English | Telugu
రోహిత్, రేవంత్ మధ్య రచ్చ.. హడలెత్తిపోయిన హౌస్ మేట్స్!
Updated : Nov 3, 2022
బిగ్ బాస్ లో గొడవలు కామన్ గా జరుగుతోంటాయి. అయితే ఈ గొడవలు పీక్స్ స్టేజ్ కి చేరాయి. కాగా మొన్నటి నుండి సాగుతోన్న మిషన్ ఇంపాజిబుల్ టాస్క్ లో మొట్టమొదటిసారిగా రోహిత్ సీరియస్ అయ్యాడు.
రోహిత్ మాములుగానే సింపుల్ గా, రిజర్వ్ గా ఉంటాడు. అలాంటి రోహిత్ ఫైర్ అయ్యాడు. బిగ్ బాస్ హౌస్ లో ఎవరితోనూ గొడవలు పెట్టుకోని ఏకైక కంటెస్టెంట్ రోహిత్. మొన్నటి దాకా కలిసి ఆడిన మెరీనా-రోహిత్. విడిపోయి ఆడుతున్నప్పటి నుండి రోహిత్ తన పర్ఫామెన్స్ తో మెరుగవుతూ వస్తోన్నాడు. నిన్న జరిగిన టాస్క్ లో రోహిత్, రేవంత్ మధ్య మాటల యుద్ధం మొదలైంది. కాగా రేవంత్ గట్టిగా అరుస్తూ మాట్లాడాడు. అది విని రోహిత్ హైపర్ అయ్యాడు. "నార్మల్ గా మాట్లాడు రేవంత్. నేను నార్మల్ గా మాట్లాడుతున్నా కదా, నువ్వు నార్మల్ గా మాట్లాడు" అని అన్నాడు. రేవంత్ " మీరు గేమ్ ఆడండి " అని అన్నాడు. దానికి సమాధానంగా "మొన్న ఫైమా ఎందుకు అలా చేసింది. మీ టీం సభ్యులు చేస్తే తప్పు లేదు కాని మా మీద ఎందుకు అరుస్తున్నావ్ రోహిత్" అని రోహిత్ అన్నాడు.
రోహిత్, రేవంత్ మధ్య సాగిన ఈ గొడవను చూసి హౌస్ మేట్స్ అందరు హడలెత్తిపోయారు. ఆ తర్వాత శ్రీహాన్, రేవంత్ ని కూల్ చేసి పక్కకి తీసుకెళ్ళగా, మెరీనా, రోహిత్ ని పక్కకి తీసుకెళ్ళి సర్దిచెప్పింది. అలా ఈ గొడవ ముగిసింది. వీరిద్దరి మధ్య జరిగిన ఈ గొడవ వల్ల మునుముందు ఎలా ఉంటారో చూడాలి మరి.