కి వెళ్లి రవితేజ రూమ్ మేట్ ని కావాలి, రవితేజ గారితో మూవీ చేయాలి" అని అమర్ తేజ రాస్తే .." కెరీర్ , రవితేజ గారితో మూవీ చేయాలి, ఫ్రెండ్స్ అండ్ ఫామిలీతో హ్యాపీగా ఉండాలి" అని తేజు రాసింది. అమ్మా తేజు మీ ఆయన పిచ్చిని ఇలాగే భరిస్తూ ఉండు..ఇద్దరూ రెండు ఆన్సర్స్ ని సమానంగా రాశారు అని చెప్పింది. అమర్ దీప్ కి రవితేజ అంటే ఇష్టం కాబట్టి ఈ షోకి వచ్చే ముందు రిహార్సల్స్ కి కూడా కొరియోగ్రాఫర్ కూడా చెప్పకుండానే చేసేశాడని తేజు చెప్పింది. రవి తేజ అంటే అమర్ కి పూనకాలు వచ్చేస్తాయి అంటూ శ్రీముఖి ఒక కౌంటర్ వేసింది. ఇక అమర్ దీప్ బిగ్ బాస్ 7 తెలుగు కంటెస్టెంట్ గా, రన్నరప్ నిలిచిన విషయం తెలిసిందే.