English | Telugu

శివాజీకి మద్దతుగా సీరియల్ ఆర్టిస్ట్ ప్రియ!

బిగ్ బాస్ సీజన్-7 రోజు రోజుకి ఎంతో‌ ఆసక్తికరంగా మారుతుంది. మరో వారంలో ఈ షో ముగుస్తుండటంతో హౌస్ లో ఉన్నవారిలో ఎవరు కప్ గెలుస్తారనే ఉత్కంఠ నెలకొంది. ఈ సమయంలో హౌస్ లోని వారికి ఆర్టిస్ట్, యాంకర్స్, సెలబ్రిటీలు తమ ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఓట్ చేయమని సోషల్ మీడియా వేదికగా తెలుపుతున్నారు. ఇలా ఇన్ స్టాగ్రామ్ లో పల్లవి ప్రశాంత్, శివాజీలకి సపోర్ట్ చేసే వారే ఎక్కువగా కన్పిస్తున్నారు.‌ ఇప్పుడు తాజాగా సీరియల్ యాక్టర్స్, సినిమా తారలు సైతం శివాజీకే ఓట్ చేయమని చెప్తున్నారు. తాజాగా ఆర్టిస్ట్ ప్రియ తన ఇన్ స్టాగ్రామ్ లో శివాజీ సపోర్ట్ చేయండి అంటూ రిక్వెస్ట్ చేసింది. " హౌస్ లో జన్యున్ గా ఉండి, టాస్క్ లలో ఉన్న వారితో సమానంగా ఆడుతున్నాడు. ఫెయిర్ గేమ్ ఆడుతూ ఆట స్థాయిని పెంచుతున్న శివాజీకి ఓట్ చేయండి. ఈ సీజన్-7 శివాజీ కప్ గెలవాలని కోరుకుంటున్నాను‌‌. నన్ను అభిమానించే వారు శివాజీకి ఓట్ చేయండి" అంటూ ప్రియ తన ఇన్ స్టాగ్రామ్ లో చెప్పింది.

బిగ్ బాస్ సీజన్-5 లో ఏడో కంటెస్టెంట్‌గా న‌టి ప్రియ ఎంట్రీ ఇచ్చారు. ఒక‌వైపు సినిమాల్లో, మ‌రోవైపు టీవీ సీరియ‌ళ్ల‌లో న‌టిస్తూ, అంద‌మైన తార‌గా గుర్తింపు తెచ్చుకున్నారు ప్రియ. మిర్చీ సినిమాలో రీచా గంగోపాధ్యాయకి తల్లి పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రియ పూర్తిపేరు మామిళ్ల శైలజాప్రియ‌. గుంటూరు జిల్లా బాప‌ట్ల‌లో పుట్టి పెరిగిన ఆమె సినిమాల మీద మోజుతో 19 సంవ‌త్స‌రాల వ‌య‌సులో ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టారు. మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్ చేసిన 'మాస్ట‌ర్', 'అన్న‌య్య' సినిమాల్లో న‌టించ‌డం ద్వారా ద‌ర్శ‌క నిర్మాత‌ల దృష్టిలో పడ్డారు. ముఖ్యంగా అన్న‌య్య సినిమాలో హీరోయిన్ సౌంద‌ర్య ఫ్రెండ్‌గా ఆక‌ట్టుకున్నారు. ఆ త‌ర్వాత సౌంద‌ర్య‌తో క‌లిసి ప‌లు సినిమాల్లో న‌టించారు ప్రియ‌. చిరంజీవి, బాల‌కృష్ణ‌, నాగార్జున‌, వెంక‌టేశ్‌, ప‌వ‌న్ క‌ల్యాణ్ లాంటి స్టార్స్‌తో పాటు హిందీలో అమితాబ్ బ‌చ్చ‌న్‌తోనూ ఆమె న‌టించారు.

