English | Telugu
అమర్ దీప్ ఫౌల్ గేమ్ బయటపెట్టిన సమీర్!
Updated : Nov 30, 2023
బిగ్ బాస్ సీజన్-7 మొత్తం ఫౌల్, అన్ ఫెయిర్ గేమ్ ఆడుతూ ప్రతీ వీకెండ్ నాగార్జునతో తిట్లు పడేవారిలో మన సీరియల్ బ్యాచ్ శోభాశెట్టి , అమర్ దీప్ , ప్రియాంక ముందువరుసలో ఉంటారు. అయితే వీరి గేమ్ గురించి బయట చూసే సెలబ్రిటీలు సైతం వీడియోలుగా చేసి చెప్తుంటారు. నిన్న జరిగిన టాస్క్ లో అమర్ దీప్ చేసిన ఫౌల్ గురించి బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ సమీర్ ఓ వీడియోని తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసాడు. ఇందులో సీరియల్ బ్యాచ్ చేసిన కన్నింగ్ గేమ్ స్ట్రాటజీని చెప్తూ.. న్యాయం కావలని బిగ్ బాస్ కి రిక్వెస్ట్ చేశాడు.
నేను ఈ టైంలో ఈ వీడియో ఎందుకు చేయాల్సి వచ్చిదంటే నేను షూటింగ్‌లో ఉన్నాను. నైట్ టైం బోర్ కొట్టి బిగ్ బాస్ లైవ్ చూస్తున్నాను. మీ అందరికీ తెలుసు. నేను బిగ్ బాస్ సీజన్-1 కంటెస్టెంట్ ని. నాకు అన్ని సీజన్లు చాలా ఇష్టం. అన్ని సీజన్లు ఫాలో అవుతాను. నేనేదో టైం పాస్ కాబట్టి బిగ్ బాస్ చూడను. నాకు చాలా ఇంట్రెస్ట్ కాబట్టి చూస్తున్నాను. నేను నవంబర్ 28 ఎపిసోడ్ లైవ్ చూస్తుంటే.. ఒక విషయం గమనించాను. ఆ విషయం మీ అందరితోనూ షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను.
ఇప్పుడు టికెట్ టు ఫినాలే టాస్క్ జరుగుతుంది. అందులో క్రికెట్ టాస్క్ ఇచ్చారు. స్టంప్స్ పెట్టి రింగ్స్ వేసే టాస్క్ పెట్టారు బిగ్ బాస్. ఈ టాస్క్‌లో సంఛాలక్ గా శోభా, ప్రియాంకలు ఉన్నారు. వాళ్లిద్దరు కలిసి అమర్ అనే కంటెస్టెంట్‌కి ఫేవర్‌గా చేస్తున్నారు. వాళ్లంతా ఫ్రెండ్స్ కాబట్టి. అయితే ఈరోజు నేను చూసిన లైవ్ ఎపిసోడ్‌లో అన్యాయం జరిగింది. దాన్ని క్లియర్ చేయాలనే వచ్చాను.
నేనెప్పుడూ ఇలాంటి వీడియోలు పెట్టలేదు. బిగ్ బాస్ అనే కాదు. ఇతర ఏ విషయాల గురించి నేను వీడియోలు పెట్టలేదు. కానీ ఇది అన్యాయం అనిపించిందని వీడియో చేస్తున్నాను. ఈ క్రికెట్ టాస్క్ సెకెండ్ రౌండ్‌లో.. బజర్ మోగిన తరువాత అమర్ దీప్ ఒక రింగ్ వేశాడు. అది ఫౌల్ గేమ్. నేను క్లియర్‌గా చూశాను. బజర్ మోగక ముందే రింగ్ వేయాలి. కానీ బజర్ మోగిన తర్వాత అమర్ రింగ్ వేశాడు. అది కూడా ఎవరు చూడట్లేదని రింగ్ వేసేశాడు. ఆ విషయాన్ని సంఛాలక్ గా ఉన్న శోభా, ప్రియాంకలు గమనించలేదు. బిగ్ బాస్ కూడా దాన్ని వదిలేయడం అనేది నాకు చాలా బాధగా అనిపించింది.
అందుకే నేను ఈ వీడియో చేయాల్సి వచ్చింది. ఈ వీడియో అందరికీ చేరాలి. ఎందుకు ఇంతలా చెప్తున్నానంటే.. అమర్ పాయింట్లు 108.. అర్జున్ 107 పాయింట్లు.. ఇద్దరికీ ఒకే ఒక్కపాయింట్ తేడా. ఆ ఒక్క పాయింట్‌తో అర్జున్ రెండో స్థానానికి పడిపోయాడు. ఫస్ట్ ప్లేస్ అమర్‌కి వచ్చింది. ఆ మిస్టేక్ ఎవరూ చూడకపోవడం వల్ల అర్జున్ 10 పాయింట్లు లాస్ అయ్యాడు. కాబట్టి ఇది కరెక్ట్ కాదు. ఈ వీడియో దయచేసి బిగ్ బాస్‌కి కూడా చేరుతుందని.. ఇలాంటి తప్పులు జరగకుండా చూస్తారని కోరుతున్నా. ఫేవరిజం చూపించకుండా బిగ్ బాస్ షో జెన్యూన్‌గా జరపాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానంటూ సమీర్ చెప్పుకొచ్చాడు. అయితే ఇప్పుడు ఈ వీడియో ఫుల్ వైరల్ గా మారింది.