English | Telugu

కొరియన్ భాషలో మాట్లాడి హోస్ట్ ని భయపెట్టిన కమెడియన్ రోహిణి!

డాన్స్ ఇండియా డాన్స్ షో ప్రతీ వారం కొత్త కొత్త పెర్ఫార్మెన్సులతో అలరిస్తోంది. ఇక ఈ షోకి సంబందించిన లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇక ఈ షో కి శాకినీ డాకిని మూవీ హీరోయిన్స్ రెజీనా కాసాండ్రా, నివేద థామస్ వచ్చారు. ఇక హోస్ట్ అకుల్ బాలాజీ ఆ ఇద్దరితో కలిసి డాన్స్ చేసేసరికి కో - హోస్ట్ కమెడియన్ రోహిణి కౌంటర్ వేసేసింది. "ఇద్దరు హీరోయిన్లు దొరికారని పెద్ద హీరో ఇపోయావ్ కదా నువ్వు అంటుంది. హీరో దొరికినప్పుడు నేను వదల్లేదా నీకు అని రివర్స్ కౌంటర్ వేస్తాడు" అకుల్ బాలాజీ. "నేనంటే అందమైన ఆడపిల్లని తప్పదు" అని రోహిణి అనేసరికి సంగీత గట్టిగా నవ్వేస్తుంది.

వెంటనే రోహిణి స్టేజి మీదకు వచ్చి "సారంగియే" అని కొరియన్ లో చెప్పేసరికి అకుల్ బాలాజీకి ఏమీ అర్ధం ఆ పదానికి అర్థమేంటి అని అడిగేసరికి "ఐ లవ్ యు " అని నవ్వుతూ చెప్తుంది నివేద థామస్. "నాకు ఈ స్టేజి మీదకు ఇలా రావడం చాలా హ్యాపీగా ఉంది. కంటెస్టెంట్స్ మంచి ఎనెర్జీ తో డాన్స్ చేస్తున్నారు" అంది నివేదా. ఇక జడ్జెస్ , గెస్ట్స్ అంతా కలిసి కంటెస్టెంట్స్ తో డాన్స్ చేసి స్టేజిని కాసేపు వేరే లెవెల్ కి తీసుకెళ్లారు.

ఇక ఫైనల్ గా ఒక కంటెస్టెంట్ ని రీప్లేస్ చేయాల్సి వచ్చిందని హోస్ట్ చెప్పి కావ్య అనే మరో కంటెస్టెంట్ ని ఈ స్టేజి మీదకు తీసుకొచ్చారు. ఆమె పేరు కావ్య అని అనౌన్స్ చేసి ఇంతకు కావ్య ఎవరు , ఎక్కడి నుంచి వచ్చారు, ఏమిటి ఈమె టాలెంట్, ఇంత అద్భుతంగా డాన్స్ చేస్తోంది అనే విషయాలు తెలుసుకోవాలనుందా అనడంతో ప్రోమో కట్ చేశారు. ఇక ఈ కావ్య ఎవరో తెలియాలంటే , ఈ షోలో డాన్స్ పెర్ఫామెన్సులు ఎలా ఉన్నాయో తెలియాలంటే ఆదివారం వరకు ఆగాల్సిందే.

Jayam serial: వీరూ ప్లాన్ ని కనిపెట్టిన గంగ.. రుద్ర తెలుసుకుంటాడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -146 లో.... రుద్రకి ఎదురుగా గంగ వెళ్తుంది కానీ రుద్ర ఫోన్ మాట్లాడుతూ వెళ్ళిపోతాడు. కొంచెం దూరం వెళ్ళగానే రుద్రకి రింగ్ కనిపిస్తుంది. అది తీసుకొని చూస్తాడు. అప్పుడే ప్రమీల, ప్రీతీ వస్తారు. అన్నయ్య ఆ రింగ్ గంగ వదినది అని ప్రీతీ అంటుంది. ఈ రింగ్ ప్రపంచంలో ఆవిడకి ఒక్కదానికే ఉందా ఏంటని రుద్ర అంటాడు. ఆ తర్వాత అటుగా వెళ్తున్న గంగని రుద్ర పిలుస్తాడు. గంగ ముసుగులో ఉంటుంది. రుద్ర పిల్వగానే వస్తుంది. ఈ రింగ్ మీదేనా అని అడుగుతాడు. గంగ నాదేనని తీసుకుంటుంది..