English | Telugu
పుట్టినరోజు బహుమతిగా ఖరీదైన కారు, డైమండ్ నెక్లెస్ అందుకున్న అష్షు
Updated : Sep 16, 2022
అష్షు రెడ్డి సోషల్ మీడియా స్టార్. ఇప్పుడు అష్షు రెడ్డి ఒక కార్ ఓనరమ్మ అయ్యింది. అష్షు పుట్టినరోజు సందర్భంగా తన తండ్రి నుండి లగ్జరీ బెంజ్ కారుని బహుమతిగా పొందింది . ఈ విషయం తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. " ఈ సంవత్సరంలో నేను అందుకున్న సర్ప్రైజ్ గిఫ్ట్ ఇదే.." అంటూ టాగ్ లైన్ పెట్టింది అష్షు. కారుతో పాటు తన తండ్రితో దిగిన ఫోటోలను కూడా పోస్ట్ చేసింది . ప్రస్తుతం ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక తన పుట్టిన రోజు సందర్భంగా ఎవరినుంచో మంచి కాస్ట్లీ గిఫ్ట్ కూడా అందుకుంది అష్షు. ఒక జ్యువెలరీ షాప్ కి వెళ్లిన అష్షు అక్కడ ఉన్న డైమండ్ నెక్లెస్ లు చాలా వాటిని ట్రై చేసింది.
ఫైనల్ అన్ని మోడల్స్ లోకి ఒకటి సెలెక్ట్ చేసుకుంది. దాని ఖరీదు రూ. 7.5 లక్షల విలువైన డైమండ్ నెక్లెస్ ను సొంతం చేసుకుంది. ఇక తన బర్త్ డే ని చాలా గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకుంది. రామ్ గోపాల్ వర్మ కూడా ఈ బర్త్ డే పార్టీ కి వచ్చి ఫుల్ ఎంజాయ్ చేశారు. అలాగే తన ఫ్రెండ్స్ , బుల్లితెర నటులు బిగ్ బాస్ హౌస్ మిత్రులతో ఫుల్ జోష్ తో పుట్టిన రోజును సెలెబ్రేట్ చేసుకుంది అష్షు.