English | Telugu

ఇనయా అందాల విందు.. అది తన నైజమంట!

ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్ ఎక్కడ చూసిన నటీమణుల హాట్ అండ్ బోల్డ్ ఫోటోలని ఇష్టపడే లిస్ట్ లో సపరేట్ గా ఓ బ్యాచ్ ఉంటుంది. వారికి ఎవరైన కాస్త గ్లామర్ డోస్ పెంచినట్టుగా కనిపించిన తెగ ఇష్టపడతుంటారు.

ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్ లో ఇనయా సుల్తానా బోల్డ్ ఫోటోలతో రెచ్చిపోయింది. నా లైఫ్ నాకు ఎప్పుడైన బోర్ అనిపిస్తే నా హెయిర్‌ స్టైల్ చేంజ్ చేస్తాను.. అది నా లైఫ్ ని చాలా ఎక్సైటింగ్ చేస్తుందని, అది తన నైజమని చెప్తూ ఓ పోస్ట్ ని తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. నూలుపోగులతో అల్లిన డ్రెస్ వేసుకొని ఇనయా దిగిన ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. ఇనయా అందాల ఆరబోత కొత్తేం కాదు.. గ్యాప్ ఇస్తూ ఒక్కో ఫోటోషూట్ వదులుతు కుర్రాళ్ళకి పిచ్చెక్కిస్తుంది‌. ఇనయా తన ఫ్యామిలీని వదిలి ఇండస్ట్రీకి వచ్చిందని చాలాసార్లు చెప్పింది. సినిమాల మీద మక్కువతో ఎన్నో రోజులు సినిమా ఆఫీస్ ల చుట్టూ తిరిగానని చెప్పి‌న ఇనయా‌‌.. మూడు సినిమాలలో నటించిందని చెప్పింది. బిగ్ బాస్ లో ఉన్నంతవరకు టాస్క్ లలో ఆడపులిలా ఆడిన ఇనయా సుల్తానా.. బయటకు వచ్చేసరికి తనకంటూ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకొని, ఎవరూ ఊహించనంత క్రేజ్ ని సంపాదించుకుంది. బిగ్ బాస్ కి ముందు ఆర్జీవీతో డ్యాన్స్ చేసిన వీడియో వైరల్ కావడంతో ఓవర్ నైట్ స్టార్ డమ్ తెచ్చుకుంది ఇనయా. దాంతో బిగ్ బాస్ లో అవకాశం కొట్టేసి ఫేమస్ అయింది.

పాపులర్ రియాలిటీ షో అయిన బిగ్ బాస్ సీజన్- 6 తో బాగా పాపులర్ అయ్యింది. బిగ్ బాస్ హౌజ్ లో 14 వారాల పాటు ధీటుగా గేమ్స్ ఆడి మెప్పించింది. కొద్దిలో టైటిల్ మిస్ అయ్యింది.నటిగా ఎదగాలనుకుంటున్న ఇనయా సుల్తానాకు నెట్టింట మాత్రం మంచి క్రేజ్ దక్కింది. ఈ బ్యూటీ పెట్టే ఇంట్రెస్టింగ్ పోస్టులతో మరింతగా ఫాలోవర్స్ ను పెంచుకుంటుంది. తాజాగా ఇనయా తన బ్యూటిఫుల్ ఫోటోలని పోస్ట్ చేసి మరోసారి ట్రెండింగ్ లోకి వచ్చేసింది. మరి ఇన్ స్టాగ్రామ్ లో ఇనయా కొత్త ఫోటోలని మీరు చూసారా.. చూస్తే కామెంట్ చేయండి.



Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.