English | Telugu

Guppedantha Manasu : అతని చెంపచెల్లుమనిపించింది.. అసలు రిషి ఏమైనట్టు?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -994 లో.... అనుపమ, ముకుల్ లు ఇద్దరు మాట్లాడుకుంటారు. అసలు రిషికి అలా జరగడం ఏంటని ఆలోచిస్తారు. నిజంగానే రిషి చనిపోయాడా అని ముకుల్ ని అనుపమ అడుగుతుంది. అవునని ముకుల్ అనగానే.. ఈ పని కూడా శైలేంద్ర చేసి ఉంటాడు. ఎవరిలా చేసింది.. తెలిసిందా అని అనుపమ అడుగుతుంది. భద్ర చేసి ఉంటాడు.. ఎందుకంటే వసుధార ఆ భద్రని పట్టించినప్పుడు వార్నింగ్ ఇచ్చాడు. మళ్ళీ తప్పించుకుని వసుధారపై కోపంతో ఇలా చేసాడేమోనని ముకుల్ అంటాడు.

ఆ తర్వాత వసుధారని ఆ పరిస్థితిలో చూడలేకపోతున్నానని అనుపమ అంటుంది. ఇప్పుడు మీరు వసుధార దగ్గర ఉండాలని అనపమతో ముకుల్ చెప్తాడు. ఆ తర్వాత శైలేంద్ర, దేవయాని ఇద్దరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. ఇక ఎండీ చైర్ నాదే.. ఆపేవారే లేరంటూ శైలేంద్ర సంబరపడుతుంటాడు.. ఆ జగతి ఎన్నెన్ని మాటలు అంది. ఎప్పుడు నీ కొడుకు ఎండీ కాలేడు.. ఆ అర్హత కేవలం నా కొడుకుకి మాత్రమే ఉందని చివరికి దానికోసం చచ్చిపోయింది. ఆ తర్వాత ప్రతీసారి ఆ వసుధర అడ్డుపడేదని దేవయాని అంటుంది. ఇక ఎవరు నన్ను ఆపేవారే లేరని శైలేంద్ర అంటాడు. మన ఇన్వాల్వ్ మెంట్ లేకుండా చాలా జరుగుతున్నాయని శైలేంద్ర అంటాడు. కానీ మీ డాడ్.. రిషి అలా చనిపోయాడని మంచాన పడ్డాడని దేవయాని అంటుంది. అది కూడా ఇప్పుడు మన మంచికే. డాడ్ కాలేజీకీ వస్తే అదేంటీ ఇదేంటని అడుగుతాడు. నేను ఎండీ అయ్యేవరకు డాడ్ కాలేజీకీ రాకపోవడమే బెస్ట్ అని శైలెంద్ర అంటాడు.

ఆ తర్వాత వసుధార కాలేజీకి వస్తుంటే స్టూడెంట్స్ ఫాకల్టీ సర్ చనిపోయారు కదా మేడమ్ అంటు అడుగుతారు. శైలేంద్ర కూడా ఉంటాడు. ఎవరు మీకు చెప్పింది.. రిషి సర్ బాగున్నారంటు వసుధార వాళ్లకి సమాధానం చెప్తుంది. వసుధార అలా మాట్లాడుతుంటే.. మేడమ్ ఎందుకు ఇలా బెహేవ్ చేస్తున్నారని అనుకుంటారు. ఆ తర్వాత వసుధార క్యాబిన్ లోకి వెళ్లి పేపర్స్ అన్ని పడేస్తుంటుంది. మళ్ళీ శైలేంద్ర వచ్చి ఇకనైనా నాకు ఎండీ సీట్ ఇచ్చి వెళ్ళిపోమని అంటాడు. వసుధారకి కోపం వచ్చేలా మాట్లాడేసరికి శైలేంద్ర చెంప చెల్లుమనిపించి.. ఎండీ సీట్ ని టచ్ కూడా చెయ్యనివ్వనంటు వార్నింగ్ ఇస్తుంది. అవమానంగా ఫీల్ అయి శైలేంద్ర వెళ్ళిపోతాడు. మరొక వైపు రిషి లేడని బాధపడుతు మళ్ళీ మహేంద్ర డ్రింక్ చేయబోతుంటే.. అనుపమ వచ్చి ఆపుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : గంగ, రుద్ర పూజలో కూర్చుంటారా.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -164 లో..... రుద్ర ఏ విధంగా గంగకి హెల్ప్ చేసాడో అందరికి చెప్తాడు. పాపం పెద్దమ్మ హర్ట్ అయినట్లు ఉందని వంశీ అనగానే అయితే అవనివ్వులే గంగ సేఫ్ అయిందని పెద్దసారు అంటాడు. మరొకవైపు పారు ఫ్రెండ్స్ ని అకాడమీ మేడమ్ సస్పెండ్ చేస్తుంది. దాంతో నువ్వు సస్పెండ్ ఆపకపోతే నువ్వే ఇదంతా చేసావని మేడమ్ కి చెప్తానని పారు ఫ్రెండ్ పారుతో అంటుంది. దాంతో మేడమ్ ని సస్పెండ్ క్యాన్సిల్ చెయ్యమని రిక్వెస్ట్ చేస్తుంది పారు. తప్పు ఒప్పుకుంటున్నారు కదా ఈ ఒక్కసారి క్షమించండి అని మేడమ్ తో గంగ అనగానే తను సరే అని సస్పెన్షన్ క్యాన్సిల్ చేస్తుంది.

ఆ మీమ్ నన్ను చాలా డిస్టర్బ్ చేసింది...సావండి అంటున్న నైనికా అనసుర

నైనికా అనసురు బుల్లితెర మీద అందరికీ పరిచయమే. బిగ్ బాస్ సీజన్ 8 ద్వారా బాగా ఫేమస్ అయ్యింది. అలాగే ఢీ డాన్స్ షోలో డాన్స్ ద్వారా బాగా పాపులర్ అయ్యింది. ఇక ఇప్పుడు బిబి జోడి సీజన్ 2 లో అమరదీప్ కి జోడిగా చేస్తోంది. అలాంటి నైనికా రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఘాటుగా ఒక పోస్ట్ పెట్టింది. "ఎలాంటి పని లేకుండా జస్ట్ కూర్చుని అమ్మాయిల చిత్రాలను ఘోరంగా ఎడిట్ చేస్తూ వాళ్ళను హరాస్ చేసే ఒక స్టుపిడ్ మీమ్ పేజీలో పోస్ట్ చేసిన నా చిత్రాలు నన్ను చాలా డిస్టర్బ్ చేశాయి. మీకు పని లేదు బ్రో, మాకు మిమ్మల్ని పట్టించుకునేంత టైం లేదు. నువ్వు మా మీద పోస్ట్లు పెడుతున్నావ్ అంటే నువ్వు నీలోనే తోపు ఐనట్టే..మీ పేరెంట్స్ నిన్ను బాగా పెంచారు. మీలాంటి వాళ్ళే రేపు రేపిస్టుల్లా తయారవుతారు.