English | Telugu
Jayam serial : హాస్పిటల్ నుండి వీరు తమ్ముడు సూర్య మాయం..
Updated : Oct 15, 2025
జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -84 లో......గంగ లోపలికి వెళ్ళగానే వీరుని చూసి షాక్ అవుతుంది. అసలు రుద్ర సర్ శత్రువులతో వీరు సర్ ఎందుకు ఉన్నాడని ఆలోచిస్తుంది. మరొకవైపు పారు, ఇంకా వాళ్ళ అన్నయ్య మేనేజర్ ని కలిసి హాస్పిటల్ లో పని చేసే నర్సులందరిని లైన్ లో నిల్చొపెట్టమని అడుగుతారు. దానికి అతను సరే అంటాడు. మరొకవైపు పేషెంట్స్ అందరిని రుద్ర చూస్తూ వస్తున్నాడు.. రుద్రని వీరు చూసి తన మనుషులకి ఫోన్ చేసి రుద్ర వస్తున్నాడు. తమ్ముడున్న గది వైపు వస్తున్నాడు.. ఏదైనా చెయ్యండి అని అంటాడు.
వీరు తమ్ముడు ఉన్న రూమ్ దగ్గరికి రుద్ర రాగానే కోమాలో ఉన్న పేషెంట్ ని పక్కన ఉంచి గంగని డాక్టర్ ని బెదిరిస్తారు. దాంతో గంగ ఇక్కడ పేషెంట్ ఎవరు లేరని రుద్ర తో చెప్పగానే రుద్ర వెళ్ళిపోతాడు. రుద్ర సర్ రాగానే ఈ పేషెంట్ ని దాచేశారంటే రుద్ర సర్ వెతుకుతుంది ఇతనేనా.. వెంటనే ఈ విషయం రుద్ర సర్ కి చెప్పాలని గంగ అనుకుంటుంది. ఆ తర్వాత పారు అందరి నర్స్ లలో తనతో ఎవరు గొడవ పెట్టుకుందో చెక్ చేస్తుంది. మరొకవైపు రుద్రకి డౌట్ వచ్చి రిటర్న్ సూర్య ఉన్న రూమ్ కి వెళ్తుంటే.. వీరు టెన్షన్ పడతాడు. గంగ మాస్క్ పారు తియ్యబోతుంటే అప్పుడే వీరు ఫైర్ అలారం కొడతాడు. దాంతో ఎక్కడివాళ్ళు అక్కడ పారిపోతారు. పారు, రుద్ర డాష్ ఇచ్చుకుంటారు. ఓవర్ లుక్ లో వెళ్ళిపోతారు. గంగ కిందపడిపోతే రుద్ర ఎత్తుకొని బయటకు తీసుకొని వెళ్తాడు
మరోవైపు వీరు తన తమ్ముడిని హాస్పిటల్ నుండి చేంజ్ చెయ్యాలనుకుంటాడు కానీ వీరు వాళ్ళు వెళ్లేసరికి అక్కడ తన తమ్ముడు సూర్య ఉండడు. అంతకు ముందు వీరు మాట్లాడింది విని భయంతో సూర్య పారిపోతాడు. ఇప్పుడు సూర్య ఆ రుద్రకి పాజిటివ్ అయితే మీకు ప్రాబ్లమ్ అని వీరు మనుషులు అంటారు. మరొక వైపు ఇంట్లో అందరు గంగని మిస్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.