English | Telugu
వసుధార తప్పు నీవైపు ఉంటే శిక్ష నాకు పడింది.. రిషి ఎమోషనల్!
Updated : Feb 23, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-694 లో.. దేవయాని, రిషి కలిసి ఇంటికొస్తారు. అలా వచ్చాక.. "ఇంకెప్పుడు వసుధార వాళ్ళింటికి వెళ్ళకండి.. నాకు వసుధారకి మధ్య మీరు రాకండి పెద్దమ్మా" అని రిషి చెప్పేసి వెళ్ళిపోతాడు. అలా రిషి అనడం మహేంద్ర, జగతి వింటారు. "వసుధార వాళ్ళింటికి ఎందుకు వెళ్ళారక్కా" అని జగతి అడుగగా.. "నేను ఏం చేయాలో ఏం చేయకూడదో చెప్పాల్సింది నువ్వు కాదు కదా జగతి" అని దేవయాని సమాధానమిస్తుంది.
మరుసటి రోజు ఉదయాన్నే వసుధార వాళ్ళింట్లోని కిచెన్ లో వంట చేస్తుంటుంది. తను చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని పాటలు వింటూ ఉప్మా చేస్తుంది. అప్పుడే రిషి వస్తాడు. వసుధారని కిచెన్ లో చూసి తన వెనకాల నిల్చుంటాడు. వసుధార సడన్ గా వెనక్కి తిరుగుతుంది. రిషికి తగిలి వసుధార పడిపోతుంటే పట్టుకుంటాడు. ఒక మెలోడీ లవ్ డ్రామా మొదలవుతుంది. కాసేపు వసుధార కళ్ళలోకి అలానే చూస్తుండిపోతాడు రిషి. ఇక వసుధార కల అని అనుకుంటుంది. ఇంతలో రిషి సోఫాలోకి వెళ్ళిపోతాడు. వసుధార ఇదంతా కలనా.. రిషి సర్ వచ్చాడా లేదా అనే భ్రమలో ఉంటుంది. ఆ తర్వాత చక్రపాణి బయట నుండి ఇంట్లోకి వస్తుండగా రిషిని చూసి.. సర్ మీరెప్పుడు వచ్చారు. కాఫీ తీసుకురమ్మంటారా అని అడిగి రిషి వద్దని చెప్పినా తీసుకొస్తానని వెళ్తాడు. రిషి మాటలు విని, అతన్ని చూసి షాక్ అవుతుంది వసుధార. ఎందుకొచ్చారని వసుధార అడుగగా.. తనకి ఒక పెన్ డ్రైవ్ ఇచ్చేసి వెళ్ళిపోతాడు రిషి.
ఆ తర్వాత కాలేజీలో మిషన్ ఎడ్యుకేషన్ గురించి స్టూడెంట్స్ కి వసుధార క్లాస్ చెప్తుంటే క్లాస్ రూంకి వెళ్ళి కూర్చుంటాడు రిషి. క్లాస్ లో రిషిని చూసి ఇది కలనా? నిజమా? అని అనుకొని సర్లే అని క్లాస్ చెప్పేస్తుంది. క్లాస్ పూర్తయ్యాక స్టూడెంట్స్ అందరూ వెళ్ళిపోతారు. క్లాస్ లో రిషి ఒక్కడే కూర్చొని ఉంటాడు. రిషిని చూసి మళ్ళీ షాక్ అవుతుంది. రిషి దగ్గరికి వెళ్ళి ఎందుకొచ్చారు సర్ అని వసుధార అడుగగా.. నా రింగ్ నాకు ఇవ్వు అని అంటాడు. దానికి వసుధార ఇవ్వనని చెప్తుంది. ఎందుకివ్వవు అని రిషి అడుగగా.. "ఆ రింగ్ మీద 'VR' అని ఉంది.. 'V' అంటే వసుధార 'R' అంటే రిషి.. మనమిద్దరం కలిసి రిషిధార. అందులో నుండి అలా ఎలా విడదీస్తారు.. బంధం అంటే కలసి ఉండటం నేను ఇవ్వను" అని వసుధార అంటుంది. "బంధం అంటే బాధపెట్టడమని ఎక్కడైనా రాసి ఉందా.. తప్పు నీవైపు ఉంటే శిక్ష నాకు పడింది" అని చెప్పి రిషి ఎమోషనల్ అవుతాడు. ఆ తర్వాత అక్కడి నుండి వెళ్ళిపోతాడు. రిషి అడిగిన ప్రశ్నలకు వసుధార సరైన సమాధానమిస్తుందా తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకూ ఆగాల్సిందే.