English | Telugu
యష్ ప్రయత్నం మిస్ ఫైర్..వేదకు లిప్ లాక్ !
Updated : Jun 4, 2022
బుల్లితెరపై ప్రసారం అవుతున్న సీరియల్ `ఎన్నెన్నో జన్మల బంధం`. గత కొన్ని వారాలుగా మహిళా ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటూ విజయవంతంగా దూసుకుపోతోంది. హిందీలో సూపర్ హిట్ అయిన సీరియల్ `యే హై మొహబ్బతే` ఆధారంగా ఈ సీరియల్ ని తెలుగులో రీమేక్ చేశారు. నిరంజన్, డెబ్జాని మోడక్ ప్రధాన జంటగా నటించారు. మిన్ను నైనిక, బెంగళూరు పద్మ, జీడిగుంట శ్రీధర్, ప్రణయ్ హనుమండ్ల, ఆనంద్, సుమిత్ర, వరదరాజులు ఇతర పాత్రలలో నటించారు.
కోట్ల ప్రాపర్టీని అగర్వాల్ కంపనీ వేలానికి పెడుతుంది. ఈ వేలం పాటలో చాలా మంది పాల్గొంటారు. అయితే యష్ బద్ద శత్రువు అభిమన్యు కూడా పోటీకి దిగుతాడు. దీంతో ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకున్న యష్ ఈ వేలం పాటలో వెనక్కి తగ్గేదిలేదంటూ తన గొంతు బాగాలేకపోవడంతో తన తరుపున వేలం పాట పాడటానికి వేదని తీసుకెళతాడు. అయిష్టంగానే వెళ్లిన వేద.. యష్ చెప్పిన ప్రతీ పాట పాడుతూ వుంటుంది. అయితే చివరికి ప్రాపర్టీ వేలం పాట రూ. 62 కోట్ల వరకు వెళ్లడంతో ఇంత పెట్టి పాడటం కరెక్ట్ కాదని గ్రహించిన వేద.. యష్ చెప్పినా వినకుండా పాట ఆపేస్తుంది.
దీంతో అభిమన్యుకు 62 కోట్ల ప్రాపర్టీ సొంతమవుతుంది. తనని అభిమన్యు చేతిలో ఓడించావని ఆగ్రహించిన యష్ ఇంటికి వచ్చాక ఫ్యామిలీ మెంబర్స్ ముందు వేదపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తాడు.. కాఫీ కప్పుని విసిరేస్తాడు. విషయం తెలిసిన వేద తల్లిదండ్రులు, యష్ తల్లిదండ్రులు అంతా వేదని నిలదీస్తారు. యష్ చెప్పింది చేయాల్సిందని వేదపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తారు. దీంతో కలత చెందిన వేద బెడ్రూమ్ లోకి వెళ్లిపోతుంది. ఇదిలా వుంటే అప్పుడే వసంత్ కి ఓ బ్రేకింగ్ న్యూస్ తెలుస్తుంది. వెంటనే టీవీ ఆన్ చేస్తాడు.. టీవీలో అభిమన్యు ఫోజు కొడుతూ కోట్ల ఆస్తిని సొంతం చేసుకున్నానని విర్రవీగుతుంటాడు. ఇదే సమయంలో అక్కడికి వచ్చిన ఓ ఎస్ ఐ మీరు మోసపోయారని, మీరు వేలం పాటలో సొంతం చేసుకుందిలిటిగేషన్ లో వున్న ప్రాపర్టీ అని, దానిపై కోర్టులో కేసు నడుస్తోందని చెబుతాడు. దీంతో అభిమన్యు షాక్ కు గురవుతాడు.
ఇదంతా టీవీలో చూస్తున్న యష్ ఫ్యామిలీ, యష్ ఒక్కసారిగా షాక్ అవుతారు. వేద లేకుంటే కోట్లల్లో నష్టపోయేవాళ్లమని, అనవసరంగా తనని బాధపెట్టావని యష్ ని అతని తల్లి, తండ్రి మందలిస్తారు. ఇప్పటికైనా వేద గురించి తెలుసుకోమని, వెంటనే తనకు సారీ చెప్పాల్సిందేనని యష్ తల్లి మాలిని అంటుంది. కట్ చేస్తే.. అంతంగా ముస్తాబై తనని తానే పొగుడుకుంటూ వుంటుంది వేద. అదే సమయంలో బెడ్రూమ్ లోకి ఎంట్రీ ఇస్తాడు యష్. తనని తీక్షణంగా యష్ చూస్తుండటంతో వెంటనే వెళ్లి పడుకుంటుంది. అది గమనించిన యష్ తనకు సారీ చెప్పడానికి ఇదే సమయం అని తను కూడా వేద పక్కన పడకుంటాడు.
అది గమనించిన వేద ఏదో చేసేలా వున్నాడని భయపడుతూ ఓవరాక్షన్ చేస్తూ వుంటుంది. ఇలా కాదు గానీ సారీ అంటూ సెల్ఫీ వీడియో తీసి తనకు పంపిస్తే సరిపోతుందని ప్లాన్ చేస్తాడు. తన పక్కకే వెళ్లి సెల్పీ వీడియో తీస్తుంటే వెంటనే వేద.. యష్ వైపు తిరుగుతుంది.. అనుకోకుండా యష్ లిప్ కిస్ పెట్టేస్తాడు.. ఆ తరువాత ఏం జరిగింది? వేద రియాక్షన్ తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.