English | Telugu

శ్రీ‌లేఖ పాట విని బాలుగారు అంత‌మాట‌న్నారా?

డైలాగ్ కింగ్ సాయి కుమార్ హోస్ట్ గా వ్య‌వ‌హ‌రిస్తున్న షో `వావ్‌`. ప్ర‌స్తుతం సీజ‌న్ 3 ప్ర‌సారం అవుతోంది. `మాంచి కిక్ ఇచ్చే గేమ్ షో` అనే క్యాప్ష‌న్ తో ఈ షోని ర‌న్ చేస్తున్నారు. ప్ర‌తీ మంగ‌ళ‌వారం ఈటీవీలో ప్ర‌సారం అవుతూ విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. తాజా ఎపిసోడ్ కోసం ఈ షోలో ఎమ్.ఎమ్. శ్రీ‌లేఖ‌, సాందీప్‌, అదితి భావ‌రాజు, కారుణ్య పాల్గొని సంద‌డి చేశారు. ఈ నెల 26న మంగ‌ళ‌వారం ప్ర‌సారం కానున్న తాజా ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోని విడుద‌ల చేశారు.

ప్ర‌స్తుతం నెట్టింట ఈ ప్రోమో సంద‌డి చేస్తోంది. ఎమ్.ఎమ్. శ్రీ‌లేఖ సంగీత ద‌ర్శ‌కురాలు కావ‌డానికి స్ఫూర్తి ఎవ‌రో, ఏ కార‌ణం వ‌ల్ల తాను మ్యూజిక్ డైరెక్ట‌ర్ అయ్యిందో వెల్ల‌డించింది. అంతే కాకుండా బాలు గారు త‌న పాట విని ఏమ‌న్నారో కూడా వివ‌రించింది. ముందు కామెంట్ చేసిన ఆయ‌నే ఆ త‌రువాత కాకి కోక‌ల అయ్యింద‌ని కాంప్లిమెంట్ ఇచ్చార‌ట‌. అన్న‌య్య కీర‌వాణి కార‌ణంగానే తాను మ్యూజిక్ డైరెక్ట‌ర్ అయ్యాన‌ని, అయితే అందుకు అన్న‌య్య కారే కార‌ణ‌మ‌ని చెప్పింది. త‌న‌కూ కారు వుండాల‌నే ప‌ట్టుద‌లే త‌న‌ని మ్యూజిక్ డైరెక్ట‌ర్ని చేసింద‌ని చెప్పుకొచ్చింది.

ఇక ఒక పాట పాడ‌టానికి వెళ్లి నాలుగు పాట‌లు పాడాన‌ని, లెక్క‌లేన‌న్ని పాట‌లు పాడాల‌న్న‌దే త‌న క‌ల అని కారుణ్య తెలిపాడు. యుఎస్ లో పుట్టి పెరిగిన అదితి భావ‌రాజు గాయ‌నిగా త‌న సంగీత ప్ర‌యాణం ఎలా మొద‌లైందో చెప్పుకొచ్చింది. మ‌రిన్ని ఆస‌క్తిక‌ర విష‌యాలు తెలియాలంటే వ‌చ్చే మంగ‌ళ‌వారం రాత్రి 9:30 గంట‌ల‌కు ప్ర‌సారం కానున్న `వావ్ 3` మాంచి కిక్ ఇచ్చే గేమ్ షో చూడాల్సిందే.

Karthika Deepam2: వైరాతో జ్యోత్స్న డీలింగ్.. కార్తీక్ కి డౌట్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -544 లో.....శౌర్యకి దీప భోజనం తినిపిస్తుంది. అది చూసి కొడుకు కోడలితో చెల్లి మాట్లాడుతలేనట్లు ఉందని అనసూయ అంటుంది. వాళ్లే దాక్కొని తిరుగుతున్నారని కాంచన అంటుంది. శౌర్య వెంట భోజనం తినమని దీప పరుగెడుతుంది. శౌర్య అలా అమ్మని పరిగెత్తించవచ్చా.. ఇప్పుడు అమ్మ కడుపులో బేబీ ఉంది కదా తనకి ఆయాసం వస్తుంది ఇకనుండి నువ్వే భోజనం చెయ్యాలని కాంచన అనగానే.. నువ్వు మంచి నానమ్మవి కాదు నిన్ను తాతయ్య దగ్గరికి పంపించాలి.. మా అమ్మ నాకు తినిపించకుండా చేస్తున్నావని శౌర్య అంటుంది.

Illu illalu pillalu: ఇంగ్లీష్ టీచర్ గా శ్రీవల్లి.. ప్రేమ, నర్మద ప్లాన్ సూపర్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu ). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -345 లో... భాగ్యం, ఆనందరావు ఇద్దరు రామరాజు ఇంటికి శ్రీవల్లి డూప్లికేట్ సర్టిఫికేట్లు తీసుకొని వస్తారు. అవి ప్రేమ చూసి డూప్లికేట్ సర్టిఫికేట్లు అని చెప్పదు. ఇంకేంటి మావయ్య మీరు మీకు తెలిసిన కాలేజీ ప్రిన్సిపల్ కి ఫోన్ చెయ్యండి.. అక్క  ఇంగ్లీష్ టీచర్ గా జాయిన్ చెయ్యండి అని ప్రేమ అంటుంది. రామరాజు ఫోన్ చేస్తుంటే కావాలనే శ్రీవల్లి తుమ్ముతుంది. ఇప్పుడే వద్దు మావయ్య అంటుంది. అయినా రామరాజు వినకుండా ఫోన్ చేసి ప్రిన్సిపల్ తో మాట్లాడతాడు.