English | Telugu

వసుని మర్చిపోని రుషి

వసుధార రిషి ఫోన్ కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. మరో పక్క ఋషి తన మీద జాలి చూపించవద్దు అంటూ జగతికి దణ్ణం పెట్టి మరీ చెప్తాడు. ద్వేషం చూపించినా పర్లేదు కానీ జాలి చూపిస్తే మాత్రం తట్టుకోలేను అంటాడు. ప్రేమ విత్తనం లాంటిది అంటూ జగతి నచ్చచెప్పడానికి ట్రై చేస్తుంది. మేడం ఈ టాపిక్ ఇంతటితో వదిలేయండని చెప్తాడు ఋషి.

ఋషి వసూ గురుంచి ఆలోచిస్తూ ఉంటాడు. అంతలో అనుకోకుండా తనకి ఫోన్ కాల్ వెళ్ళిపోతుంది. తన ప్రమేయం లేకుండా ఫోన్ కాల్ వెళ్లిపోయిందేమిటి అనుకుని వెంటనే కాల్ కట్ చేసేస్తాడు. ఋషి సర్ మిస్స్డ్ కాల్ ఇస్తే నేను ఫోన్ చేస్తే తప్పేంటి అనుకుని వసూ కాల్ బ్యాక్ చేస్తుంది. కానీ ఆన్సర్ చేయదు ఋషి. తర్వాత కాలేజీకి బయల్దేరుతుంది..

ఆటోలో కాలేజీకి వెళ్తుంది వసుధార. ఇంతలో చున్నీ ఆటో బయటకి ఎగురుతూ ఉంటుంది. ఇలా చున్నీ బయటకివస్తే ప్రమాదం కదా అని ఆటో పక్కకి వచ్చి చున్నీ సరిచేసుకోమని ఆటో డ్రైవర్ కి చెప్తాడు. వసుధార వెంటనే చున్నీ లోపలి తీసుకుంటుంది. సర్ , సర్ అని పిలుస్తున్నా తన దారిన తాను వెళ్ళిపోతాడు. ఇంతలో కాలేజీలో పుష్పను నోట్స్ కావాలని అడుగుతాడు ఋషి. వసుధారను అడిగే పరిస్థితి తీసుకురమ్మకు అని పుష్పకు గట్టిగా చెప్తాడు. ఇక సాక్షి అదే టైంలో కాలేజీకి వచ్చి వసుధారను కార్నర్ చేస్తుంది. నువ్వింకా రిషి మనసులోనే ఉన్నావని సీరియస్ గా అంటుంది. అది నీ తప్పు అంటూ కౌంటర్ ఇస్తుంది వసూ. మిగతా ఎపిసోడ్ హైలెట్స్ కోసం ఈరోజు సాయంత్రం ప్రసారమయ్యే గుప్పెడంత మనసు సీరియల్ లో చూడొచ్చు.

Podharillu:పొదరిల్లు సీరియల్ లో సూపర్ ట్విస్ట్.. మహాలక్ష్మికి పెళ్ళి ఫిక్స్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -02 లో.....మహాలక్ష్మి ప్రాజెక్ట్ డిజైన్ రెడీ చేసి హాల్లోకి వస్తుంది. వాళ్ళ నాన్న ప్రతాప్ ఇంకా అన్నయ్య మహాలక్ష్మికి డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తారు. ఒకసారి చూడు మహా అని వాళ్ళ అన్నయ్య అంటాడు. నాకేం ఇప్పుడు పెళ్లి వద్దు అవసరం అయితే వదిన నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోండి అని మహా అంటుంది. ఇప్పుడు డిజైన్స్ చూపించడానికి వెళ్తున్నానని తెలిస్తే డాడీ వద్దని అంటాడనుకొని డాడీ కాలేజీలో సర్టిఫికెట్ ఉన్నాయి తెచ్చుకుంటానని చెప్తుంది.