English | Telugu
ఎస్ఐ నాగికి బ్యూటీ టిప్ చెప్పిన రాకెట్ రాఘవ
Updated : Jul 22, 2022
జబర్దస్త్ స్కిట్ లో ఈ వారం కొంచెం చప్పగా అనిపించినా రాఘవ స్కిట్ మాత్రం కడుపుబ్బా నవ్వు తెప్పించింది. ఈ స్కిట్ లో రాఘవ కానిస్టేబుల్ గా నాగి ఎస్ఐ గా చేసారు ఈ స్కిట్ లో. ఇక ఈ స్కిట్ లో ఎస్ఐ నాగి కి కడుపునొప్పి వస్తోంది అనేసరికి రాఘవ ఒక సింపుల్ టిప్ చెప్తాడు. ఒక రాగి పాత్ర తీసుకుని వర్షం వచ్చేటప్పుడు ఆ రాగి పాత్రలో నీళ్లు నింపు నాలుగు రోజులు అట్టే పెట్టి ఐదో రోజు తీసి తల మీద పోసుకోవాలి అని చెప్తాడు. అలా చేస్తే కడుపు నొప్పి తగ్గిపోద్దా అని అడుగుతాడు నాగి. లేదు సర్ తల తడుస్తుంది అప్పుడు మీరు డాక్టర్ దగ్గరకి వెళ్తే కడుపు నొప్పి తగ్గిపోతుంది అంటూ ఫుల్ ఫన్ చేస్తాడు. ఎస్ఐ నాగి సీరియస్ ఐపోయి రాఘవ మీదకు వచ్చేసరికి సర్ మీ ముఖంలో అదృష్ట రేఖలు ఉన్నాయంటూ కాకా పట్టడం స్టార్ట్ చేస్తాడు.
చాలా క్రీములు వాడాను కానీ ముఖం మీద మచ్చలు మాత్రం పోవడం లేదు అంటాడు నాగి. దానికి కూడా న దగ్గర సూపర్ టిప్ ఉందని చెప్తాడు రాఘవ. చిన్న స్టీల్ గిన్నెలో కొంచెం గడ్డ పెరుగు వేసి అందులో చిటికెడు పసుపు వేసి ఆ తర్వాత లేత వేప కొమ్మ ఒక అలా విరిచి దాంతో మొత్తాన్ని అలా తిప్పాలి ఆ తర్వాత రాత్రి 9 గంటల వరకు దాన్ని ఫ్రిజ్ లో పెట్టి ఆ తర్వాత దాన్ని తీసి బయట పడేసి టైంకి వచ్చి పడుకుంటే ఈ చారలు తగ్గుతాయి అంటూ మస్త్ కామెడీ చేస్తాడు రాఘవ.