English | Telugu
ఆదిరెడ్డి చేసిన పనికి ఫిదా అయిన నెటిజన్లు!
Updated : Feb 23, 2023
బిగ్ బాస్ సీజన్-6 లో కామన్ మ్యాన్ గా అడుగుపెట్టిన ఆదిరెడ్డి అందరికీ సుపరిచతమే.. బిగ్ బాస్ లో తన మార్క్ స్ట్రాటజీ తో టాస్క్ లు ఆడి, పర్ఫామెన్స్ చేసి టాప్-5 వరకూ ఉండి చాలా మంది ఫ్యాన్స్ ని సంపాదించుకున్నాడు.
అయితే బిగ్ బాస్ వెళ్ళకముందు రివ్యూలు ఇచ్చే ఆదిరెడ్డి హౌస్ లోకి వెళ్ళొచ్చిన తర్వాత కూడా తన రివ్యూలు, వ్లాగ్ లు ఆపలేదు. ఎప్పటికప్పుడు ప్రతీ విషయాన్ని తన యూట్యూబ్ ఛానెల్ లో షేర్ చేస్తున్నాడు. ఇటీవల హైదరాబాద్ కి తన చెల్లి నాగలక్ష్మి, భార్య కవితతో కలిసి వచ్చినట్టుగా ఒక వ్లాగ్, డ్యాన్స్ ప్రాక్టీస్ కి వెళ్తున్నట్టుగా వీడియో చేసి తన యూట్యూబ్ ఛానెల్ లో అప్లోడ్ చేసాడు. అయితే తాజాగా తన యూట్యూబ్ ఛానెల్ నాలుగు లక్షల సబ్ స్క్రైబర్స్ వచ్చినందుకు గాను ఆదిరెడ్డి తన భార్య కవిత, చెల్లి నాగలక్ష్మి తో కలిసి కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నాడు.
అయితే ఈ సెలబ్రేషన్స్ లో భాగంగా హైదరాబాదులోని చెంగిచెర్లలో ఉన్న ఒక వృద్ధాశ్రమంకి వెళ్ళి అక్కడ పెద్దవాళ్ళందరితో ఆదిరెడ్డి ఫ్యామీలీ కాస్త సమయం గడిపారు. ఆశ్రమంలో ఉన్న వారికి ఫ్రూట్స్ పంచారు. ఆ తర్వాత "ఇక్కడ ఎలా ఉంది. వీళ్ళు బాగా చూసుకుంటున్నారా?" అంటూ అన్నీ తెలుసుకున్నాడు ఆదిరెడ్డి. కేక్ కట్ చేసి తన యూట్యూబ్ ఛానెల్ ని సబ్ స్ర్కైబ్ చేసుకున్న ప్రతీ ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపాడు.. ఈ సేవ ఇక్కడితో అయిపోదు.. నేను హైదరాబాద్ కి వచ్చిన ప్రతీసారీ ఇక్కడికి వస్తానని చెప్పుకొచ్చాడు ఆదిరెడ్డి. అయితే ఈ వీడియో చూసిన నెటిజన్లు కామెంట్ల రూపంలో తమ అభినందనలు తెలుపుతున్నారు. కాగా ఇప్పుడు ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మరింది.