English | Telugu
కోర్టు నోటీసులు.. సౌందర్య టెన్షన్.. దీప ఆనందం!
Updated : Feb 11, 2021
'కార్తీక దీపం'లో ఇంత కాలంగా సాగుతున్నఎపిసోడ్‌లలో కంటనీరు పెట్టిన వంటలక్క తాజా పరిణామాల నేపథ్యంలో నవ్వుతూ చలాకీగా కనిపిస్తోంది. వంటలక్క నవ్వు వెనకున్న ధైర్యమేంటీ? మోనిత అసలు గుట్టు దీప చేతికి చిక్కిందా? అని సగటు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇదిలా వుంటే గురువారం ఎపిసోడ్‌లో డాక్టర్ బాబుకు దీప మరో ట్విస్ట్ ఇవ్వబోతోంది. కార్తిక్‌తో విడాకులకు అప్లై చేసిన దీప ఆ కేసుని హిమ కేసుతో లింక్ పెట్టేసి మోనిత అసలు రంగు బట్టబయలు చేసే మహత్తర ప్లాన్ కు శ్రీకారం చుట్టింది. ఇదే విషయం ఈ రోజు రివీల్ కాబోతోంది. సరోజ తెచ్చిన విడాకుల నోటీసులు అందుకున్న దీప అంతులేని సంతోషంతో "జీవితంలో విడాకులు అడక్కుండా చేయడానికి నాకు దొరికిన అవకాశం" అంటుంది.
కట్ చేస్తే కోర్టు నోటీసులు సౌందర్య చేతికి అందించి నవ్వుతూ నిలబడుతుంది దీప. విడాకుల నోటీసులు చూసి సౌందర్య టెన్షన్ పడుతుంటే దీప మాత్రం ఆనందంతో నవ్వుతుండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. "ఏంటీ? ఏం జరుగుతోంది?" అని కంగారుగా అడిగిన సౌందర్యకు దీప ధైర్యం చెబుతుంది. "కొండంత అండగా నిలబడే మీరే ఇలా బెదిరిపోతే ఎలా?" అంటుంది దీప. అయినా సౌందర్యలో భయం వీడదు. ఇంతకీ దీప ధైర్యం ఏంటీ? దాని వెనకున్న అసలు సీక్రెట్ ఏంటన్నది తెలియాలంటే 'కార్తీక దీపం' గురువారం ఎపిసోడ్ చూడాల్సిందే.