'ప్రియ‌స‌ఖి' సీరియ‌ల్‌తో ఉత్త‌మ‌న‌టిగా నంది అవార్డును అందుకున్నారు. వాణి రాణి, నందిని వ‌ర్సెస్ నందిని, చిన్న కోడ‌లు, నంబ‌ర్‌వ‌న్ కోడ‌లు లాంటి సీరియ‌ల్స్‌లో ప్ర‌ధాన పాత్ర‌లు చేశారు. ఇటు వెండితెర‌, అటు బుల్లితెర‌పై అంద‌మైన క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా రాణిస్తుంది ప్రియ. అయితే కృష్ణ ముకుంద మురారి సీరియల్ భవాని పాత్రలో ఆమె నటిస్తూ‌ తెలుగింటి ఆడపడుచులకు ఆదర్శంగా నిలుస్తుంది. మురారికి పెద్దమ్మగా ఇంటిపెద్దగా కుటుంబాన్ని లీడ్ చేస్తున్న భవాని పాత్రలో ఆర్టిస్ట్ ప్రియ ఒదిగిపోయింది.


Jayam serial: వీరూ ప్లాన్ ని కనిపెట్టిన గంగ.. రుద్ర తెలుసుకుంటాడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -146 లో.... రుద్రకి ఎదురుగా గంగ వెళ్తుంది కానీ రుద్ర ఫోన్ మాట్లాడుతూ వెళ్ళిపోతాడు. కొంచెం దూరం వెళ్ళగానే రుద్రకి రింగ్ కనిపిస్తుంది. అది తీసుకొని చూస్తాడు. అప్పుడే ప్రమీల, ప్రీతీ వస్తారు. అన్నయ్య ఆ రింగ్ గంగ వదినది అని ప్రీతీ అంటుంది. ఈ రింగ్ ప్రపంచంలో ఆవిడకి ఒక్కదానికే ఉందా ఏంటని రుద్ర అంటాడు. ఆ తర్వాత అటుగా వెళ్తున్న గంగని రుద్ర పిలుస్తాడు. గంగ ముసుగులో ఉంటుంది. రుద్ర పిల్వగానే వస్తుంది. ఈ రింగ్ మీదేనా అని అడుగుతాడు. గంగ నాదేనని తీసుకుంటుంది..

Brahamamudi: మోడల్ ఫోటోషూట్ కోసం కావ్య ఒప్పుకుంటుందా.. రాజ్ ఏం చేయనున్నాడు!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -908 లో.... రాజ్ గుర్రంపై కూర్చొని ఊరేగుతున్నట్లు తన ఫోటోని రాజ్ కి చూపిస్తుంది కావ్య. అది చూసి నన్ను అలా చేస్తావా అని కావ్య ఫోటోని మోడల్ గా పెట్టి చూపిస్తాడు. చీ బాలేదు తీసెయ్యండి అని కావ్య అంటుంది. కావ్య ఎప్పుడు సంప్రదాయంగా ఉంటుందని ఫోటో మర్చి చూపిస్తుంది. అది చూసి రాజ్ ఫ్లాట్ అవుతాడు. ఇంట్లోనే మోడల్ ని పెట్టుకొని బయట వెతుకుతున్నానని రాజ్ అనుకుంటాడు. ఎలాగైనా యాడ్ లో చెయ్యడానికి కావ్యని ఒప్పించాలని అనుకుంటాడు.

Karthika Deepam2: వైరా ఇచ్చిన డీల్ కి ఒకే చెప్పిన కాశీ.. పోలీస్ స్టేషన్ కి శ్రీధర్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -545 లో....వైరా దగ్గరికి కాశీ వస్తాడు. కాశీ రాగానే రండి సర్ అని కాశీకీ వైరా మర్యాద ఇస్తుంటే నాకు మర్యాద ఇస్తున్నారేంటని కాశీ అడుగుతాడు. మీ రెజ్యుమె చూసాను.‌ చాలా బాగుంది. మనకంటే టాలెంట్ ఎక్కువ ఉన్నవాళ్లు మనకన్నా చిన్న ఏజ్ అయిన రెస్పెక్ట్ ఇవ్వాలని వైరా అంటాడు.. నాకు జ్యోత్స్న ఫోన్ చేసి చెప్పింది మీరు ప్రెజెంట్ ఏం చేస్తున్నారని వైరా అడుగగా జ్యోత్స్న రెస్టారెంట్ సీఈఓ దగ్గర పిఏగా చేస్తున్నానని కాశీ చెప్తాడు. ఏంటి అంత చిన్న జాబ్ చేస్తున్నారా అని వైరా అంటాడు.