English | Telugu
బర్నింగ్ స్టార్ నెక్స్ట్ మూవీ లో కండక్టర్ ఝాన్సీ కి బంపర్ ఆఫర్!
Updated : Sep 16, 2022
కొంచెం టాలెంట్ ఉండి సోషల్ మీడియాలో పాపులర్ ఐతే చాలు ఆఫర్స్ వెతుక్కుంటూ ఇంటికే వస్తాయి. ఇటీవల అలా డాన్స్ లో ఫేమస్ ఇన మహిళ గాజువాక బస్ కండక్టర్ ఝాన్సీ. ఓవైపు కండక్టర్ జాబ్ చేస్తూ గుర్తింపు తెచుకుంటూనే మరోవైపు డాన్సర్ గా చేస్తోంది. తన కష్టానికి ఇన్నేళ్లకు మంచి ప్రతిఫలం దక్కింది.
గతంలోనే పలు ప్రముఖ డాన్స్ షోస్ లో కంటెస్టెంట్ గా పార్టిసిపేట్ చేసే ఝాన్సీ.. ఇటీవల శ్రీదేవి డ్రామా కంపెనీ షో ద్వారా వెలుగులోకి వచ్చింది. ఆ షోలో చేసిన ‘పల్సర్ బైక్’ డాన్స్ పెర్ఫార్మెన్స్ ఒక్కసారిగా ఝాన్సీని స్టార్ ని చేసేసింది. అప్పటినుండి ఎక్కడ చూసినా ఝాన్సీ పేరే వినిపిస్తోంది. ఐతే ఇటీవల ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక గుడ్ న్యూస్ ని ఆడియన్స్ తో షేర్ చేసుకుంది. బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు నెక్స్ట్ మూవీలో ఐటెం సాంగ్ చేసే ఆఫర్ ఇచ్చారని ఆ విషయాన్ని ఆయన ఫోన్ చేసి అడిగారని చెప్పింది.
సోషల్ మీడియాలో ఇప్పుడు ఈమెకు స్టార్ గుర్తింపు లభిస్తోంది. తాను పని చేసే చోట కూడా ఒక సెలబ్రిటీలా చూస్తున్నారని ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. అలాగే ఇంటర్ పూర్తయ్యాక లవ్ మ్యారేజ్ చేసుకున్న ఝాన్సీ చేసే ప్రతి పనిలో తన భర్త అండగా ఉంటాడని చెప్పింది. భర్తతో పాటు, గురువు రమేష్ మాస్టర్ సపోర్ట్ కూడా చాలా ఉందని చెప్పింది ఝాన్సీ.