English | Telugu

బిగ్ బాస్ లోకి అతిథులుగా అడుగుపెట్టిన సుధీర్ బాబు, కృతి శెట్టి!

బిగ్ బాస్ హౌస్ లోకి ప్రతీవారం అతిథులుగా సెలెబ్రిటీస్ రావడం కామన్. అయితే ఈ వారం 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' మూవీలో నటించిన సుధీర్ బాబు, కృతి శెట్టి వచ్చారు.

సుధీర్ బాబు, కృతి శెట్టి కంటెస్టెంట్స్ తో కాసేపు వారిద్దరు కలిసి నటించిన సినిమా గురించి తమ అనుభవాలను పంచుకున్నారు. తర్వాత "ఎవరు బాగా పర్ఫామెన్స్ చేస్తారో వారికి బెస్ట్ యాక్టర్, బెస్ట్ యాక్ట్రెస్ అవార్డులు ఇవ్వడం జరుగుతుంది" అని సుధీర్ బాబు, కంటెస్టెంట్స్ తో చెప్పాడు. శ్రీహాన్, ఫైమా 'పోకీరి' మూవీ పేరడీ చేసారు. గీతూ చిన్నపాపలా మిమిక్రీ చేసి ఆకట్టుకుంది. ఈ పేరడితో కాసేపు అందరూ బాగా నవ్వుకున్నారు. 'ఎవరైనా అమ్మాయికి ప్రపోజ్ చేయాలి. అయితే ఆ అమ్మాయి ఒకేసారి ద్విపాత్రాభినయం చేయాలి' అని సుధీర్ బాబు కంటెస్టెంట్స్ తో చెప్పాడు.ఈ టాస్క్ చేయడానికి శ్రీసత్య, రాజ్ ముందుకు వచ్చారు. శ్రీసత్య తన నటనతో మెప్పించింది. శ్రీహాన్ మధ్యలో సపోర్టింగ్ క్యారెక్టర్ గా వచ్చి బాగా నటించాడు. ఆ తర్వాత సుధీర్ బాబు, కృతి శెట్టి కలిసి బెస్ట్ యాక్టర్ గా శ్రీహాన్ ని, బెస్ట్ యాక్ట్రెస్ గా శ్రీసత్యని ప్రకటించారు. కాసేపటి తర్వాత సుధీర్ బాబు, కృతి శెట్టికి మెయిన్ గేట్ ద్వారా బయటికి వెళ్ళిపోమని బిగ్ బాస్ చెప్పాడు. అలా అతిథులతో పన్నెండో రోజూ కంటెస్టెంట్స్ కాసేపు సరదగా గడిపారు.

గీతూ, అభినయశ్రీ, మెరీనా-రోహిత్, షానీ, ఫైమా, ఆదిరెడ్డి, రాజ్, రేవంత్ ఈ వారం నామినేషన్లో ఉన్నారు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.