English | Telugu
క్యాష్ : ‘సుమ’ రాజ్యంలో..శిక్షలు ఏంటవి.. ఎలా ఉంటాయ్?
Updated : Jul 22, 2022
పాపులర్ యాంకర్ సుమ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారం అవుతున్న ప్రోగ్రాం `క్యాష్`. ఈ వారం ప్రసాం కాబోయే ఎపిసోడ్ లో `హలో వరల్డ్` వెబ్ సిరీస్ టీమ్ పాల్గొని రచ్చ రచ్చ చేశారు. మహారాణిగా సుమ వేసిన శిక్షలు నవ్వులు పూయిస్తున్నాయి. నిహారిక కొణిదెల ఈ సీరీస్ ని నిర్మించింది. ఇందులోని ప్రధాన పాత్రల్లో నిఖిల్, నిత్యాశెట్టి, `మై విలేజ్ షో` అనిల్ పాల్గొన్నారు. సుమతో వీరు కలిసి చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఈ నెల 23న ప్రసారం కానున్న ఈ తాజా ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోని విడుదల చేశారు.
ఇది నెట్టింట సందడి చేస్తోంది. నిహారిక ఎంట్రీ ఇవ్వడంతో `నిహారిక నిహారిక.. అంటూ సాంగ్ వేశారు.. ఇంతలో నా కోసం కూడా ఓ సాంగ్ వుందని సుమ అనడంతో `సుమం ప్రతి సుమం సుమం..` అంటూ ఓ పాటేశారు. వెంటనే నిఖిల్ `ముసలోళ్లకి వేసే సాంగ్ లన్నీ వేస్తారీవిడకి` అని పంచ్ వేశాడు.. నిత్యాశెట్టి రాగానే తనపై కూడా అనిల్ పంచ్ వేయడంతో అంతా నవ్వేశారు. ఇక నిహారికని డాక్టర్ గా కూర్చోబెట్టి అనిల్ ని పేషెంట్ ని చేసింది సుమ. ఏంటీ నీ ప్రాబ్లమ్ అని అడిగితే వెంటనే నిఖిల్ `నోటి దూల`అనేశాడు.
ఇవన్నీ పక్కన పెట్టిన నిహారిక `ఏంటమ్మా నీ ప్రాబ్లమ్` అని మళ్లీ అడిగింది.. వెంటనే అనిల్ గ్యాప్ ప్రాబ్లమ్ అన్నాడు. అయితే ఆలస్యం ఎందుకు కొత్త సిలిండర్ మార్చేయ్ అనడంతో అక్కడున్న వాళ్లంతా గొళ్లున నవ్వేశారు. ఆ తరువాత ఆంటీ నిఖిల్ కి ఎవరో ఇష్టమంట అని నిహారిక అనడం.. ఊరుకో అమ్మ చిన్నపిల్లాడు వాడికి అప్పుడే పెళ్లేంటి? అని సుమ సమాధానం చెప్పడం..`అమ్మానేను ఏమీ ఎరగని పసికందునమ్మా` అని నిఖిల్ అనడం.. వెంటనే `నువ్వు పసికందుకు కాదురా కసి కందువు` అని నిహారిక పంచ్ వేయడం నవ్వులు పూయిస్తోంది. ఇంతకీ సుమ రాజ్యంలో వున్న శిక్షలేంటీ? ఎలా వుంటాయ్? అన్నది తెలియాలంటే 23 రాత్రి 9:30 గంటలకు ప్రసారం కానున్న తాజా ఎపిసోడ్ చూడాల్సిందే.