English | Telugu

‘ఫెవిస్టిక్ లా ఇనాయ ఆర్జే సూర్య వెంటపడుతూనే ఉంది’..బుజ్జిమా కామెంట్స్ వైరల్

బిగ్ బాస్ హౌస్ లో ఆర్జే సూర్య ఆట తీరు గురించి అందరికీ తెలుసు. ఐతే ఇప్పుడు సూర్య గర్ల్ ఫ్రెండ్ ఐన బుజ్జిమా సూర్య మీద కొన్ని వ్యాఖ్యలు చేసింది. ఒక ఛానల్ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ " ముందు సూర్యకి ఈ బిగ్ బాస్ ఆఫర్ అనేది ఓటిటి ప్లాట్ ఫామ్ మీద వచ్చింది ఐతే ఇక్కడ అనుకున్నంత పేరు రాదు బిగ్ స్క్రీన్ మీద ఐతే ట్రై చేద్దాం అనుకునే టైంలో ఆ ఆఫర్ వచ్చింది అండ్ ఫైనల్లీ హౌస్ లో ఇప్పుడు బాగా ఆడుతున్నాడు. ఐతే సూర్య, ఆరోహి మధ్య ఉన్నది ఫ్రెండ్ షిప్ మాత్రమే..కాకపొతే అది కొంచెం ఎక్స్ట్రీమ్ కి వెళ్లేసరికి ఆడియన్స్ కి నచ్చలేదు. టాప్ 5 ఉంటాడో , ఉండదో తెలీదు కానీ ఉంటే విన్ ఐనట్టే లెక్క కాబట్టి టాప్ 5 లో ఉండాలని కోరుకుంటున్నాను.

ఇంకా చెప్పాలి అంటే సూర్య ప్రత్యేకించి ఎవరినీ ఇష్టపడింది లేదు ఐతే ఆరోహి వెళ్ళిపోయాక సూర్య పైన క్రష్ ఉంది అని ఇనాయ చెప్పింది. సూర్య ఎక్కడికి వెళ్తే తానూ అక్కడికే వెళ్ళేది. దీనికి సంబంధించి కామెంట్స్ లో కూడా చదివితే ఇనాయ ఎందుకు గేమ్ ఆడకుండా సూర్య వెనక వెళ్తున్నావ్ అని నెటిజన్స్ కూడా అడుగుతున్నారు..ఇనాయ ఫెవిస్టిక్ లాగే సూర్య వెనకే వెళ్తుంది. నాకు తెలిసి ఇది సూర్య తప్పు కూడా కానీ..ఏమో సూర్యకి కూడా ఇంటరెస్ట్ ఉందేమో నాకైతే తెలీదు" అంటూ బుజ్జిమా కొన్ని షాకింగ్ కామెంట్స్ చేసింది.