English | Telugu

రెండు మర్డర్లు కూడా చేశా...ఆ మాటకు భయపడిన సుమ!


సుమ అడ్డా షో ప్రతీ వారం లాగే ఈ వారం కూడా ఎంటర్టైన్ చేయడానికి కలర్ ఫుల్ ప్రోమోతో వచ్చేసింది. ఈ షోకి రావోయి చందమామ, మా అత్త బంగారం సీరియల్ టీమ్స్ వచ్చాయి. ఇక రావోయి చందమామ సీరియల్ లో సెల్వరాజ్ మాత్రం ఓ రేంజ్ లో హోస్ట్ సుమని టీజ్ చేసాడు. స్టేజి మీదకు వచ్చాక సుమని విజిల్స్ వేసి మరీ పిలిచాడు. "ఏంటి నన్ను చూసి విజిల్ కొడుతున్నాడీయన" అని తెగ మురిసిపోయింది సుమ. "మీరు కత్తిలా ఉన్నారు కాబట్టి లైటింగ్ కొడుతున్నా" అన్నాడు సెల్వా. "సీరియల్ లో మా ఆవిడా ఎప్పుడూ పడుకునే ఉంటుంది..

అందుకే" అని సెల్వ అనేసరికి మరో సీరియల్ టీమ్ వాళ్ళు "ఆవిడ పడుకునే ఉంటుంది కాబట్టి ఇక్కడ విజిల్ వేస్తున్నాడు" అని కౌంటర్ ఇచ్చారు. "సీరియల్ లోకి రాక ముందు వేరే ఏదన్నా వర్క్ చేసారా" అని సెల్వాని సుమ అడిగింది "నా యాంబిషన్ రౌడీయిజమ్ చేయాలని...మనలో మన మాట ..రెండు మర్డర్లు కూడా చేశా" అనేసరికి సుమ షాకైపోయింది " రెండు మర్డర్లు కూడా అయ్యాయంట...ఇది జోకు..నిజంగానే చేశారంటావా" అని పైకి నవ్వేసి చాటుగా అందరినీ అడిగింది. ఇలా ఈ వారం ఈ రెండు సీరియల్ టీమ్స్ వాళ్ళు వచ్చి ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయబోతున్నారు. జెమినీ టీవీలో అప్పట్లో ప్రసారమైన మొగలి రేకులు, చక్రవాకం సీరియళ్ళలో నటించి తన నటనతో ప్రేక్షకులని బాగానే అలరించిన సీనియర్ సీరియల్ నటుడు సెల్వ రాజ్. చక్రవాకం సీరియల్ లో ఇక్బాల్ గా నటించి అందరిని మెప్పించాడు. అప్పట్లో బుల్లితెర మీద ఈ రెండు సీరియల్స్ సంచలనం సృష్టించాయి.

Jayam serial: వీరూ ప్లాన్ ని కనిపెట్టిన గంగ.. రుద్ర తెలుసుకుంటాడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -146 లో.... రుద్రకి ఎదురుగా గంగ వెళ్తుంది కానీ రుద్ర ఫోన్ మాట్లాడుతూ వెళ్ళిపోతాడు. కొంచెం దూరం వెళ్ళగానే రుద్రకి రింగ్ కనిపిస్తుంది. అది తీసుకొని చూస్తాడు. అప్పుడే ప్రమీల, ప్రీతీ వస్తారు. అన్నయ్య ఆ రింగ్ గంగ వదినది అని ప్రీతీ అంటుంది. ఈ రింగ్ ప్రపంచంలో ఆవిడకి ఒక్కదానికే ఉందా ఏంటని రుద్ర అంటాడు. ఆ తర్వాత అటుగా వెళ్తున్న గంగని రుద్ర పిలుస్తాడు. గంగ ముసుగులో ఉంటుంది. రుద్ర పిల్వగానే వస్తుంది. ఈ రింగ్ మీదేనా అని అడుగుతాడు. గంగ నాదేనని తీసుకుంటుంది..