English | Telugu
అంకితతో మాట్లాడని తులసి
Updated : Jun 3, 2022
అంకిత బర్త్ డే పార్టీ నుంచి తులసి వాళ్ళ ఫామిలీ రిటర్న్ వచ్చేస్తుంది. ఇంటికి రాగానే తులసి వాళ్ళ అత్తయ్య అంకితను ఇంటికి రావద్దని ఎందుకు అన్నావంటూ నిలదీస్తుంది. సమాధానం చెప్పదు తులసి. వెంటనే తులసి మావయ్యగారు అందుకుని ఏ కారణం లేకుండా తులసి అలా మాట్లాడదు. కాబట్టి తులసిని తప్పు పట్టకు అంటూ చెప్తాడు.
చివరకి అసలు విషయం చెప్తుంది తులసి. అభి అన్న మాటల గురుంచి అత్తగారికి చెప్పేస్తుంది. అందరూ చాలా బాధపడతారు. ఐనా అభి వాళ్ళ నాన్న పోలిక. తల్లితో ఏం మాట్లాడాలో, ఇలా మాట్లాడాలో అస్సలు తెలీదు అంటూ తలలు పట్టుకుంటారంతా. ఇంతలో అంకిత తులసికి ఫోన్ చేస్తుంది. కానీ తులసి ఫోన్ లిఫ్ట్ చేయదు. చివరికి లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేస్తుంది.
తనను తన అత్తగారింటికి రావద్దని చెప్పడం కరెక్ట్ కాదని ఏడుస్తూ చెప్తుంది. ఫోన్ లిఫ్ట్ చేయకపోతే మాత్రం ఎన్ని సార్లైనా చేస్తూనే ఉంటానని గట్టిగా చెప్తుంది. ఐనా ఆ ఇల్లు నాది అందులో ఉండేవాళ్ళు నా వాళ్ళు.. వాళ్ళే నా సొంత వాళ్ళు అంటూ బాధపడుతుంది అంకిత. తులసి హృదయం బరువెక్కిపోతుంది ఆ మాటలకు. మరో వైపు లాస్య తులసిని ఆపి మరీ నిలదీస్తుంది. అంకితను ఇంటికి రానివ్వనని అలా ఇలా చెప్పావ్ అంటూ.. తులసి కూడా అందుకు తగ్గట్టుగానే కౌంటర్ ఇస్తుంది. ఇంతకు చివరికి ఏం అయ్యిందో తెలియాలంటే సాయంత్రం ప్రసారమయ్యే ఇంటింటి గృహాలక్ష్మిలో చూడాల్సిందే.