English | Telugu
గీతు పంతం.. రెండో రోజూ ఆదిత్య కన్నీటి పర్యంతం!
Updated : Nov 3, 2022
బిగ్ బాస్ లో మొదలైన 'మిషన్ ఇంపాజిబుల్' గేమ్ రోజు రోజుకి ట్విస్ట్ లతో అదరగొడుతోంది. మొన్నటి నుండి మాములుగా సాగిన ఈ టాస్క్ గీతు ప్లే చేసే మైండ్ గేమ్ తో హౌస్ మేట్స్ గందరగోళంలో పడిపోగా, ఇది ఒక్కొక్కరి మధ్య జరిగే గొడవలకు దారి తీస్తోంది.అయితే నిన్న జరిగిన టాస్క్ మొత్తం కూడా బ్లాక్ మెయిల్ గేమ్ లా మారిపోయింది.
ఆదిత్య, గీతుల మధ్య జరిగిన మాటల యుద్ధం ఆదిత్య కన్నీటితో పూర్తవుతుంది అని అందరు అనుకున్నారు. కానీ రెండవ రోజు కూడా ఆ గొడవ కొనసాగుతోంది. కీర్తిభట్, ఫైమాల దగ్గరకు ఆదిత్య వచ్చి తన బాధను చెప్పుకున్నాడు. "గీతు సిగరెట్లు దాచేసింది. అవి లేకపోతే నేనేం చచ్చిపోను కదా. సిగరెట్ల కోసం ఆదిత్య ఏడ్చాడని బయట అందరు అనుకుంటున్నారు. ఆఫ్ ట్రాల్ ఒక సిగరెట్ కోసం నేను అంత దిగజారుతునా..మా అమ్మ ఇది చూస్తే బాధపడుతుంది. తనకి నేను సిగరెట్లు తాగడం ఇష్టం లేదు. నా కూతురు చూస్తే ఎలా ఉంటుంది. ఒక సిగరెట్ కోసం నేను ఇంత దిగజారుతానా" అని చెప్పుకుంటు ఏడ్చేసాడు ఆదిత్య.
కాగా వీరి మధ్య జరుగుతున్న ఈ గొడవను క్లియర్ చేయాలని ఆదిరెడ్డి వెళ్ళి గీతుకి సర్ది చెప్పాడు. "సిగరెట్లు తాగడం అనేది అతని పర్సనల్ విషయం. తప్పు.. అలా బ్లాక్ మెయిల్ చేయకూడదు. ఓవర్ మిస్టేక్ అవుతోందిచూసుకో.తప్పుని సరిదిద్దుకో గీతు" అని ఆదిరెడ్డి చెప్పాడు. ఇవేవి పట్టించుకోకుండా గీతు తన పంతాన్ని వదులుకోలేదు. అయితే గీతు పంతానికి, ఆదిత్య గట్టిగా ఎదురు తిరుగుతాడో లేదో..చూడాలి మరి.